Post: #1

మంగళ వారము - చేయదగినవి - చేయకూడనివి - ఉపవాస ఫలితము

 మంగళవారము రామభక్త హనుమంతునికి అత్యంత ప్రీతికరము. మంగళవారము నాటి ఉపవాసము హనుమంతుడు మరియ మంగళవారమునకు అధిపతి అయిన మరియు నవగ్రహాలలో ఒక్కడయిన మంగళుడు లేదా అంగారకుడు.

అంగారకుడు సమస్యలు కలిగించును (మన పాప కర్మల ఫలితముగా). కనుక మంగళవారము నాడు ఉపవాసమున్నచో ఆ కష్టములనుండి బయటపడే అవకాశము ఉన్నది.

మంగళవారము వాడవలసిన రంగు - ఎరుపు

సహజముగా మంగళవారము మనము హనుమంతుని పూజిస్తాము. కాని కొన్ని ప్రదేశములలో వారి వారి సాంప్రదాయానుసారము సుబ్రహ్మణ్యేశ్వరుని పుజిస్తారు.

ఏ దంపతులు పుత్ర సంతానము కోరుకుంటారో వారు మంగళవార వ్రతమును ఆచరించి పుత్రసంతానమును పొందగలరు.

అంతేకాక కుటుంబములో సుఖసంతోషములు వర్ధిల్లును.

ఎవరైతే జ్యోతిష్యశాస్త్రమును నమ్ముతారో వారు అంగారకుని ద్వారా కలుగు అశుభ ఫలితములు పొందకుండా ఉండుటకు మంగళవార ఉపవాస దీక్ష అవలంబిస్తారు.

మంగళవార ఉపవాస దీక్ష చేయువారు కేవలము రోజునకు ఒక్కసారి మాత్రమే భుజించవలెను. అదికూడా గోధుమలు మరియు బెల్లముతో కూడిన పదార్థములు భుజించవలెను.

ఎక్కువగా ప్రజలు 21 మంగళవారములు ఈ దీక్ష ఆటంకములు లేకుండా ఎవరు కొనసాగిస్తారో వారికి కష్టములు దరిచేరవు.

మంగళవారమునాడు ఎరుపు రంగు దుస్తులు ధరించవలెను మరియు ఎరుపు రంగు పూలతో హనుమంతుని పూజించవలెను.

అంగారక గ్రహ ప్రభావమువలన కలుగు కష్టములు హనుమంతుని పూజించి తొలగించుకొనవచ్చును అని ఒక నమ్మకము.

మీ సలహాలను మరియు సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2
very good information.........................

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)