Post: #1

సోమవారము - ఉపవాస ఫలితములు

 సోమవారము పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రము.

సోమవారమునాటి ఉపవాసము సూర్యోదయముతో మొదలయి సూర్యాస్తమయముతో ముగుస్తుంది. ఆనాటి సాయంత్రము శివభగవానుని పూజానంతరము మాత్రమే భోజనము చేయవలెను.

సోమవారమునాడు పార్వతీపరమేశ్వరులను పూజించవలెను.

శ్రావణ సోమవారములు ఉపవాసదీక్ష అత్యంత ఫలప్రదములు.

ఎవరైతే సోమవార ఉపవాస దీక్షలుంటారో వారికి సర్వ అభీష్టములు నెరవేరుటేకాక సద్భ్హుద్ధి మంచి ఆలోచనాపరులుగా దీవించబడెదరు.

పెండ్లికాని యువతులు ఈ వ్రతమాచరించిన ఎడల ఆదర్శవంతుడైన యువకుని భర్తగా పొందగలరని కొన్ని ప్రదేశములవారి నమ్మకము.

సోమవార ఉపవాస దీక్షగురించి అనేక కథలు ప్రచారములో వున్నయి. వాటిలో చెప్పుకోదగ్గవి ముఖ్యముగా మూడు. అవి

ఒక పేద బ్రాహ్మణుడు సోమవారవ్రత దీక్ష ఆచరించి గొప్పధనవంతుడైనట్లు ప్రతీతి.

ఒకానొక ధనవంతుడు చాలా కాలము తరువాత సోమవార వ్రత ఫలితముగా సంతానముగా పుత్రుని పొందుట ఆ పుత్రుడు అకాల మరణము చెందగా వ్రత ఫలితమువలన శివ మహాదేవుని కరుణతో మరల బ్రతుకుట అనునది మరియొక ఇతిహాసము.

మూడవది అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ శివ పార్వతుల మధ్య జరిగిన పాచికల కధ.

మీ సందేహాలను సలహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2
chandu garu bugundi me post......monday elanti dustulu darinchali,ememi tinakudadu kuda telipite baguntundi.....

Post: #3

స్వాతి గారు,

ధన్యవాదములు.

సోమవారము రంగు మరియు ఆహార పదార్థములకు అంత ప్రాముఖ్యత లేదు.

కానీ మనము తృప్తి కొరకు సోముడు అనగా చంద్రుడు కనుక తెలుపు బట్టలు ధరించవచ్చు మరియు తెలుపు రంగు పూలతో పూజ చేయవచ్చు.

ఇక ఆహార విషయానికి వస్తే మాంసాహారము, మధుపానము, ధూమపానములు నిషిద్ధములు. తక్కిన అన్ని ఆహారములు తీసుకొనవచ్చును.

ఇక ఏ రోజు ఉపవాసమున్నప్పటికి మైథునము అనగా (భర్త/భార్య తో) శృంగారము నిషిద్ధము.

మీకు ఇంకను ఏమైనా సందేహములు ఉంటే తెలిపరచగలరు.

మీ....


Post: #4
very good information.......thank you so much...........

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)