Post: #1

ఆదివారము-ఉపవాస ఫలితము

ఆదివారము ఆ ఆదినారాయణుడైన శ్రీ సూర్య భగవానునికి అంకితము. కనుక ఆదివారమునాటి ఉపవాసము శ్రీ సుర్యభగవానునికి అంకితము.

ఆదివారమునాటి రంగు - ఎరుపు

ఎవరైతే ఆదివారమునాడు ఉపవాసముంటారో వారు సూర్యాస్తమయ సమయములోపు మాత్రమే పగటి సమయమందు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకొనవలెను.

ఉపవాసముండు వారికి నిషిద్దమైన పదార్థములు ముఖ్యముగాః- ఉప్పు, నూనె మరియు నూనెలతో కూడిన పదార్థములు అనగా వేపుడు పదార్థములు, మధువు, మాంసములు విసర్జిత పదార్థములు.

భగవాన్ శ్రీ సూర్య నారాయణుని పూజించునపుడు ఎరుపు రంగు పూలతోనే పూజించవలెను. ఎరుపు చందనమును నుదుటిపై తిలకముగా ధరించవలెను.

శరీరమును అత్యంత శుభ్రముగా వుంచుకొనవలెను.

ఏమనుజుడైనా తన జీవితకాలములో సూర్యభగవానుడు ప్రకాశించునంతవరకు మైథునము చేయరాదు. మైధునము అనునది రాత్రులందు అదియును సంతానము పొందుటకొరకు భార్య/భర్తతో మాత్రమే ఆచరించవలెను.

ఆదివారవ్రతమువలన ప్రజలకోరికలు సిద్దించును అనుటలో ఎటువంటి సందేహములేదు.

ఎవరైతే చర్మసంబంధిత రోగములతో బాధపడుచున్నారో వారు ఈ వ్రతమాచరించిన తప్పక రోగవిముక్తులు కాగలరు.

భక్తులు పేదవారికి ధన లేదా వారికి తోచిన సహాయము (దానము) చేయుట ఉత్తమము.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2
chandu garu me posts bagunai.........thursday gurinchi telupandi......

Post: #3

స్వాతి గారు,

ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర మరియు శని వరుసలో ప్రచురిద్దామని నా ఆలోచన...

ఒకవేళ మీకు తప్పనిసరిగా త్వరగా అవసరమైతే తెలుపగలరు.

తప్పనిసరిగా గురువారము ఫలితముగురించి ప్రచురిస్తాను.

మీ...


Post: #4

చందు గారు నేను ప్రతి ఆదివారం వంటిపూట ఊంటాను, కాని తెల్ల బట్టలు దరిస్తను.


మీరు చెప్పినట్లు యెరుపు వాడవలెనా?



Post: #5

నాగ్ గారు,

అరుణ వర్ణమున విరాజిల్లు శ్రీ సూర్యభగవానునికి అరుణ వర్ణమన్న ప్రీతి అని వేరే చెప్పనక్కరలేదు.

కనుక మీకు మీ జాతక రీత్యా ఎవరైనా తెల్లని బట్టలు ధరించమని చెప్పిన ఎడల అలానే కొనసాగించండి.

లేనిచో ఎరుపు బట్టలు ధరించుట ఉత్తమమని నా అభిప్రాయము మరియు శ్రేయస్కరము.

మీకు ఇంకా ఏమైనా సందేహాలు వున్న ఎడల తప్పనిసరిగా రెప్లయ్ ఇవ్వండి.

మీ....


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)