Post: #1

జన్మ ఎత్తిన ప్రతి మనిషికి అనేకానేక దుఃఖములు వెంటాడుతుంటాయి.

పూర్తి సంతోషముతో వున్న మానవుడనే వాడు కనబడడు.

ఈ దుఃఖమునంచి మనిషి తప్పించుకోలేడా???

అసలు మానవుని దుఃఖ హేతువులేమిటో చెప్పగలరా?

ఆ హేతువులేమిటో కనిపెట్టి చెప్త్తారు కదూ....

Quote this message in a replyReply

Post: #2

చందు గారు, నాకు తెలిసినంతవరకు మానవుని దుఃఖ హేతువులు - కామ,క్రోధ,లోభ,మద, మాత్సర్యాలు



Quote this message in a replyReply

Post: #3

మిత్రమా మనోహర్ గారు,

మంచి ప్రయత్నము.

మీరు చెప్పినవి కూడా ఒక విధముగా సమంజసమే...

కానీ....

 మానవునికి దుఃఖ హేతువులు ముఖ్యముగా మూడు. అవి

1. ఆత్మికము 2. భౌతికము మరియు 3. దైవికము

1. ఆత్మికముః మనం చేతులారా కొని తెచ్చుకున్న సమస్యలు. మన నమ్మకాలు, మన ఊహలు, ఆలోచనలు, పద్ధతులు, ఈర్ష్యా అసూయలు, రాగ ద్వేషాలు, ఇష్టాఇష్టాలు ఈ కోవలోనికి వస్తాయి.

2. భౌతికముః ఆర్థిక అవస్థలు, కలహాలు, విభేదాలు, సామరస్య లోపాలు మొదలగు వాటివల్ల కలిగే దిగులు భౌతికమైనది (సామాజికమైనది).

3. దైవికముః ప్రకృతి వైపరీత్యాలు, చావులు, ప్రమాదాలు లాంటివి మనసుకు అఘాతాన్ని కలిగిస్తాయి. అవి దైవికమైనవి

అదండీ నా అభిప్రాయము...

అవునంటారా...కాదంటారా...

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచండి.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)