Post: #1

ద్విపాద శిరాసనము

ద్విపాద శిరాసనముః

ఒక్క పాదమును శిరస్సు దాటించి మెడపై పెట్టుటవల్ల ఏకపాద శిరాసనమని, రెండు కాళ్ళను శిరస్సు పై పెట్టుట వలన ద్విపాద శిరాసనమనియు అంటారు.

అందులో బాహుబలముతో శరీరమ్ంతయూ పైకి లేపి వేయుటను ద్విపాద బేకనాసనము అని వివిధ పేర్లతో పిలుస్తారు.

చేయువిధానముః

మెత్తని పక్కపై రెండు కాళ్ళు చాచి కూర్చుండవలెను. తరువాత ఎడమ కాలును వంచి రెండు చేతులతో పట్టుకుని వంచి ఎడమకాలుని మెడమీద పెట్టి ఎడమ భుజమును దాటించి వెనుకకు నెట్టి తలను పైకి లేపి రెండు చేతులను నేలకు ఆనించి కాలును నిగిడించి చేతులపై లేచుటను వామపాద శిరాసనమనియు, కుడి కాలును మెడమీద ఉంచి చేయుటను దక్షిణపాద శిరాసనమనియు, రెండు కాళ్ళను ఒకదానిపై ఒకటి శిరస్సుపై పెట్టి కూర్చొని రెండు భుజాలను లోనికి లాగి నమస్కరించుట ద్విపాద శిరాసనమనియూ చెప్పిరి.

అంతేగాక రెండుకాళ్ళను శిరస్సుపై పెట్టి రెండు చేతుల దండబలముతో శరీరమునంతయూ పైకి లేపివేయుటను బేకనాసనమనియూ అంటారు.

*****గురువు సమక్షములో ప్రత్యేక పర్యవేక్షణతో చేయవలసిన ఆసనము*****

ఫలితములుః

మల దోషములను హరించును, త్రికాస్థి - కాలి కండరములు బలపడును. ముఖ్యముగా కుండలినీ శక్తి మేల్కొనును.

*****నడుము నొప్పి, మెడ నొప్పి వున్నవారు ఈ ఆసనము వేయరాదు*****

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)