Post: #1
ఈ లోకములో ఇద్దరే ఇద్దరు నవ వ్యాకరణ పండితులు వున్నరు అని మనకు తెలుసు.
వారిలో
ఒకరు శ్రీ సూర్యనారాయణుడు.
అటువంటి శ్రీ సూర్యనారాయణుని శిష్యుడైన, శ్రీ రామ భక్త హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు అని మనకు తెలుసు.
అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఆ నవ వ్యాకరణముల పేర్లు ఏమిటి అని??????
చెప్తారు కదూ!!!!!!!!!!!!!!
మీ సమాధానము కోసము ఎదురు చూస్తూ.....
మీ...
Quote this message in a replyReply

Post: #2
పాణినీయం, కలాపం, సుపద్మం, సారస్వతం, ప్రాతిశాఖ్యం, కుమార వ్యాకరణం, బంద్రం, వ్యాఘ్ర భౌతికం, శాకటాయనం.
అవండీ నవ వ్యాకరణములు.
అర్థమయ్యింది కదూ!!!!!!
ధన్యవాదములు.
మీ...
Quote this message in a replyReply

Post: #3
చందు గారు,
నేను చదివిన నవ వ్యాకరణముల పేర్లు, మీరు చెప్పుచున్న నవ వ్యాకరణములకు భిన్నంగా ఉన్నాయి ఎందుకని. మీరు ఇక్కడ ఇవ్వబడిన నవ వ్యాకరణములు ఏ భాషలో రచింపబడినవి. నా సందేహమును నివృత్తి చేయగలరు......
Quote this message in a replyReply

Post: #4

(27-Dec-2009 09:12 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.చందు గారు, నేను చదివిన నవ వ్యాకరణముల పేర్లు, మీరు చెప్పుచున్న నవ వ్యాకరణములకు భిన్నంగా ఉన్నాయి ఎందుకని. మీరు ఇక్కడ ఇవ్వబడిన నవ వ్యాకరణములు ఏ భాషలో రచింపబడినవి. నా సందేహమును నివృత్తి చేయగలరు......

మిత్రమా,
మీ వద్ద ఉన్న నవవ్యాకరణముల పేర్లు కూడా ఇక్కడ అందించగలరు.
దానిని బట్టి నేను సరిపోల్చుటకు ప్రయత్నించగలను.
ఒకవేళ వేరు వేరు అయిన ఎడల దాని వివరములు పూర్తిగా అందించుటకు ప్రయత్నించగలను.
ముందస్తు ధన్యవాదములతో...
మీ...
Quote this message in a replyReply

Post: #5

చందుగారు, ఇవేనండి ఆ నవ వ్యాకరణములు. పద విచ్ఛేదంలో దోషములుంటే క్షమించగలరు!

ఐంద్రం, చాంద్రం, కాశకృత్స్నం, కౌమారం, శాకటాయనమ్, సారస్వతం, చాపిశలం, శాకల్యం, పాణినీయకమ్.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)