Post: #1

బుధవారము - చేయదగినవి - చేయకూడనివి - ఉపవాస ఫలితములు

బుధవారము భగవాన్ శ్రీ కృష్ణునికి అత్యంత ప్రీతికరము మరియు నవగ్రహాలలో ఒకరైన బుధునికి అత్యంత ప్రీతిపాత్రము.

బుధవారము ఉపవాసము చేసిన ఎడల కుటుంబములోని కలతలు తొలగిపోయి అత్యంత సుఖప్రదమైన, శాంతిదాయకమైన జీవితము పొందగలరని చెప్పబడినది.

బుధవార ఉపవాస వ్రతము చేయువారు కేవలము మధ్యాహ్నము మాత్రమే భోజనము చేయవలెను. దంపతులు కలసి భోజనము చేయవలెను.

బుధవారము ఆకుపచ్చ రంగు అత్యంత శ్రేష్ఠము.

బుధుని వాహనము సింహము. దయ మరియు ఉదార స్వభావుడు.

కొన్ని ప్రదేశాలలో ప్రజలు క్రొత్త వ్యాపారములు వ్యవహారములు బుధవారమునాడు మొదలుపెడతారు. ఎందుకనగా బుధవారమునాటిరోజు మొదలుపెట్టిన వ్యాపారములకు బుధుడు సహాయకారిగా వుండి అభివృద్ధికి తోడ్పడునని వారి అభిప్రాయము.

అలాగే బుధవారమునాడు విద్యాసంబంధిత విషయములను కొన్ని ప్రదేశములలో మొదలుపెడతారు.

బుధవారమునాడు ఉపవాసముండేవారు ఆరోజు  మద్య మాంసములకు దూరముగా ఉండుట శ్రేయస్కరము.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)