Post: #1

భుజంగాసనము

భుజంగాసనముః భుజంగము అంటే పాము. పాము పడగవిప్పటానికి పైకి లేచినప్పుడు ఎలా వుంటుందో అలాగే ఈ ఆసనములో శరీరము ఆ ఆకారాన్ని పోలి వుంటుంది. కాబట్టి భుజంగాసనము అనే పేరు వచ్చింది.

చేయు విధానముః

1. తల భాగానికి దుప్పటి వచ్చేటట్లు బోర్లాపడుకుని రెండు అరచేతులను బొడ్డు భాగములో నడుముకిరుప్రక్కలా వ్రేళ్ళను ఆనేటట్లు అరచేయి ఆనకుండా ఉండేటట్లు పెట్టాలి.

2. తరువాత రెండు మోచేయి భాగాలను లోపలికి నొక్కుకుంటూ చాతీ లైనులోనే మోచేతులు ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఆసనం అసలు స్థితిలోనికి వెళ్ళేటప్పుడు మోచేతుల మధ్య ఖాళీ ఇలానే వుండాలి తప్ప పెరగరాదు.

3. ఇప్పుడు మోచేతుల్ని లోపలకు నొక్కుకుంటూ రెండు పాదాలను కలిపి పూర్తిగా చాపి తలను, చాతి భాగాన్ని బొడ్డు దగ్గరనుండి పైకి లేపే ప్రయత్నంచేయాలి. మెడను పూర్తిగా వెనక్కు వంచాలి. కళ్ళను పూర్తిగా మూసుకోవాలి.

4. ఆసనాన్ని తీసివేసేటప్పుడు మెల్లగా చాతిని దింపుతూ బోర్లా పడుకోవాలి.

మరొక పద్ధతిః బరువు ఎక్కువగా ఉన్నవారికి, బోర్లా పడుకుని, చేతులను కొద్దిగా ముందుకు ఆనించి, చాతిని కొంత చేతుల సహాయముతో పైకి లేపుతారు.

ఫలితములుః

1. నడుమునొప్పి, మెడనొప్పి, కాలుజాలు ఉన్నవారు ఎంతో ఫలితాన్ని పొందుతారు.

2. నడుము, మెడకు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

3. శరీరం బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.

4. నడుము దగ్గర కొవ్వు తగ్గి అందంగా తయారవుతుంది.

5. కిడ్నిలోపాలు సరి అవుతాయి.

*****హెర్నియా ఉన్నవారు ఈ ఆసనము వేయరాదు*****

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)