Post: #1

సూర్యనమస్కారములు

దైవశక్తి మనకు కనబడదు. కానీ మనకు సూర్యుడు ప్రత్యక్షముగా కనిపిస్తున్నాడు. ఆయన మన జీవనానికి ఆధారము. సూర్యుని యొక్క మూడు దశలు సృష్ఠి, స్థితి మరియు లయలను సూచిస్తూ ఉంటాయి. సూర్యోదయము సృష్ఠిని, మధ్యాహ్నము సూర్యుని యొక్క శక్తి స్థితిని మరియు సూర్యాస్తమయం సృష్ఠిలయమవటాన్ని పోలి ఉంటాయి. సూర్యుడు ప్రపంచములోని చీకటిని తొలగిస్తూ, వెలుగునిస్తూ అజ్ణానాంధకారములో జ్ణానమనే ప్రకాశాన్ని నింపినట్లు నిద్రపోయిన ప్రపంచాన్ని మేల్కొలుపుతాడు.

సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగడము వలన నిత్యజీవితములో నడకలో, కూర్చోవడములో, పడుకోవడములో శరీరము ఉండాల్సిన స్థితిలో సహజముగా ఉంటుంది.

సూర్యనమస్కారములలో 12 భంగిమలు ఉంటాయి. ఈ 12 భంగిమలు 12 రాశులను సూచిస్తూంటాయి. ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క రాశిని సూచిస్తూంటుంది. సూర్యుని ప్రయాణములో ఒక్కొక్క రాశిలో 30 రోజుల చొప్పున ఉంటాడని, 30 రోజుల తరువాత వేరొక రాశిలోనికి ప్రయాణిస్తాడని అంటారు.

ఈ పన్నెండు నమస్కారములు పన్నెండు మంత్రములతో ఉచ్చరిస్తూ చేయాలి.

1. ఓం మిత్రాయ నమః - ప్రమాణాసనము

2. ఓం రవయే నమః - హస్త ఉత్తానాసనము

3. ఓం సూర్యాయ నమః - పాద హస్తాసనము

4. ఓం భానవే నమః - అశ్వ సంచలనాసనము

5. ఓం ఖగాయ నమః - పర్వతాసనము

6. ఓం పూష్ణే నమః - అష్టాంగ నమస్కారాసనము

7. ఓం హిరణ్య గర్భాయ నమః - భుజంగాసనము

8. ఓం మరీచయే నమః - పర్వతాసనము

9. ఓం ఆదిత్యాయ నమః - అశ్వ సంచలనాసనము

10. ఓం సవిత్రే నమః - పాద హస్తాసనము

11. ఓం అర్కాయ నమః - హస్త ఉత్తానాసనము

12. ఓం భాస్కరాయ నమః - ప్రమాణాసనము

పైన చెప్పిన 12 ఆసనాలను వరుసనే 12 మంత్రాలు చదువుకుంటూ, చక చకా పూర్తి చేస్తే ఒక రౌండు పూర్తి అవుతుంది. ఇలాగ 12 మార్లు చెయ్యాలి. శారీరక శ్రమలో వచ్చినట్లు, చెమటలు, అలుపు, ఆయాసం, సూర్యనమస్కారాలతో బాగా వస్తాయి.

ఒక్కొక్క ఆసనము గురించి వివరముగా రేపు తెలుసుకుందాము.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post: #2
chandu jee,
good item.... waiting for your next article...
Quote this message in a replyReply

Post: #3
చందు గారు,
సూర్యనమస్కారముల గురించి చాలా చక్కగా వివరించారు. మీ తదుపరి పోస్టుకై నిరీక్షణ........ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)