Post: #1

డియర్ మహిగ్రాఫిక్స్ టీమ్,

నేను APC UPS ని వాడుతున్నాను. ఈ మధ్య నా UPS సరిగా పనిచేయడంలేదు.  Main power On చేసి UPS  power button ని press చేస్తుంటే beeps ఇస్తుంది కానీ on కావడంలేదు. కానీ battery power తో మాత్రం run అవుతోంది. మరళా UPS ని off చేసి on చేస్తుంటే ఎప్పటికో main power తో run అవుతోంది. ఒకవేళ Ups On అయ్యి main power తో పనిచేస్తున్నప్పటికీ మధ్యలో sudden గా battery power తో run అవుతోంది. ఒక్కోసారి కరెంటు పోయినప్పుడు ups battery తో రన్ అవుతుండగా, వెంటనే కరెంటు వచ్చినప్పటికీ Ups main powerని use చేసుకోవడంలేదు battery తోనే రన్ అవుతోంది. నాకైతే ఎందుకిలా అవుతుందో తెలియడంలేదు. మీకు తెలిస్తే పరిష్కార మర్గాన్ని సూచించగలరని మనవి.  ధన్యవాదములతో.......................

Quote this message in a replyReply

Post: #2
మీకు దగ్గరలోని APC సర్వీసు సెంటరుని సంప్రదించడమే అన్నిరకాలుగా మంచిది .
దయచేసి స్వయంగా UPS ని తెరవకండి - లోకలు టెక్నీషియన్లనీ పిలవకండి ...
Quote this message in a replyReply

Post: #3
mn గారు, thanks for ur quick response. ఇంకొక సారి చూస్తాను. తరువాత కూడా ఇదే సమస్య పునరావృతమైతే మీరు చెప్పినట్లే చేస్తాను.
Quote this message in a replyReply

Post: #4

శివకుమార్ గారు,

మీకు ఎలక్ట్రానిక్స్ పై అవగాహన ఉంటే .... అందులో ఉన్న రిలే స్విచెస్ ను చెక్ చేయండి. మీరు పవర్ ఆన్ చేసినపుడు ఆటోమేటిక్ గా బ్యాటరీ అవుట్ పుట్ సప్లై కట్ కావడానికి ఒక రిలే ఉంటుంది. అలాగే మైన్ పవర్ అవుట్ పుట్ డైరెక్ట్ లింక్ అవ్వడానికి మరొక రిలే ఉంటుంది. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తూ రిలే కాయిల్స్ కు ఓల్టేజీ వేరీ అవుతుందో లేదో మల్టీమీటర్ ద్వారా చెక్ చేయండి. అలా కాకుండా ఉంటే రిలే కాయిల్స్ లో ఉన్న స్విచ్చింగ్ పిన్స్ కాంటాక్ట్ అయినా మిస్ అయి ఉండాలి. లేదా సర్క్యూట్ నుండి రిలే కాయిల్ కు వస్తున్న ఇన్ పుట్ ఓల్టేజి అయినా మిస్ అయి ఉండాలి. ఇదే రూట్ లో చెక్ చేస్తూ వెళ్లండి. మీరు ఓపెన్డ్ కాంపోనెంట్ ను కనుక్కోగలుగుతారు. (ఈ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద సరియైన అవగాహన ఉంటేనే చేయండి)


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
మహిగ్రాఫిక్స్ గారు,
మీరు చెప్పిన విధంగానే వోల్టేజి వేరియేషన్స్ వలన ఇలా జరుగుతున్నట్లుగా ఉంది. నాకు ఎలక్ట్రానిక్స్ మీద కాస్త అవగాహన అయితే ఉన్నది కానీ కావలసిన ఉపకరణములైతే ప్రస్తుతము అందుబాటులో లేవు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు సమస్య పరిష్కారంతో బాటు సమస్య ఉత్పన్నమవడానికి గల కారణాలను కూడా తెలియజేస్తున్న మహిగారికి ప్రత్యేక ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)