Post: #1

శుక్రవారము - చేయదగినవి - చేయకూడనివి - ఉపవాస ఫలితములు

 శుక్రవారము అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. అంతేగాక శుక్రుడు అధిష్టాన దేవత.

శుక్రవారము ఉపవాస వ్రతములలో అతి ముఖ్యమైనదిగా చెప్పుకొనవచ్చు. ప్రజలు సంతోషిమాతకు శుక్రవారమునాడు ముఖ్యముగా వుపవాసముంటారు.

దీనినే పదహారు శుక్రవారముల వ్రతము అని కూడా అంటారు.

శుక్రవారము నాటి రంగుః తెలుపు

శుక్రుడు సంతోషదాయకుడు మరియు ధనప్రదాయుడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఎవరికైతే శుక్ర మహర్దశ నడుస్తుందో వారు ఆ దశలో అత్యంత సంతోషముగా మరియు సంపాదనాపరులుగా వుంటారు.

శుక్రవారమునాడు అమ్మవారిని పూజించుట అత్యంత శక్తి ప్రదాయము మరియు అత్యంత పవిత్ర దాయకము.

భక్తులు శుక్రవారమునాడు తెలుపు రంగు బట్టలు ధరించవలెను. శుక్రవారమునాటి ఉపవాసము సూర్యోదయముతో మొదలయి సూర్యాస్తమయముతో ముగుస్తుంది. ఉదయమంతా ఉపవాసముతో వుండి సాయంకాలమునందు భుజించవలెను.

తెలుపు రంగు పదార్థాలయిన పాయసము, పాలు మొదలగునవి శ్రేష్ఠము

జీవితములో వచ్చు అడ్డంకులను తొలగించుకొనుటకు మరియు సంతానము లేని వారు సంతానము పొందుటకు మరియు కుటుంబములో సంతోషము వెల్లివిరియుటకు ఈ శుక్రవార ఉపవాస వ్రత దీక్ష చేస్తుంటారు.

మద్య,మాంస మరియు మైధునము నిషిద్ధములు. 

సూచనః సంతోషిమాత వ్రత దీక్ష చేయువారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలెను. పొరపాటున దీక్షలో తేడాలు జరిగిన అమ్మవారి ఆగ్రహమునకు గురి అయ్యే అవకాశము వున్నది.

మన డివోషనల్ త్రెడ్స్లో ప్రచురించటము జరిగినది. దయచేసి చూచి ఆ విధముగా ఆచరించగలరు.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)