Post: #1

ధనురాసనముః

ధనురాసనముః

ఈ ఆసనము వేసిన తరువాత శరీరము ఎక్కుపెట్టిన ధనుస్సును పోలి వుంటుంది. కావున దీనిని ధనురాసనము అంటారు. బిగించి పట్టుకున్న చేతులు, కాళ్ళు, వింటినారిని, మిగితా శరీరము విల్లు ఆకారాన్ని సూచిస్తాయి.

* భుజంగాసనము, శలభాసనము ఈ రెండింటి సంపూర్ణ స్వరూపమే ఈ ధనురాసనము.*

చేయు విధానముః

1. బోర్లా పడుకుని కాళ్ళ మధ్య ఒక అడుగు వెడల్పు పెట్టి రెండు కాళ్ళను, మోకాళ్ళ భాగం నుండి వెనక్కి వంచి పిఱల భాగం దగ్గరకు చేర్చి వుంచాలి. ఇప్పుడు ఒక చేతిని వెనకకు పోనిచ్చి, ఒక కాలి గుత్తి భాగం దగ్గర పట్టుకోవాలి. అలాగే రెండవ కాలిని కూడా పట్టుకోవాలి.

2. చేతులతో కాళ్ళను గట్టిగా పట్టుకుని రెండు కాళ్ళనూ పైకి తన్నుతూ, చాతీని మెడను పైకి లేపి అలానే చాతీని కదపకుండా ఉంచి, కాళ్ళను కదలకుండా పట్టుకుని ఉండాలి. కళ్ళు మూసుకోవాలి.

ఈ ఆసనములో ఉయ్యాల ఊగవచ్చు. కానీ ఫలితం ఎక్కువ రాదు.

మరొక పద్ధతిః

జబ్బలు, పిక్కలు, తొడలు బాగా లావుగా ఉన్నవారికి కాళ్ళు చేతులు సరిగా అందవు. అటువంటివారు కాలిగుత్తి అందకపోతే - పాదాన్ని పట్టుకోవచ్చు. ఒకేకాలుని అందుకుని - మరొక చేతిని ముందుకు చాచి ఉంచవచ్చు.

ఫలితములుః

1. నడుము నొప్పులు, మెడనొప్పులు ఉన్నవారికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది.

2. పిక్కల బరువు తగ్గుతుంది.

3. నడుము సన్నగా అవుతుంది.

4. శరీరం బరువు తగ్గుతుంది.

5. గర్భసంచిపై, మూత్రకోశముపై చక్కని ప్రభావం చూపి వాటి దోషాలు నివారింపబడతాయి.

***** హెర్నియా ఇబ్బందులున్నవారు ఈ ఆసనము వేయకూడదు.*****

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)