Post: #1

విండోస్ 7 లో మనకు అంతకు ముందు వచ్చిన విండొస్ ఆపరేటింగ్ సిస్టం ల లొ వలె Quck Launch Toolbar కనపడదు. దానికి బదులుగా Pin this program to taskbar అనేది మనకు కొత్తగా వచ్చిన సదుపాయం. క్రింది ఇమేజ్ లోని వివరణ చూడండి.


కాని మనం Quick launch toolbar  కావాలనుకుంటే ఒక పద్ధతి ఉంది. దాని నిమిత్తం టాస్క్ బార్ పై రైట్ క్లిక్ చేసి దానిని Unlock  చేయండి. తర్వాత Toolbars>New Toolbar అనేదానిని క్లిక్ చేయండి.

అపుడు వచ్చిన డైలాగ్ బాక్స్ లొని అడ్రెస్ లొ  క్రింది దానిని టైప్ చేసి లేదా పేస్ట్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. అపుడు Quicklaunch అనే ఫోల్డర్ కనపడుతుంది. దానిని లో క్రింద ఉన్న Select folder బటన్ ను క్లిక్ చేయండి.

C:\Users\(user-name)\AppData\Roaming\Microsoft\Internet Explorer\Quick Launch

ఇపుడు చూడండి మీ టాస్క్ బార్ పై కుడి వైపున కల నోటిఫికేషన్ ఏరియా కు ఎడమవైపున మీకు Quicklaunch toolbar కనపడుతుంది.

ఇపుడు చూడండి, మనకు Toolbars లో కూడా Quick launch toolbar కనపడుతుంది. టాస్క్ బార్ ను ఇపుడు Lock  చేసేయండి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)