Post: #1

ఏకపాద విపరీత దండాసనము


ఏకపాద విపరీత దండాసనముః


దండము అనగా కర్ర. మన వెన్నును మేరు దండము అని కూడ అంటారు. అంతేకాక మన చేతులలో దండచేతులు - దండచేయి కండరాలు అనికూడా ఉంటాయి. కనుక కర్రల వలే దేహమును గట్టిగా నిలబెట్టు కాళ్ళు, చేతులు, వెన్నుపూసలను కూడా దండములు అన్నారు. అట్టి దండములను వివిధకోణములలో నిలబెట్టుచూ చేయునని గాన వీటిని దండాసనములని అనిరి.

ఇందు ముఖ్యముగా త్రివిధ దండాసనములగురించి తెలుసుకుందాము!

1. యోగ దండాసనము

2. ఏకపాదశిర దండాసనము

3. ఏకపాదవిపరీత దండాసనము

చేయు విధానముః

యోగ దండాసనముః


పూర్వము ఋషులు ప్రాణాయామము చేయునప్పుడు ఎడమచేతి చంకలో ఒక పంగల కర్రను గూడు క్రిందకు చంకలో దూర్చి చేయి బరువు ఊపిరితిత్తులమీద పడకుండా పెట్టుకుని రెండవ చేతిని పైకెత్తి వ్రేళ్ళతో ముక్కుని పట్టుకుని ప్రాణాయామం చేసేవారు. అట్టి యోగదండమునకు బదులుగా కాలును మోకాలివరకు వంచి కర్రవలే పెట్టుట యోగ దండాసనము అంటారు.

ఏకపాదశిర యోగదండాసనముః


అదేవిధముగా కుడికాలును మెడమీద వేసుకుని ఎడమకాలును యోగదండమువలే చేయుట ఏకపాద శిర దండాసనము.

ఏకపాదవిపరీత దండాసనముః


ఈ ఆసనము వేయుటకు ముందు చక్రబంధాసనము వేసి ఒక కాలిని నిటారుగా ఆకాశం వైపుకు సూటిగా నిలబెట్టుట ఏకపాద విపరీత దండాసనము అనిరి.

దండాసనములు అని చెప్పబడే ఈ ఆసనములన్నియూ ప్రదర్శనలకు వెళ్ళదలచుకొన్న యోగవిద్యాప్రవీణులకు బాగా ఉపరించును.

ఫలితములుః


నాడీ ప్రవాహములు మెరుగుపడును.

జ్ణానేంద్రియములు, కర్మేంద్రియములు క్రమబద్ధమగును.

*****నడుము నొప్పి వున్నవారు ఈ ఆసనము వేయకూడదు*****

***గురువు సమక్షములో మాత్రమే అభ్యాసము చేయవలెను.***

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)