Post: #1

ప్లీజ్..... కొంచెం చెప్పరూ....

అసలు విషయము చెప్పకుండా... ఏంటి ఈ కొసరు ప్రశ్న అంటారా?

ఏమి లేదండీ...

నేను షిర్డి సాయినాధుని సత్చరిత్ర చదువుతున్నప్పుడు..

బాబాగారు భౌతిక దేహమును విడచునప్పుడు లక్ష్మిబాయికి 5+4 = 9

నాణెములను ఇచ్చుట జరిగినది, అవి నవ విధభక్తులకు గుర్తుగా ఇవ్వబడినవి అని చెప్పుట జరిగినది.

ఇక్కడ నాకు వచ్చిన సందేహము ఏమిటంటే......

నవ విధభక్తులు ఏమిటి?

కొంచెము వివరముగా చెప్పగలరు.

సమాధానము ఇస్తారు కదూ.... త్వరగా.....

మీ.....

Quote this message in a replyReply

Post: #2

భక్తి కి 9 రకాల పద్దతులు ఉన్నాయి.

అవి

శ్రవణము,

కీర్తనము,

స్మరణము,

పాద సేవనము,

పూజ,

నమస్కారము,

దాసోహమనుట,

సఖ్యము,

ఆత్మ నివేదనము.


వీటిలో ఏదో ఒక మార్గమును మనము అనుసరించవచ్చు.


ఈ విషయం కూడా బాబా సచ్చరిత్రలో ఉంది. నేను అందు నుండే గ్రహించాను.

ఈ సమాధానంను అనంతరావ్ పాటంకర్ కు దాదాకేల్కర్ చెప్పెను.

ఏమైనా తప్పులుంటే మన్నించగలరు.


ఈ అవకాశమును నాకిచ్చినందుకు ధన్యవాదములు.

Quote this message in a replyReply

Post: #3

జాహ్నవి గారు,

చాలా అద్భుతముగా చెప్పారు. మీవలన మన ఫోరం సభ్యులందరికి నవవిధభక్తులంటే మరొకమారు గుర్తు చేసినట్లు అయినది.

మీకు నా తరఫునుండి మన ఫోరంసభ్యులనుండి ధన్యవాదములు.

మళ్ళీ మరో ప్రశ్న అడగబోతున్నాను.

దయచేసి సమాధానము కొరకు ప్రయత్నిస్తారు కదూ....

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)