Post: #1

 సంధ్యావందనము

పూర్తి వివరణ కొరకు చదివి చూడండిః

 

 నాడులు మరియు సంధ్యాసమయముః

సంధ్య అనగా పగలు రాత్రి కలియు సమయము.

ఈ సమయము సాధారణముగా తెల్లవారుజ్హాము మరియు సూర్యాస్తమయ సమయములు.

కేవలము పైన చెప్పిన రెండు సమయములందు మనిషి పొట్ట ఖాళీగా వుండుట వలన ఆధ్యాత్మిక చింతనకు అనుకూలముగా వుండును.

అసలు సంధి అనగా సూర్యుడు నక్షత్రాలు కలసి కనిపించు సమయము

మనస్తత్వ శాస్త్ర ప్రకారము ప్రతి మనిషికి ఇడ, పింగళ మరియు సుషుమ్న అను మూడు నాడులు ముఖ్యముగా పని చేస్తూ వుంటాయి. ఈ నాడులు మానవ అవయువములు కాదు కానీ మనిషి తేజో శరీరముతో మాత్రమే చూడగలిగిన నాడులు. వీటిని సిద్దపురుషులు మరియు యోగులు మాత్రమే చూడగలుగుతున్నారు.

ప్రతిమానవునికి ఇడ, పింగళ అను నాడుల ద్వారా మాత్రమే ప్రాణ శక్తి ప్రసరిస్తుంది. కానీ ఈ నాడులు పగటి సమయమునందు సంకోచము చెంది వుండుట వలన మనకి ప్రాణశక్తి ప్రసారము అతి తక్కువగా జరుగుతుంది. కానీ పైన చెప్పిన సంధ్యా సమయములందు ఈ నాడులు నిఠారుగా వుండి ఎక్కువ ప్రాణశక్తి అందుతుంది.

ఆచమనముః ఈ ఆచమనము అను ప్రక్రియను మన శరీరమును బుద్ధిని చల్లబరచుకొను ప్రక్రియ (ఇది సశాస్త్రీయముగా నిరూపింపబడినది).

ప్రాణాయమము మరియు ధ్యానముః ప్రాణాయామము అను ప్రక్రియ మానసికముగా గాయత్రిమంత్రమును జపించుట.  పూరక, కుంభక మరియు రేచక అను ప్రక్రియలు జరుపుతూ గాయత్రి మంత్రము జపించుటవలన అత్యంత ఫలితమును పొందవచ్హును. కానీ పూరక, రేచకములను స్వంతముగా ప్రయత్నించవచ్హును కాని కుంభకమును మాత్రము గురువు సమక్షమున మాత్రమే నేర్చుకొనవలెను.

పూరకముః పూర్తిగా లోనికి గాలిని పీల్చుటను పూరకము అంటారు.

కుంభకముః లోనికి పీల్చిన గాలిని రెండు ముక్కు రంధ్రములను మూసి పొట్టలో నిలిపి వుంచుటను (వుంచగలిగినంత సమయము) కుంభకము అంటారు.

రేచకముః అలా కుంభించిన గాలిని ఒక్క సారిగా వేగముగా బయటకి పూర్తిగా వదిలివేయుటను రేచకము అంటారు.

ధ్యానముః కండ్లు మూసుకుని, నిటారుగా కూర్చుని (అంటే అవయవములు బిగించకుండా) ఓంకారమును మనసులో తలచుకుంటూ శ్వాసను నిదానముగా లోనికి పూర్తిగా తీసుకుని, పూర్తిగా బయటకి వదులుతూ గమనిస్తూ వుండవలెను.పూర్తిగా శ్వాసను గమనిస్తూ ఆలోచనలను దరిచేరనీయకుండుటను ధ్యానము అంటారు.

గాయత్రీ జపముః గాయత్రీ జపము అనునది సంధ్యావందనములోని అతి ముఖ్యమైన భాగము, దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే అగును.

మన శరీరములోని 24 ముఖ్య కేంద్రములను ఉత్తేజపరచు అతి పవిత్రమైన, అతి గోప్యమైనది ఈ గాయత్రీ మంత్రము.

అర్ఘ్యముః సంధ్యావందనములో ఇది ఒక అందమైన ప్రక్రియ, ఇది గాయత్రీ జపము ఎంత విశిశ్థత కలిగి వుందో అర్ఘ్యమునకు కూడా అంతే ప్రాధాన్యత కలదు అని చెప్పవచ్హును. ఇది కూడా సశాస్త్రీయముగా నిరూపించబడినది.

కేవలము చదవటమే కాదండోయ్....

చదివింది సాధ్యమైనంతవరకు ఆచరించటానికి ప్రయత్నించండి.

సంధ్యావందనము పుస్తకముకొరకు క్రింది లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

ఏవైనా తప్పులు దొర్లిన ఎడల మన్నించి సరిదిద్దగలరు.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి


Post: #2
Hi there,

Can anyone upload this file again?

Thanks
Sri

Post: #3
Please upload this book

Post: #4
Dear chandu gaaru,
mee daggara patalapannam ane pustakam unte daanini pls upload cheyyandi.

bharadwaj

Post: #5
Dhanyavadamulu chandu gaaru, meeru ichina link panicheyyatamuledu

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)