Post: #1

ఈ చిక్కుముడి విప్పటానికి ప్రయత్నించండి....

అసలు చిక్కుముడి ఏంటి అంటారా???

ఏమిలేదండి?

అక్షౌహిణి అంటే ఏమిటి?

అక్షౌహిణి అనగా ఎంత?

త్వరగా బదులు ఇస్తారు కదూ!!!!.....

మీ జవాబుకోసం ఎదురుచూస్తూ.....

మీ.....

Quote this message in a replyReply

Post: #2
అక్షౌహిణి అనే పదం ఒక సైన్య విశేషణానికి సంబంధించినది. 21,870 రథాలు,21,870 ఏనుగులు,65,610 గుఱ్ఱాలు,1,09,350 మంది కాల్బలము(వాహనాలపై కాక నేలపైన నడిచే సైనికులన్నమాట)మొత్తం కలిసి ఒక అక్షౌహిణి అవుతుంది.
Quote this message in a replyReply

Post: #3

సుధారాణి గారి సమాధానము అమోఘము.

నేను అక్షౌహిణి అను దానిని ఇంకాకొంచెము వివరించుదామనుకొంటున్నాను.

వివరణ చూడండి.

అక్షౌహిణి అనగా సేనాబలమునకు సంబంధించిన విషయము.

1 రథము + 1 ఏనుగు + 3 గుర్రములు + 5 కాల్వురు కలిపి 1 పత్తి (10)

3 పత్తులు ఒక సేనాముఖము (30)

3 సేనాముఖములు ఒక గుల్మము (90)

3 గుల్మములు ఒక గణము (270)

3 గణములు ఒక వాహిని (810)

3 వాహినులు ఒక పృతన (2,430)

3 పృతనలు ఒక చమువు (7,290)

3 చమువులు ఒక అనీకిని (21,870)

10 అనీకులు ఒక అక్షోహిణి లేక ఒక అక్షౌహిణి (21,87,000)

అంటే మొత్తము

రథములు = 21, 870

ఏనుగులు = 21, 870

గుఱములు= 65,610

పదాతులు = 1,9350

అదండీ.....

అక్షౌహిణి అంటే..........

సుధారాణి గారు మీ ప్రయత్నమునకు నా అభినందనలు. మీరు ఇలాగే ప్రయత్నములను కొనసాగించగలరని నా విన్నపము.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)