Post: #1
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నందనందన గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్దనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

మత్స్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్దకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపద్భాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా
కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙగదాధర గోవిందా
విరజాతీర్థస గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గొవిందా
గోకులనందన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాల గోవిందా
వడ్డీకాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివరణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

రత్న కిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రితపక్ష గొవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహిత గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గొవిందా

ఇహపరదయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
శేషాద్రి నిలయ గోవిందా
శేష శాయిని గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

Post: #2
మిత్రమా....ఆ గోవిందుడే (మిమ్ములను) తగలబడిపోతున్న సమయంలో కాపాడతాడు. కాపాడాడు. మరి పోస్టర్ చూస్తుంటే భయమేస్తుందని చెప్పి....మొత్తానికి చాలా బాగా కంపోజ్ చేసి పంపారు. ఆనంద మరంద మాధుర్య మేమని చెప్పగలం. శుభసూచకంగా....మంచి గోవిందుని నామాలు పోస్ట్ చేశారు. ఇదేమిటి గోవిందా....మరింతగా మమ్ములను భయపెడతారా....పోస్టర్ తో. మరియు గోవింద నామాలతో.....గోవిందా...గోవిందా....శుభాన్ని సూచించే నామాలు మా చేత కూడా పలికించినందులకు సదా ఆ వేంకటేశ్వరుఢు మనలను కాపాడు గాక. ఒక ప్రక్క సాంకేతికత....మరొక ప్రక్క ఆధ్యాత్మికత....బాగుందండీ.....చాలా బాగుంది. అభినందనీయం.....మీ ప్రయత్నం.....అందుకోంఢి మా ధన్యవాదాలు.Smile
________________________________________________________________________________​____________________________________
స్పర్ధయా వర్ధతే విద్యా.....విద్యా తురాణాం న సుఖం....న నిద్రా....శ్రమయేవ జయతే......(సుమణి వెంకట్)

Post: #3

ధన్యవాదాలు.

Chaala bagundi. well done. keep posting..


Post: #4
anath garu danyvadamulu ani

You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)