Post: #1

గురువారము - చేయదగినవి - చేయకూడనివి - ఉపవాస ఫలితములు

గురువారము దీనినే బృహస్పతి వారము లేదా వృహస్పతి వారము అని కూడా పిలుస్తుంటాము. ఈ రోజు శ్రీ మహా విష్ణువు, దేవగురువు బృహస్పతి, శ్రీ సాయినాధ మహరాజ్, శ్రీ గురుదేవ దత్త, జగద్గురు ఆది శంకరులు మొదలుగా గల గురువులకు అత్యంత ప్రీతి పాత్రమైన రోజు.

గురువారము రంగు - పసుపు

గురువారమునాడు కూడా ఒకపూట భోజనము చేయవలెను (పగలు/రాత్రి).

కొన్ని ప్రదేశములలో గురువారము నాడు హనుమంతుని గుడికి వెళ్ళే ఆచారము కూడా కలదు.

 

గురువారమునాటి ఉపవాసమునకు సంబంధించి అనేక కధలు ప్రచారములో వున్నయి. ఆయా ప్రదేశములను బట్టి ఆయా కధలు ప్రచారములో వున్నాయి.

దాదాపు అన్ని కధలలో చెప్పబడినదాని ఆధారముగా ఎవరైతే గురువారమునాడు పూజ చేసి ఉపవాసవ్రతమును అవలంబిస్తారో వారు సుఖ సంపదలతో వర్ధిల్లుతారు అని చెప్పబడియున్నది.

గురువారమునాడు శ్రీ మహావిష్ణువు సాధువు రూపములో నమ్ముకున్న భక్తుల ఇంటికి గురువారమునాడు తప్పక వచ్చును అని ప్రతీతి.

ఎవరైతే గురువారము ఉపవాస వ్రతము ఆచరిస్తారో అట్టివారు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు పూలతో పసుపురంగు పండ్లతో భగవంతుని పూజించినయెడల వారికి అష్టైశ్వర్యములు సిద్ధించును అనుటలో అతిశయోక్తిలేదు.

ఆహారము ఒకసారి మాత్రమే తప్పనిసరిగా శనగలు మరియు నెయ్యి వుపయోగించవలెను. పసుపురంగు పదార్థమును భుజించుట శ్రేష్ఠము (పులిహోర/కేసరి) మొదలగునవి.

మద్యమాంసములు నిషిద్ధములు. మైథునము కూడా ఉపవాసవ్రతమాచరించు దంపతులకు నిషిద్ధము.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)