Post: #1

చక్రాసనముః

వెల్లికిలా పరుండవలయును. శ్వాసపూరించి నడుము పైకెత్తవలయును. శరీరమంతయ, పాదముల మీద అరచేతులమీద మోపవలయును. ఇది చక్రాకారంగా వుంటుంది. కాబట్టి దీనిని చక్రాసనము అంటారు. దీనినే వర్తులాసనము అని కూడా అంటారు.

ఏకపాద చక్రాసనముః

చక్రాసనములో ఒక కాలు తిన్నగా పైకి లేపి వుంచాలి. కుడి కాలు లేపి చేసిన తరువాత, ఎడమ కాలు లేపి చేయాలి.

ఫలితములుః

1. Sense of Balancing పెరుగుతుంది.

2. వెన్నెముకకు, ఊపిరితిత్తులకు, తలకు, కాళ్ళకు, చేతులకు చాలా ఉపయోగము.

3. బానపొట్ట తగ్గిపోతుంది.

4. కొవ్వు కరిగిపోతుంది.

5. జీర్ణశక్తి పెరుగుతుంది.

6. మలబద్ధకము తొలగి పోతుంది.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)