Post: #1

వివిధ జీవుల జన్మలు ఎలా కలుగుతాయి? చేసిన పాపపుణ్యాలు ఏమవుతాయి? అసలు ఏమిటిదంతా???

జీవులు కుక్కలుగా మనవులుగా వివిధరూపాలలో దేని ఆధారముగా పుడుతున్నారు.

ఈజన్మలో చేసిన పాపపుణ్యాలు ఏమవుతాయి?

మరి క్రితంజన్మలలో చేసిన పాపపుణ్యాలు ఏమవుతాయి.....

మీకు తెలిస్తే కొంచెం చెప్పండి.....

మీ సమాధానము కోసం ఎదురుచూస్తూ......

మీ.....

Quote this message in a replyReply

Post: #2

కర్మానుసారంగా జన్మలు కలుగుతాయి.

మిగిలిన వాటి సమాధానాలు ఒక్క పోస్ట్ లో తెలిపేవిగా లేవు.


వీటికి సమాధానాలు కార్తీక, మాఘ, వైశాఖీ పురాణాలలో , భగవద్గీత లో  లభించగలవు.

నేను ఇవి మాత్రమే చదివాను.

Quote this message in a replyReply

Post: #3

జాహ్నవి గారు,

మీరు చెప్పింది వాస్తవమే...

కర్మ అంటే పని. మనిషి ప్రతి క్షణం మారుతూవుండే ప్రకృతి గుణాలవల్ల ఏదో ఒక కర్మ చేస్తునే వుంటాడు.

ఈ కర్మలు మూడు రకాలుగా వుంటాయి. అవి

సంచితం

ప్రారబ్దం

ఆగామి

సంచితంః- జన్మజన్మలనుంచి సంపాదించి పెట్టుకున్న కర్మ రాశి. పుణ్య కర్మ జీవులు పుణ్య జన్మని, పాప కర్మ జీవులు శునక, సూకరాది జన్మలను పొందుతారు అని పెద్దలు చెప్పియున్నారు.

ప్రారబ్దంః- ఆత్మని అంటిపెట్టుకున్న సంచిత కర్మరాశిలో కొంతభాగం ఈ ప్రారబ్దం. తన ప్రతి జన్మలో దీనిని పూర్తిగా అనుభవించేంతవరకు మనిషి శరీరంలో జీవం ఉంటుంది అని పెద్దలు చెప్పియున్నారు.

ఆగామిః- ప్రారబ్ద కర్మ అనుభవిస్తున్న ఈ జన్మలో చేస్తున్న కర్మని ఆగామి అంటారు. ఇది సంచిత కర్మరాశిలో కలసిపోయి వచ్చే జన్మలలో అనుభవానికి వచ్చేది అని పెద్దలు చెప్పియున్నారు.

పైన చెప్పినవి కాక ఇంకా చతుర్విధ కర్మలు వున్నయి. అవి

విహిత కర్మలు

కామ్య కర్మలు

ప్రాయశ్చిత్త కర్మలు

నిషిద్ధ కర్మలు

విహిత కర్మలుః- వర్ణాలను శాస్త్రాలను బట్టి శాస్త్రం విధించిన పనులు.

కామ్య కర్మలుః- మనిషి తనకు ఇష్టమై చేసే పనులు (వర్ణాలకు శాస్త్రాలకు అతీతంగా)

ప్రాయశ్చిత్తకర్మలుః- ఈ పై విహితకర్మలు ఆచరించకపోయినందువలన కలిగే పాపాలను పోగొట్టే పనులు.

నిషిద్ధ కర్మలుః- ప్రాణహింసను ఎదుర్కోనే పనులు.

అదండీ సంగతీ............

ఎందుకు పునర్జన్మలు కలుగుతాయో???? మనం చేసిన పాపపుణ్యాలు ఏమవుతాయో?????

అర్థమయ్యింది కదూ.....

మీ.....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)