Post: #1

అష్టకష్టాలు అంటె ఎమిటి చందు గారు. వాటి వివరాలు తెలుపగలరు


Post: #2

(13-Dec-2009 07:41 PM)kittu Wrote: You are not allowed to view links. Register or Login to view.

అష్టకష్టాలు అంటె ఎమిటి చందు గారు. వాటి వివరాలు తెలుపగలరు

 

మిత్రమా,

మన పూర్వీకులు మనిషి అనుభవించే ముఖ్యమైన కష్టాలుగా ఎనిమిదింటిని వివరించారు. వాటినే అష్టకష్టాలు అంటాము.

1 అప్పు - ధనము లేదా సంపద ఏ రూపములో అయినా ఇతరులనుంచి అరువుగా తీసుకోవటము (తిరిగి ఇచ్చుట కూడా జరుగును).

2 యాచన - అడుక్కోవటము, భిక్ష వేరు యాచన వేరు. కనుక అడుక్కోవటము అని ఇవ్వటము జరిగినది. అప్పు వలే కాక ఇక్కడ తిరిగి ఇవ్వటము జరగదు.

3 ముసలితనముః ముసలితనములో ప్రతి మనిషికూడా ఇతరుల మీద ఆధార పడి బ్రతకవలసి వుంటుంది. వారు చీ కొట్టినా చీదరించుకున్నా తప్పదు. అందుకే వయసులో ఉన్నప్పుడే మంచి పనులు చేసి నలుగురిని తనవాళ్ళని మిగిల్చుకోవాలి అంటారు. తనవాళ్ళు అంటే సొంతవాళ్ళే కానవసరము లేదు.

4 జారత్వముః వ్యభిచారము చేయటము. తన శరీరముపై అధీనముకోల్పోయి ఇతరులకు అప్పగించటము. అది ఏమి ఆశించి అయినా కావచ్చు, ఆశించకపోయినా కావచ్చు. మగ అయినా కావచ్చు, ఆడ అయినా కావచ్చు, ఇంతకంటే నీచము ఇంకొకటి వుండదేమో....

5 చోరత్వముః దొంగతనము చేయటము. ఇతరుల వస్తువులకై ఆశపడి వారికి తెలియకుండా వారి వస్తువులు లేదా సంపదను తను అనుభవించటము.

6 దారిద్ర్యముః ఎటువంటి సంపదలేక, కనీసము అదృష్టముకూడా లేకుండా ఉండటము.

7 రోగముః ఇది కూడా ముసలితనము లాంటిదే...అంటే రోగములతో తన శరీరమును తను ఉపయోగించుకోలేనప్పుడు ఇతరుల సహాయమునకై ఆశించి వారితో నానా మాటలు చీత్కారములు పడటము.

8 ఉచ్చ్హిష్ట భోజనముః ఎంగిలి మెతుకులు తినటము. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో తినవలెను. కానీ ఉచితార్థముగా పరాయి వారి పంచన పడి బ్రతుకుతూ వారి సొమ్ము తినుటను ఎంగిలి మెతుకులు తినుటగా చెప్పవచ్చును. అంతే కానీ వేరే వారు తిన్న ఆహారము తినుట అని కాదు.

 

ఇవండీ... వీటినే అష్టకష్టాలు అంటారు.

అందుకే నా ఉద్ద్యేశ్యము ప్రకారము కేవలము మనిషి మాత్రమే దానము చేయగలడు.

అందుకే జన్మ ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే, తను సంపాదించిన సొమ్ములో అది ఒక రూపాయి అయితే తన వంతు ఐదు లేదా పది పైసలవంతైనా దానము చేయవలెనని నా అభిప్రాయము.

ఈ రోజు, ఈ జన్మలో దానము చేస్తే రాబోయే జన్మ వుందో లేదో తెలియదు. ఒకవేళ వుంటే మన స్వార్థము అంటే వచ్చే జన్మ లో ఈ అష్టకష్టముల బారిన పడకుండా వుండవచ్చు.

అదే వచ్చే జన్మ లేదు అనుకుంటే ఈ జన్మలో దానముచేసి నలుగురికి సహాయపడినవాళ్ళము అయినందుకు ఆత్మ సంతృప్తి పొందుతాము.

ఎక్కువ చెప్పేసానా.....

నేను ఇచ్చిన సమాధానము సబబుగా తోచిందా...

మిగిలిన విషయము అంతా నా అభిప్రాయము మాత్రమే సుమండీ!!!!!!!!

ఎవరిపైనా బలవంతముగా నా అభిప్రాయము రుద్దటము నా ఉద్ద్యేశ్యము కాదు సుమండీ!!!!!!!

మీ నుంచి మరిన్ని మంచి విషయములు ఆశిస్తూ....

మీ..


Post: #3

ఇలాంటి మంచి విషయాలు చెప్పిన మీకు నా దన్యవాదాలు .



Post: #4
sir mantram ante yemiti vaati valla vupaogalu telupagalaru

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)