Post: #1

షిర్డి సాయి బాలలను గురించి ఏమన్నాడంటే...

బాలలే రేపటి సందేశ వారధులు

పిల్లలు పరమాత్మ స్వరూపులు. పిల్లలను ప్రేమించటం మంచిదే కానీ వారిని అతి గారాబం చేయటం తప్పు. వారి అవసరాలను తీర్చవలసిందే కాని అడిగిందల్లా ఇచ్చి పాడుచేయకూడదు. క్రమశిక్షణ లేని ప్రేమ ప్రమాదాలకు కారణం అవుతుంది. రేపటి సమాజం సుఖశాంతులతో నిండాలంటే నేటి పిల్లలు ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలి.

తాత్యా చిన్నప్పుడు తోటి పిల్లలతో మసీదు దగ్గరకొచ్చి బాబాను ఎగతాళి చేసేవాడు. కానీ తల్లితండ్రుల బోధనలతో అతడు బాబా ఆత్మీయులలో ముఖ్యుడుగా మారాడు.

దొంగవాడు పెంచిన చిలుక 'దోచుకోండి' అని, మంచివాడు పెంచిన చిలుక 'రండి కూర్చోండి' అని పలుకుతాయి. మంచిని మెచ్చుకుంటూ, చెడును త్రుంచివేస్తూ మన పెంపకంలో పిల్లలను ఉత్తమ పౌరులుగా, దైవాన్ని సేవించే భక్తులుగా తీర్చిదిద్దాలి.

నిజానికి పిల్లల మనసులు చిత్తజల్లుకు తడిచిన పొలం వంటివి. ఏ భావ బీజాలు పడితే అవి మొలిచి బలంగా నాటుకుంటాయి. వారి హృదయాలు నిర్మలమైన అద్దాలవంటివి. ఏదృశ్యాలను చూపిస్తే వాటిని ముద్రించుకుంటాయి. బాల్యంలో బలంగా నాటుకున్న అభిప్రాయాలు కాలక్రమంగా వేళ్ళూని మహావృక్షాలుగా మారుతాయి. కనుక పిల్లలు ఏమి ఆలోచిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి స్వభావం ఎలా రూపుదిద్దుకుంటోంది అనే ప్రతి అంశాన్ని పెద్దలు జాగ్రత్తగా పరిశీలించాలి. వారికి స్నేహితులుగా మెలుగుతూ ప్రతి అడుగులోనూ ముళ్ళవంటి చెడును తొలగించి భవిష్యత్తును పూలబాటాగా సవరించాలి. ఇలా మంచితనంతో పెరిగిన పిల్లలు, రేపటి బాబా సందేశానికి వారధులవుతారు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)