Post: #1

చాలా Circut Boards లో Resistors You are not allowed to view links. Register or Login to view. ను మీరు గమనించే ఉంటారు. Resistors అని పిలవబడే  Electronic Components విద్యుత్చక్తిని కొంతమేరకు నిరోధించడానికి ఉపయోగపడతాయి. అంటే విద్యుత్ నిరోధకంలా ఉపయోగపడతాయన్నమాట.

ఉదా:కు ఒక L.E.D (Light Emitting Diode: అంటే CPU లో వెలిగే లైట్ ఇండికేటర్స్:  పవర్ మరియు హార్డ్ డిస్క్ ఇండికేషన్ ను తెలుపడానికి వీటిని ఉపయోగిస్తారు) పూర్తిగా వెలగడానికి 1.5 v AC(Alternative Current) లేదా 3v DC(Direct Current) ను ఉపయోగించవచ్చు. మనకు మెయిన్ లైన్ మీద వచ్చే కరెంట్ 230V అనుకుందాం. అలాంటపుడు 230v నుంచి L.E.Dకి కావలసిన 1.5v గా తగ్గించడానికి ఒక 47k (47 Kilo Ohms) Resistor ఉపయోగించి 230V నుంచి L.E.D వెలగడానికి కావలసిన 1.5v ను పొందగలము.

అంటే ఇక్కడ  ఒక Resistor తన Value ను బట్టి ఒక ఓల్టేజి నుంచి కొంత భాగాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సహజంగా Resistor Value ను ఓమ్స్ (Ohms) లో కొలుస్తారు. ఈ Resistors ను తయారు చేయడానికి Carbon, Metal Oxide Film లేదా Nichrome Wire లనుపయోగిస్తారు. Metal Oxide Film లేదా Nichrome Wire లనుపయోగించే రెసిస్టర్స్ పైన దాని Value (ఉదా: 10) ముందుగానే ముద్రించబడి ఉంటుంది. Carbon made Resistors  Values మాత్రం దానిపై ముద్రించబడిన కలర్స్ ద్వారా దాని  Valueని గుర్తించగలగాలి. దీనికి ఒక ప్రత్యేకమైన Color Code ఉంటుంది. ఒక్కొక్క కలర్ కు ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఈ క్రింది కలర్స్ ప్రక్కన ఉన్న వాల్యూస్ ను గమనించండి.



Black = 0

Brown = 1

Red = 2

Orange = 3

Yellow = 4

Green = 5

Blue = 6

Violet = 7

Gray = 8

White = 9

 ఓకే.. ఇపుడు వాల్యూస్ తెలిసిపోయాయి. మరి రెసిస్టర్ మీద ఉన్న కలర్స్ ద్వారా దాని వాల్యూని కనుగొనడం ఎలాగో తెలసుకుందాం. చాలా సింపుల్. ముందు రెసిస్టర్ మీద ఉన్న కలర్ లో ఫస్ట్ కలర్ ఏదో గుర్తించాలి. రెసిస్టర్ కు రెండు చివరలు మాత్రం కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. మధ్యభాగం మొత్తం లోపలికి అణిగి ఉంటుంది. ఉబ్బెత్తుగా ఉన్న ఏదో ఒక చివర మాత్రం ఒక కలర్ బ్యాండ్ ఉంటుంది. దానిని ఫస్ట్ కలర్ బ్యాండ్ గా గుర్తించాలి. లేదా కొన్ని రెసిస్టర్స్ కు ఒక చివర గోల్డ్ కలర్ బ్యాండ్ కానీ సిల్వర్ కలర్ బ్యాండ్ కానీ ఉంటుంది. దానిని చివరి కలర్ గా గుర్తించాలి. క్రింది ఇమేజెస్ లో గమనించండి.

Resistors, mahigrafix, telugu forums, srisailam, sundipenta

పై ఇమేజిలో ఉన్న ఫస్ట్ కలర్ Red అంటే దీని వాల్యూ 2.

సెకండ్ బ్యాండ్ కలర్ కూడా Red. దీని వాల్యూ కూడా 2 .

థర్డ్ బ్యాండ్ కలర్ మాత్రం Brown దీని వాల్యూ 1 .

(కలర్ కోడింగ్ ద్వారా Resistor విలువను కనుగొనడానికి చాలామంది అనేక విధాలను ఉపయోగిస్తున్నారు. నాకు సులభమైన మరియు నేను అనుసరించే పద్ధతిని మాత్రమే ఇక్కడ తెలియజేస్తున్నాను). 

ఇపుడు మొదటి రెండ్ కలర్ బ్యాండ్ వాల్యూస్ ను పక్క పక్కకి చేర్చండి. అంటే మొదటి రెండు కలర్ బ్యాండ్ వాల్యూస్ = "22" ...

ధర్డ్ బ్యాండ్ కలర్ ను వాల్యూను మాత్రం ఎంత ఉంటే అన్ని "0" లను చేర్చండి.

అంటే మూడు బ్యాండ్ లను పైన చెప్పిన విధంగా చేరిస్తే  "220" అవుతుంది.

కాబట్టి ఈ Resistor విలువ = 220Ω (Ohms) గా మనం చెప్పుకోవచ్చు.

ఒకవేళ చివరి కలర్ కూడా Red ఉంటే Red విలువ 2 కాబట్టి చివరలో రెండు సున్నాలు పెట్టాలి.

అంటే అపుడు టోటల్ విలువ 2200Ω (Ohms).

కానీ 1000Ω ను ఒక Kilo Ohm (1KΩ) గా పిలుస్తారు కాబట్టి 2200Ω ను 2K2 గా పిలవాలి.

Resistors గురించి మరింత వివరణ త్వరలో మరో పోస్టులో.... >>>>>>


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thank you Mahi garu....!!

Regarding educating in Electronic Components - Resistors...

we will learn and get knowledge....!!
sincerely thank you very much...

waiting for more valuable posts from your side regarding like this...!!
Quote this message in a replyReply

Post: #3

Sir,

Thanks for this good post

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)