Post: #1

పద్మాసనము


పద్మాసనముః-


రెండు రేకులు గల పద్మాన్ని పోలి ఉండటం వలన దీనికి పద్మాసనమని పేరు వచ్చింది.

మొదట రెండు కాళ్ళను చాపి నేలపై ఉంచాలి. తర్వాత ఎడమ కాలును కుడితొడపైకి, కుడి కాలును ఎడమ తొడపై ఉంచి, రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. చేతులను చిన్ముద్రలో ఉంచాలి.

భ్రూమధ్యంలో దృష్టిని నిలపవచ్చును. పద్మము వలే కాళ్ళను మడిచి కూర్చుండుట వల్ల దీనికి పద్మాసనము అని పేరు వచ్చింది.

ఫలితములుః-


1. ఏకాగ్రత బాగా కుదురుతుంది.

2. ధ్యానానికి అనుకూలము.

3. యోగ సాధనకు అనుకూలము.

4. బుద్ధి తీక్ష్ణత పెరుగుతుంది.

5. తొడ భాగంలో కొవ్వు తగ్గుతుంది.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)