Post: #1

శ్రీ హయగ్రీవ స్తుతి

శ్లోకముః

జ్ణానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం।

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే॥

శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి జన్మ వృత్తాంతముః

పాలసముద్రమునుండి శ్రీ లక్ష్మి మాత తో పాటుగా అనేకము ఉధ్భవించిన సంగతి మనకందరకు తెలిసిన విషయమే. వాటిలో ఒకటి శ్వేతాశ్వము. కనుక ఈ అశ్వము లక్ష్మి అమ్మవారికి సోదర సమానము.

ఒకసారి లక్ష్మి అమ్మవారు తమ్ముని ఆప్యాయముగా చూచుకుంటున్నప్పుడు శ్రీమన్నారాయణుడు వారిని కొంచెము చనువుతో లేదా సరదాగా కొంచెము హేళనగా (బావమరిది వరుస కనుక) మాట్లాడినట్లు, అప్పుడు లక్ష్మి అమ్మవారు తన తమ్ముని గురించిఅలా మాట్లాడినందుకు చిన్నబుచ్చుకున్నట్లు పురాణము చెపుతుంది.

అలా జరిగినందుకు శ్రీమన్నారాయణుడు అమ్మవారికి తనుకూడా ఆశ్వము ముఖముతో అవతరిస్తానని మాట ఇచ్చినట్లు, ఆతరువాత హయగ్రీవ అవతారము వచ్చినట్లు పురాణములు చెబుతున్నాయి.

అయితే సర్వ జ్ణానములకు, ఆనందములకు నిలయము, నిర్మల స్ఫటికము వంటి ఆకృతి కలిగినవాడు, అన్ని విద్యలకు ఆధారభూతుడు అయిన ఆ హయగ్రీవునకు నమస్కారము.

మనము శ్రీ గణపతి, సరస్వతి లతో పాటుగా అంతే ముఖ్యుడుగా అన్ని విద్యలు మొదలు పెట్టేటప్పుడు శ్రీ హయగ్రీవ స్వామిని పూజించవలెను.

శ్రీ హయగ్రీవ స్తోత్రమును క్రింద లింకుపై క్లిక్ చేసి డౌన్లోడు చేసికొనగలరుః

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)