Post: #1

గత ఏడు మాసాలుగా problem అన్న వారికి అభయహస్తమిస్తూ,........  సందేహమా? అయితే సంకోచించక  మీ సందేహాలను నివృత్తి చేసేందుకే నేనున్నానంటూ..............కొత్త వారికి స్వాగతమంటూ ..............పాత వారితో మమేకమవుతూ.........శుభాకాంక్షలు తెలుపుతూ.............   నూతన విషయాలకు వేదికవుతూ...........శరవేగంగా దూసుకుపోతున్న తొలి తెలుగు కంప్యూటర్ బేస్డ్ ఫోరం "మహిగ్రాఫిక్స్" లో Reply లు రాని, లేని పోస్టులు కూడా ఉన్నాయి.  అవి ఇలా కనిపించి అలా కనుమరుగవుతున్నాయి.
 
ఉదా:- 'File recovery problem' thread ఆగష్టు 19న post చేయబడింది కానీ reply కోసం నవంబర్ 3వ తేది వరకు వేచి చూడవలసివచ్చింది. ఇక రిప్లయ్యే రాదనుకుని మరచిపోయిన పోస్టుకు బత్తిన రామన్ గారు స్పందించి తగు సమాధానమిచ్చరు. తరువాత శ్రీనాథ్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు పాలుపంచుకొని సూచనలిచ్చారు. రిప్లయ్యే రాదనుకున్న పోస్టు ఇపుడు అత్యధిక replies వచ్చిన post ల సరసన చేరింది. ఇక నా మనవి ఏంటంటే Newest threads, Newest post ల వలే Threads without replies ని కూడా హైలైట్ చేస్తే బాగుంటుంది. ఇలా చేయడం వలన ఎవరో ఒకరు స్పందించేందుకు ఆస్కారముంటుందని నా అభిప్రాయము. నిపుణులు కూడా సాధ్యమైనంత వరకు New threads కు సమాధానమివ్వవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

Quote this message in a replyReply

Post: #2
ఇది నిర్వాహకులు గమనించవలసిన విషయం . దీని గురించి తగిన ప్రయత్నం చేయగలము Smile

ఏదైనా ఒక సమస్యకి సంబంధించిన పరిష్కారం సుమారు 5 రోజులవరకు లభించకుంటే మరల
అదే విషయం లో సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పోస్టు చేయండి . ఇక్కడ ఫోరంల
లో సెర్చి చేస్తే చాలావరకు ఫలితం లభించవచ్చును . లేదా వేరే మార్గాల ద్వారా మీకు పరిష్కారం
లభిస్తే ఆ విషయాన్నీ రిప్లైగా పోస్టు చేయగలరు . మరో ముఖ్యమైన సూచన : ఏదైనా ఒక
విషయాన్ని ప్రారంభించేవారు తప్పనిసరిగా ఆ విషయాన్ని సబుస్క్రైబు చేసుకుని రిప్లైలకి
సంబంధించిన నోటిఫికేషనులని ఈమెయిలు ద్వారా పొందితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది
Quote this message in a replyReply

Post: #3

siva kumar garu i also agree and support your opinion. new threads are becoming older day by day as no one is answering those queries. dear admins please try to highlight unsolved queries seperately. i suggest we must have unsolved queries like that of solved ones . i also didnt get answers for many of my queries (10 approx) . if you ask me to post again i'l do the same. i request our senior members to try answer those queries . than q.

Quote this message in a replyReply

Post: #4

Nicky గారు, మొదటగా నా అభిప్రాయంతో ఏకీభవించినదుకు ధన్యవాదములు. నా విన్నపాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేరు అని భావిస్తుండగా మీ మద్దతు తెలిపి నా పోస్టుకు బలాన్నిచ్చారు. వేచిచూద్దాం.... ఇంకెంతమంది భాగస్వామ్యులౌతారో,   ఆశిద్దాం.....ఫోరం నిర్వాహకులు కూడా సానుకూలంగా స్పందిస్తారని?

Quote this message in a replyReply

Post: #5
I am Still Waiting For UR Response................
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)