Post: #1
ఆతతాయి అంటే ఏమిటి????
చెప్పుకోండి చూద్దాం!!!!!!!!!!!

ఏమి లేదండి ఇలా మనకి తెలుగులో తెలియని విషయాలను తెలుసుకుంటూ తెలియపరుస్తూ వుందామని నా ఆలోచన...

బాగుందంటారా????
మరి అయితే సమాధానం చెప్పండి?

మీ...

చంద్రమౌళి పసుమర్తి

Quote this message in a replyReply

Post: #2
మిత్రమా...!!

చందు

ఆతతాయి

ఆతతాయి అసలు పదం
ఆకతాయి అనే పదం కాదు
ఆ పదం ఆతతాయి.
good question go a head
Quote this message in a replyReply

Post: #3

(13-Nov-2009 05:44 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.

మిత్రమా...!!

చందు

ఆతతాయి

ఆతతాయి అసలు పదం

ఆకతాయి అనే పదం కాదు

ఆ పదం ఆతతాయి.

good question go a head

మిత్రమా.....

నీది తెనాలే నాది తెనాలే అన్నట్లు....మీది విజయవాడే..... మాది విజయవాడే...........

సరే.... విషయంలోకి వద్దాం......

జవాబు ఇవ్వటానికి ప్రయత్నించినందుకు నా అభినందనములు.

కానీ....

ఆతతాయి మరియు ఆకతాయి వేరు పదాలు అసలు వాటి అర్థాలు కూడా వేరు.

ఆకతాయి అంటే అల్లరి పనులు చేసే పిల్లలను సహజంగా అలా పిలుస్తాము.

ఆతతాయి అంటే అర్థం అందించాను తరువాత పోస్టులో చూడండి.

దాన్లోనే మరియొక ప్రశ్న కూడా బోనస్ అందించాను జవాబు సాధించటానికి ప్రయత్నిస్తారు అనుకుంటాను.

మీ...

Quote this message in a replyReply

Post: #4

ఆతతాయి అంటే.................

అంటే....................

అంటే......................

ఒప్పుకుంటారా నేనే గెలిచానని.....

ఒప్పుకోవాల్సిందే.... ఎందుకంటే సరైన సమాచానము రాలేదు కదా.....

మిత్రమా......................

ఆతతాయి అంటే ఆకతాయి కాదు. కానీ...............

ఆతతాయి అంటే.......... చంపుటకు ఉద్యుక్తుడైనవాడు అని అర్థము.

సరే మరి అర్థము తెలిసింది కదా!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

సమాధానము ఇవ్వనందుకు మరొక ప్రశ్న మీకు బోనస్

ఇప్పుడు

ఆతతాయిలు ఎన్ని రకాలో చెప్పగలరా???????????

అంటే ఎటువంటి వారిని ఆతతాయిలు అంటారు అని!!!!

చెప్పుకోడి చూద్దాం??????????????????

పై ప్రశ్నకి సమాధానము నేను చెప్పాను కదా....

ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానము మీ వంతు....

ఓ.కే...

మీ సమాధానము కొరకు ఎదురుచూస్తూ....

మీ.....

Quote this message in a replyReply

Post: #5

ఆతతాయిలు రకాలుః

ఆతతాయి అనగా చంపుటకు ఉద్యుక్తుడయిన వాడు అని తెలుసుకున్నాము.

ఆతతాయిలు ఆరు రకములు.

వారు....

1. అగ్నిదుడు

2. గరదుడు

3. శస్త్రపాణి

4. ధనాపహుడు

5. క్షేత్రాపహారి

6. దారాపహారి

సరే వీరి గురించి వివరణ చూద్దాము...

1. అగ్నిదుడుః నిప్పును వుపయోగించి చంపటానికి పూనుకొన్నవాడిని అగ్నిదుడు అంటాము.

ఉదాః భారతములో పాండవుల లక్క ఇల్లు కాల్చినవాళ్ళు.

2. గరదుడుః విషాన్ని ప్రయోగించి చంపటానికి పూనుకొన్నవాడిని గరదుడు అంటాము.

ఉదాః భారతములో భీమసేనునికి విషము ఇచ్హి చంపటానికి ప్రయత్నించినవాళ్ళు.

3. శస్త్రపాణిః ఆయుధములు వుపయోగించి చంపటానికి పూనుకొన్నవాళ్ళు.

ఉదాః మన ఉగ్రవాదులు మొ॥ వారు.

4. ధనాపహుడుః ధనము, ఐశ్వర్యము కాజేయుటకొరకు చంపుటకు ప్రయత్నించు వాళ్ళు.

ఉదాః దొంగలు మొ॥ వారు.

5. క్షేత్రాపహారిః రాజ్యం, ఆస్తి కాజేయుటకొరకు చంపుటకు ప్రయత్నించువాళ్ళు.

ఉదాః పొరుగుదేశాలవాళ్లు మొ॥వారు.

6. దారాపహారిః వేరొకరి భార్యని అపహరించుటకొరకు చంపుటకు ప్రయత్నించువాళ్ళు.

ఉదాః కీచకుడు మొ॥ వారు.

మిత్రులారా....

ఈ సమాజములో మనమధ్యనే ఈ ఆరు రకాల ఆతతాయులు తిరుగుతున్నరు. ఎక్కువ మంది వారే వున్నారు.

కనుక మిత్రమా తెలుసుకుని మసలుట మంచిది.

అందుకే తెలుసుకో....

తస్మాత్ జాగ్రత్త... జాగ్రత్త....

తెలిసిందా మిత్రులారా.....

నచ్హిందా నేను చెప్పిన విషయము.....

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ.....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)