Post: #1

హాయ్ ఫ్రెండ్స్,

అనగనగా ఒక గురువు దగ్గరికి విద్యనేర్చుకోవడానికి శిష్యుడుగా ఉంటానని రాము అని ఒక పిల్లవాడు వెళ్లాడు.

ఆ గురువు చిరాగ్గా " నా దగ్గర విద్య నేర్చుకోవాలంటే తెలివిగల్లవాడయి ఉండాలి. నువు పనికి రావు. వెళ్లు" అని చెప్పాడు.

అపుడు రాము "స్వామి! నాకు అందరి కంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పరీక్షించండి" అన్నాడు.

గురువు ఆలోచించి, ఆలోచించి

రాముకి ఒక 3 లీటర్ల కుండ, ఒక 4 లీటర్ల కుండను ఇచ్చి " వెళ్లి ఆ కోనేరులో 5 లీటర్ల నీళ్లు తీస్కొని రా! ఒక చుక్క తేడా ఉన్నా నీకు తెలివి లేనట్లే. కొలత కరెక్ట్ గా ఉండాలి. ఈ రెండు కుండలు తప్ప వేరేవి ఉపయోగించకూడదు." అని చెప్పాడు.

రాము వేళ్లతో లెక్క లేస్కుంటా " కరెక్ట్ గా 5 లీటర్లు ఎలా తేవాలా?" అని ఆలోచిస్తూ కోనేటి వైపుకు నడిచాడు.

కట్ చేస్తే..

మన ఫోరమ్ లో చాలా మంది సభ్యులు తెలివైన వారు దీనికి ఆన్సర్ చేయగలరు.  ట్రై చేయండి మరి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

4 లీటర్ల కుండతో నీళ్ళు తీసి 3 లీటర్ల కుండలో పోస్తే 4 లీటర్ల కుండలో 1 లీటరు నీళ్ళు మిగులుతాయి.

3 లీటర్ల కుండలో నీళ్ళు పారబోసి ఈ ఒక్క లీటరు నీళ్ళు అందులో నింపాలి.

ఆ తర్వాత 4 లీటర్ల కుండను నీళ్ళతో నింపితే మొత్తం 2 కుండలలో నీళ్ళు 5 లీటర్లు అవుతాయి.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)