Post: #1

నా ఇంటి నుండి, నా వీధి నుండి,

చివరకు నా ఊరి నుండి, గూడెంనుండి వెళ్ళగొట్టి

అయిన వాళ్ళ ఉసురు తీసి,

నా గొడ్డూ గోదాను లాక్కొని..

నన్ను లూటీ చేసి,

నేనల్లుకున్న నా కలల పొదరిల్లను కూల్చి,

స్వదేశంలోనే కాందిశీకున్ని చేసి,

నా జీవితాన్ని నా మెడపై కాడిగా మార్చి,

నీ ముళ్ళ చేతులతో పావురాలను ఎగరేసే

నీ ద్రోహాన్ని బద్దలుకొట్టే క్షణంకోసం

ఈ కంచె వెనకాల నేను.....

(శ్రీలంక తమిళ సోదరులు, దండకారణ్య ఆదివాసీల పట్ల సంఘీభావంతో)

Quote this message in a replyReply

Post: #2

(22-Nov-2009 01:33 PM)kumarvarma Wrote: You are not allowed to view links. Register or Login to view.


నేనల్లుకున్న నా కలల పొదరిల్లను కూల్చి,

స్వదేశంలోనే కాందిశీకున్ని చేసి,


మిత్రమా !!

మీ వ్యధ వెనకాలా మీ ఆశావాదం నన్ను కదిలించింది.

ఆ రోజు తప్పకుండా వస్తుందని - రావాలని కోరుకుంటున్నాను.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
Thanks for your kind concern about my feeling
Quote this message in a replyReply

Post: #4
Chaala bagundi
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)