Post: #1
తెలుసుకుందాం!!!
వారములుః - 7
అవిః-

ఇందువారము, భౌమవారము, సౌమ్య వారము, బృహస్పతి వారము, శుక్ర వారము, స్థిరవారము,భాను వారము.

తిథులు - 15
అవిః-

పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్థి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య.

పక్షములు - 2
అవిః-

శుక్ల, కృష్ణ
పదిహేను తిధులతో పౌర్ణమి వస్తే అది శుక్లపక్షమనియు, అమావాస్య వస్తే అది కృష్ణ పక్షమనియు అంటారు.

మాసములు - 12
అవిః-

చైత్రము(మార్చి - ఏప్రియల్), వైశాఖము (ఏప్రియల్ - మే), జ్యేష్ఠము (మే - జూన్), ఆషాఢము (జూన్ - జులై), శ్రావణము (జులై - ఆగష్ఠు), భాద్రపదము (ఆగష్టు - సెప్టెంబరు), ఆశ్వయుజము (సెప్టెంబరు - అక్టోబరు), కార్తీకము (అక్టోబరు - నవంబరు), మార్గశీర్షము (నవంబరు - డిసెంబరు), పుష్యము (డిసెంబరు - జనవరి), మాఘము (జనవరి - ఫిబ్రవరి), ఫాల్గుణము (ఫిబ్రవరి - మార్చి).

ఋతువులు - 6
అవిః-

వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరము.&
చైత్ర - వైశాఖములు (వసంత ఋతువు), జ్యేష్ఠ - ఆషాఢములు (గ్రీష్మ ఋతువు), శ్రావణ - భాద్రపదములు (వర్ష ఋతువు), ఆశ్వయుజ - కార్తీకములు (శరదృతువు), మార్గశిర - పుష్యములు (హేమంత ఋతువు), మాఘ - ఫాల్గుణములు (శిశిర ఋతువు).
వసంత ఋతువు చెట్లు చిగురించి పూలు పూస్తాయి మరియు కాయలు కాస్తాయి.
గ్రీష్మ ఋతువు- ఎండలు బాగా ఉంటాయి.
వర్ష ఋతువు - వర్షములు కురియును.
శరదృతువు - వెన్నెల బాగా కాయును.
హేమంత ఋతువు - మంచుకురియును.
శిశిర ఋతువు - చెట్ల ఆకులు రాలిపోతాయి.

కాలములు - 3
అవిః-

వేసవి కాలము, వర్షాకాలము, చలికాలము.

నక్షత్రాలు - 27
అవిః-

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పూర్వాఫల్గుణి, ఉత్తరాఫల్గుణి, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
ప్రతి నక్షత్రమునకు నాలుగు పాదములు వుంటాయి.

రాశులు - 12
అవిః-

మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము మరియు మీనము.
మేషరాశి - అశ్వని నాల్గు పాదములు, భరణి నాల్గు పాదములు మరియు కృత్తిక ఒకటవ పాదము
వృషభరాశి - కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి నాల్గు పాదములు మరియు మృగశిర 1,2 పాదములు
మిథునరాశి - మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర నాల్గు పాదములు మరియు పునర్వసు 1,2,3 పాదములు
కర్కాటకరాశి - పునర్వసు నాల్గవ పాదము, పుష్యమి మరియు ఆశ్లేష నాల్గు పాదములు.
సింహరాశి - మఖ మరియు పుబ్బ నాల్గు పాదములు మరియు ఉత్తర ఒకటవ పాదము.
కన్యారాశి - ఉత్తర 2,3,4 పాదములు, హస్త నాల్గు పాదములు మరియు చిత్త1,2 పాదములు.
తులారాశి - చిత్త 3,4 పాదములు, స్వాతి నాల్గు పాదములు మరియు విశాఖ1,2,3పాదములు.
వృశ్చికరాశి - విశాఖ నాల్గవ పాదము, అనూరాధ మరియు జ్యేష్ఠ నాల్గు పాదములు.
ధనూరాశి - మూల మరియు పూర్వాషాఢ నాల్గు పాదములు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదము.
మకరరాశి - ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణము నాల్గు పాదములు మరియు ధనిష్ట 1,2 పాదములు.
కుంభరాశి - ధనిష్ట 3,4 పాదములు, శతభిష నాల్గు పాదములు మరియు పూర్వాభాద్ర 1,2,3 పాదములు.
మీనరాశి - పూర్వాభాద్ర నాల్గవ పాదము, ఉత్తరాభాద్ర మరియు రేవతి నాల్గు పాదములు.

తెలుగు సంవత్సరములు - 60
అవిః-

ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి, హేళంబి, విళంబి, వికారి, శార్వరి, లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వాసను, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధాని, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన మరియు క్షయ
మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచండి.
ధన్యవాదములతో
మీ...
Quote this message in a replyReply

Post: #2
chala thank u sir
Quote this message in a replyReply

Post: #3

నిజానికి మన నిత్య జీవితంలో ఎదో ఒక సంధర్భంలో మీరు చెప్పిన ఈ విశయాలు అవసరమవుతూనే ఉంటాయి. కాకపోతే ఇలాంటివి చాలా మందికి గుర్తుండవు అన్ఫర్చునేట్లి.. ః) 

నాకైతే ఇలాంటి వివరాలు అవసరమైనపుడు గూగులమ్మ ను అడగడం అలవాటు కాని మీ ఈ పోస్టు వల్ల ఇక చాలా వరకు నాకు ఆ అవసరం రాకపోవచ్చు..

Appriciated Mr. Chandr Mouli.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
chala manchi vshayaparignani andinchinadu dhanyavadalu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)