Post: #1

చందు గారికి ,

      యమగండము ,రాహుకాలం  ల గురించి తెలుపగలరు. ఆయా సమయాలలొ మనము తీసుకోవలసిన జాగ్రత్తలు  ఎమిటి.


Post: #2

(14-Dec-2009 02:37 PM)kittu Wrote: You are not allowed to view links. Register or Login to view.

చందు గారికి ,

      యమగండము ,రాహుకాలం  ల గురించి తెలుపగలరు. ఆయా సమయాలలొ మనము తీసుకోవలసిన జాగ్రత్తలు  ఎమిటి.

యమగండముః యమగండము అనునది రోజుమొత్తములో ఒక గంట ముప్పది నిముషముల (1:30min) సమయముపాటు వుంటుంది. ఈ సమయములో యమధర్మరాజు పరిపాలన కొనసాగుతుంటుంది. ఈ సమయములో ప్రయాణమునకు శుభప్రదము కాదు. ఇది వారము రోజులలో ప్రతిరోజు గంటన్నర సమయము ఉంటుంది. ఈ యమగండము అనునది అయా ప్రదేశములననుసరించి సూర్యోదయము తరువాత గణన చేయబడుతుంది.

సాధారణముగా యమగండము వారమురోజులలో ఉండు సమయములుఃయమగండము నిర్ణయ పట్టిక
అది వారము సోమ వారము మంగళ వారము బుధ వారము గురు వారము శుక్ర వారము శని వారము
12:00PM to 1:30PM 10:30AM to 12:00PM 09:00AM to 10:30AM 07:30AM to 09:00AM 06:00AM to 07:30AM 03:00PM to 04:30PM 01:30PM to 03:00PM

రాహుకాలముః రాహు కాలము అనునది రోజులోని అశుభ సమయము అని చెప్ప వచ్చును. వేదములలో మరియు జ్యోతిష్య నిర్ణయము ప్రకారము మనము చేయదలచుకొన్న శుభకార్యములు లేదా ముఖ్యమైన పనులు, లాభ దాయకమైన పనులు రాహు కాలము సమయములో చేయకుండుట మంచిది. రాహు కాలము అనునది ఆయా ప్రాంతముల సూర్యోదయ సూర్యాస్తమయ సమయములను బట్టి నిర్ణయించుట జరుగుతుంది.

సూర్యోదయ, సూర్యాస్తమయ కాలమును ప్రతి రోజు ఎనిమిది భాగములుగా విభజించుట జరిగినది. ఈ ఎనిమిది భాగములలో ప్రతి రోజు ఏదో ఒక నిర్ణీత సమయములలో రాహు కాలము వుంటుంది.

ఉదాహరణకు సూర్యోదయము 6:00 గంటలకు అలాగే సూర్యాస్తమయము 6:00 గంటలకు అనుకున్నట్లయితే ఆ సమయములో ఎనిమిదవ భాగము 1:30 నిముషముల సమయము.రాహుకాల నిర్ణయ పట్టిక
అది వారము సోమ వారము మంగళ వారము బుధ వారము గురు వారము శుక్ర వారము శని వారము
04:30PM to 06:00PM 07:30AM to 09:00AM 03:00PM to 04:30PM 12:00PM to 01:30PM 01:30PM to 03:00PM 10:30AM to 12:00PM 09:00AM to 10:30AM

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #3

మీ వండర్ ఫుల్ సమాధానానికి నా దన్యవాదాలు.

                                                           keep it up sir.


Post: #4

రాహుకాలం యమగండాలు ఎప్పుడు వచ్చేది తెలుసుకొవాలని  నెను సెర్చి చెసాను. ఈ వెబ్ సైట్స్ లొ క్లియర్ గాచెప్పారు.You are not allowed to view links. Register or Login to view.     


You are not allowed to view links. Register or Login to view.

              చందు గారికి దన్యవాదాలతొ                        


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)