Post: #1

గర్భపిండాసనము


గర్భపిండాసనముః


గర్భస్థ శిశువును పోలియుండుటచే దీనిని గర్భపిండాసనము అని అంటారు.

చేయువిధానముః


మెత్తని పక్కపై కూర్చుని కాళ్ళు పైకి లేపి పద్మాసనము వేసి రెండు చేతులను గడ్డము క్రింద ఆనించి కూర్చుండవలయను. ద్వితీయ స్థితిలో రెండు కాళ్ళను చేతులతో చుట్టి పట్టుకుని అరచేతులను ఆనించి నమస్కరిస్తూ, చేతులను ముఖమునకు ఆనించవలెను. మూడవ స్థితిలో రెండు చేతులను పద్మాసనములోని తొడలు పిక్కలు మధ్యగా దూర్చి మోచేతులవరకు పైకి లాగి చేతులు గడ్డము కింద పెట్టి కూర్చుండవలయును.

ఫలితములుః


కాళ్ళు, చేతులు, నడుము లాగి బిగించుట వల్ల నాడీ ప్రవాహములు, రక్త ప్రవాహములు నిరాటంకముగా ప్రవహించును. పొట్టలోని కండరములకు అధికమైన వత్తిడి కలిగి అందలి దోషములు వెలువరింపబడును. అజీర్ణము, మలబద్ధకము, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లంబోదరము లాంటి వ్యాధులు నివారింపబడును. వెన్నుపాముకు స్థితిస్థాపక శక్తి పెరిగి మెరుగుపడును. నాడీ వ్యాధులు నివారింపబడును.

*****నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనము వేయరాదు*****


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)