Post: #1

బ్లాగరు టెంప్లేట్ లను ఎక్కువగా ఎడిట్ చేసేవారు తామే సొంతంగా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా మరింత సులభంగా బ్లాగ్ థీమ్ ను ఎడిట్ చేయగలరు.
అసలు ఈ టెంప్లేట్ వేరియేబుల్స్ ఏంటీ అంటారా?
ఏమీలేదండి. కోడింగ్ ఎక్కువగా తెలియని వారు సులభంగా తమ బ్లాగు ఫాంట్స్ మరియు కలర్స్ మార్చుకోవడానికి వీలుగా టెంప్లేట్ లో ముందుగానే కొన్ని వేరియేబుల్స్ క్రియేట్ చేసి ఉంటారు.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials
ఉదా:కు బ్లాగరు లేఅవుట్ సెట్టింగ్స్ లో ఉన్న Fonts & Colors లో మనము మార్చుకునే సెట్టింగ్స్ ఈ వేరియేబుల్స్ ద్వారా క్రియేట్ చేసినవే.
ఇలా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడికక్కడే కలర్ మరియు ఫాంట్స్ లాంటివి మార్చుకొని వెంట వెంటనే లైవ్ ప్రివ్యూ చూస్తూ మనకు నచ్చినవి సెలెక్ట్ చేస్కొని సేవ్ చేయవచ్చు.
అంటే ఈ వేరియేబుల్స్ వల్ల ప్రతీసారి HTML లోకి వెళ్లి ఎడిటింగ్ చేసే బాధ తప్పుతుందన్నమాట.



ఓకే.. అర్థమయ్యింది కదా..?
ఒక్కో టెంప్లేట్ కు డీఫాల్ట్ గా కొన్ని వేరియేబుల్స్ మాత్రమే ఉంటాయి.

అదనంగా ఒక వేరియేబుల్ ను ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం.
ఉదా:కు minima టెంప్లేట్ లో సైడ్ బార్ కి బ్యాక్ గ్రౌండ్ మార్చి చూడాలి.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials
ఈ టెంప్లేట్ లో సైడ్ బార్ బ్యాక్ గ్రౌండ్ కు వేరియేబుల్ లేదు  కాబట్టి ప్రతిసారీ html కోడ్ లో ఎక్కడుందో చూసి మార్చాలి. కాబట్టి ఈ టెంప్లేట్ కి సింపుల్ గా ఒక వేరియేబుల్ క్రియేట్ చేద్దాం.

Demo: You are not allowed to view links. Register or Login to view.

Ok.. ఇక వేరియేబుల్ క్రియేట్ చేయాలంటే అసలు ఆ కోడ్ టెంప్లేట్ లో ఎక్కడెక్కడుందో తెలుసుకోవాలి కదా!

మీ టెంప్లేట్ కోడ్ లో అంటే Layout >> Edit HTML కోడ్ లో పై భాగాన Variable definitions అని అన్నీ రకాల వేరియేబుల్స్ కు సంబంధించిన కోడ్ ఇక్కడ చూపబడుతుంది.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

ఉదా:కు డీపాల్ట్ గా టెంప్లేట్ తో పాటు వచ్చిన వేరియేబుల్స్ లో పేజి బ్యాక్ గ్రౌండ్ కలర్ గురించి క్రియేట్ చేసిన bgcolor వేరియేబుల్ ను చూద్దాం. బ్లాగు యొక్క బాడీ బ్యాక్ గ్రౌండ్ కలర్ ను మార్చడానికి ఈ వేరియేబుల్ ఉపయోగపడుతుంది. అయితే ఈ వేరియేబుల్ డిఫినిషన్స్ లో క్రియేట్ చేసిన వేరియేబుల్ ను ఆ వేరియేబుల్ కు సంబంధించిన css  కోడ్ లో లింక్ చేయవలసి ఉంటుంది. ఈ క్రింది కోడ్ లో వేరియేబుల్ నేమ్ = bgcolor . ఈ నేమ్ ను  body  కి సంబంధించిన css లో లింక్ చేస్తేనే వేరియేబుల్ ద్వారా body background color ఛేంజ్ అవుతుంది.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

 క్రింద గమనించండి. పై వేరియేబుల్ లోని bgcolor ను body కి సంబంధించిన css లో background కు హుక్ చేశారు.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

అంతే.. సేమ్ పైన చూపిన విధంగా మనము కూడా minima టెంప్లేట్ లో సైడ్ బార్ కు బ్యాక్ గ్రౌండ్ కలర్ వేరియేబుల్ ను క్రియేట్ చేద్దాం.

క్రింద చూపిన విధంగా సైడ్ బార్ బ్యాక్ గ్రౌండ్ కి ఒక వేరియేబుల్ ను క్రియేట్ చేయండి.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

తర్వాత పైన క్రియేట్ చేసిన వేరియేబుల్ నేమ్ ను సైడ్ బార్ కు సంబంధించిన css కి క్రింది విధంగా లింక్ చేయండి.

లింక్ చేయకముందు:

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

లింక్ చేసిన తర్వాత:

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

ఇక Fonts and Colors లో చూడండి మీరు కొత్తగా క్రియేట్ చేసిన వేరియేబుల్ క్రింది విధంగా కనిపిస్తుంది.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials

ఇక HTML తో పని లేకుండా ఇక్కడే సైడ్ బార్ కలర్ మార్చేసుకోవచ్చు.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)