Post: #1

యోజనము అంటే ఏమిటి?

యోజనము అంటే ఎంత?

సమాధానము చెప్తారు కదూ.....

మీ...

Quote this message in a replyReply

Post: #2

యోజనము అంటే రెండు ప్రదేశాలమధ్య దూరము.

8 పరమాణువులు = 1త్రిసరేణువు (1 త్రిస్రము)

8 త్రిసరేణువులు  = 1 రథరేణువు

8 రథరేణువులు = 1 వాలాగ్రము

8 వాలాగ్రములు = 1 లిక్షము

8 లిక్షములు = 1 యూకము

8 యూకములు = 1 యవము

8 యవములు = 1 అంగుళము

12  అంగుళములు = 1 వితస్తి

2 వితస్తులు = 1 హస్తము

4 హస్తములు = 1 దండము

8 దండములు =  1 రజ్జువు

500 దండములు = 1 క్రోశము లేక 1క్రోసు = 2000 హస్తములు

2 క్రోసులు = 1/2 గవ్యూతి = 4000 హస్తములు

4 క్రోసులు = 1 గవ్యూతి = 8000 హస్తములు

4 గవ్యూతులు = 1 యోజనము = 32000 హస్తములు

అదండీ సంగతి......

అర్థమయింది కదూ.....

ముందు మనం తెలుసుకుని తరువాత చిన్నపిల్లలకి నేర్పితే మన పూర్వము వుపయోగించే కొలతలు కనుమరుగవవు అని నా వుద్దేశ్యము.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ.....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)