Post: #1

శనివారము - చేయదగినవి - చేయకూడనివి - ఉపవాస ఫలితములు

 

శనివారము శ్రీవేంకటనాధునికి, రామభక్త హనుమకు అత్యంత ప్రీతికరమైన రోజు. శనివారమునకు అధిష్టానదేవత శని మహాత్ముడు.
శనివారము అనగానే సహజముగా ప్రజలకు భయము ఆందోళన వుంటుంది.

ఎవరైతే శనివారమునాడు శని ప్రభావమువలన కలుగు దుష్ప్రభావములను తప్పించుకోవాలనుకుంటారో అట్టివారు శనివారమునాడు ఉపవాసముంటారు.
ఎవరైతే హనుమంతుని పూజిస్తారో వారికి శనివలన కలుగు ప్రభావములు కలుగకుండా హనుమంతుడు రక్షిస్తాడని ప్రతీతి.అందువలన ప్రజలు హనుమంతునికి ప్రదక్షిణలు పూజలు చేస్తుంటారు.

శనివారమునాటి రంగు - నలుపు

శని నవగ్రహములలో ఒకరు.శని మహాత్ముని అనేకానేక దేవాలయములలో ప్రజలు పూజిస్తూంటారు. అంతేగాక శనిమహాత్మునికి ప్రత్యేక దేవాలయములుకూడా కలవు.ఎవరైతే శనివారము ఉపవాస వ్రత దీక్ష అవలంబిస్తారో వారు శని మహాత్ముని దర్శించుట ఉత్తమము.అంతేగాక శనివారమునాడు, శనిమహాత్మునికి నల్లనువ్వులు,నువ్వులనూనే, నల్లని వస్త్రములతో పూజిస్తారు.శని మహాత్ముని విగ్రహము నలుపురంగులో వుంటుంది.

ఎవరైతే శనివారమునాడు ఉపవాసముంటారో వారు ఉదయమంతా ఉపవాసముండి, సాయంకాలమందు పూజాది కార్యక్రమములు ముగించుకుని ఆహారముతీసుకొనవలెను.ఆహారముకూడా నల్లని నువ్వులతో, నువ్వులనూనెతో చేసినది అయితే ఉత్తమము.ఉప్పు శనివారమునాడు ఉపయోగించరాదు.

ధనుర్బాణగదాధారియై శని మహాత్ముడు, కాకిని వాహనముగా చేసుకున్న రధముపై వుంటారు.కొందరు నల్లని ఇనుముతో చేసిన శనిమహాత్ముని ప్రతిమను పూజిస్తుంటారు.
చాలావరకు ప్రజలు శనివారమునాడు ప్రయాణములు వాయిదావేసుకుంటారు.అంతేగాక శని మహాత్ముని దుష్ప్రభావములపై చాలా కధలు ప్రచారములో వున్నయి.

పూర్వము రామాయణ కాలమునందు హనుమంతుడు లంకను కాల్చు సమయమమునందు, రావణుని బారినుండి శనిమహాత్ముని హనుమంతుడు రక్షించినట్ల్లు ప్రతీతి. అందుకు ప్రతిగా శని మహాత్ముడు హనుమంతుని కొలుచు భక్తులకు అభయమిచ్చినట్లు ప్రతీతి.

ధూమపానము, మధుమాంసములతో పాటు మైథునముకూడా నిషిద్ధము.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2
thanx for this valubale inforomation.........

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)