Post: #1

ఆకర్ణ ధనురాసనము

ఆకర్ణ ధనురాసనము (రెండు వైపులా చేయాలి)ః ధనస్సును ఆకర్ణాంతము లాగినట్లుగా కాలును చేతితో చెవి వరకు లాగబడినదిగా దీనికి ఆ పేరు చెప్పబడినది. మరి కొందరు దీనిని ధనుష్ఠాసనమనియు, మరికొందరు రామబాణాసనమనియూ అంటారు.

చేయు విధానముః మెత్తని పక్కపై కాళ్ళు రెండూ చాచి కూర్చొనవలెను. తరువాత ఎడమకాలు మడిచి కుడిచేతిలో ఎడమ కాలు బొటన వ్రేలు పట్టుకొని పైకెత్తి చెవి వరకు లాగుచూ ఎడమ చేయి చాచి కుడికాలు బొటనవ్రేలు పట్టుకొని శక్తి కొలది లాగవలెను. ఇది సులభ సాధ్యమైనది.

అందరూ చేయవచ్చును, కాని పొట్టవున్నవారికి కొంచెము ఇబ్బందిగా వుంటుంది.

ఇదే విధముగా  ఎడమకాలు చాచి కుడికాలును ఎడమచేత్తో చెవి వరకు లాగి చేయవలెను.

కుడి వైపు లాగునది సవ్యము, ఎడమవైపు లాగునది వామం లేదా అపసవ్యము అంటారు.

ఫలితములుః ఈ ఆసనము వలన తుంటి కీళ్ళు బాగుగా వంచబడును. అందువల్ల త్రికాస్తులలోను, ఎముకలలోను దోషములు హరించును. మోకాళ్ళు, పిక్కలలోని దోషములు హరించును. చేతి గూళ్ళలోని దోషములు తగ్గును. నాడీ మండలము బాగా సాగదీయుటవలన రక్తప్రవాహములు బాగుగా జరిగి బలపడును.

*** నడుము నొప్పి వున్నవారు ఈ ఆసనము వేయరాదు***.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)