Post: #1

నేస్తాలందరికీ శుభోదయం.

2009 లో ఆఖరి రోజు ఇది. ఎన్నీ మధుర స్మ్రుతులను, మరెన్నో చేదు నిజాలని చూశాం మనమందరం.

అందరి పుట్టిన రోజులకి శుభాకాంక్షలు తెలుపుకున్నాం. మిత్రులు వోడ్నాల గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాం.


టెక్నికల్ గా ఎదగడానికి ఈ ఫోరం ఎంతో ఉపయోగపడుతుంది అన్నది నిర్వివాదాంశం కదా..


ఐతే ఈ సంవత్సరంలో మీకు బాగా  నచ్చిన


వెబ్ సైట్ లేక వెబ్ సైట్స్ :

సాప్ట్ వేర్ లేక సాఫ్ట్ వేర్స్ :

ఆవిష్కరణ :

మీరు కొత్తగా నేర్చుకున్న విషయం :

మీకు నచ్చిన పుస్తకం :

మీరు ఈ సంవత్సరంలో కొన్న ఎలక్ట్రానిక్ పరికరం/పరికరాలు :

ఆ పరికరం/ పరికరాల వలన తెలుసుకున్న విషయాలు :


ఇలా మీకు నచ్చిన / తెల్సిన విషయం / విషయాలు ఎవ్వరినీ నొప్పించనివీ, నిజమైనవీ తెలియచేయండి.

పైన నేను స్పెసిఫై చేసినవన్నీ చెప్పనవసరం లేదు. కొన్ని ఐనా చెప్పండి. ఇంకా ఎక్కువైనా చెప్పండి. మీ ఇష్టం.


వెబ్ సైట్స్ , సాఫ్ట్ వేర్స్ మీకు తెల్సినవి ఎక్కువగా ఉంటే ఫైల్ ని అటాచ్ చేయగలరు లేదా ఫైల్ హోస్టింగ్ సర్వీసులని ఆశ్రయించగలరు.

ఈ ఒక్క పోస్ట్ లో 2009 ని చూడటానికి ప్రయత్నిద్దాం.

కొత్త సంవత్సరంలో వచ్చే సభ్యులకి ఈ పోస్ట్ ఒక రిఫరెన్స్ లా ఉండేలా చూద్దాం.

ప్రతిఒక్కరూ ఈ పోస్ట్ కి రిప్లై ఇస్తారని ఆశిస్తూ.............

Quote this message in a replyReply

Post: #2

మేడమ్ గారూ

వ్యక్తిగతంగా నేను అయితే

గౌరవ సభ్యులైన అందరి పోస్టుల నుండి స్పూర్తి పొందాను.

ఒక్కొక్కరిలో ఉండే వివిధ రకాల అంశాలైనవి నేర్చుకున్నాను.

శ్రీయుతులు మహి గారి నుండి,

శ్రీయుతులు మోహన్ గోపవరం గారు,

శ్రీయుతులు ప్రసాద్ గారు,

శ్రీయుతులు అనంత్ గారు,

శ్రీయుతులు నల్లమోతు శ్రీథర్ గారు,

శ్రీయుతులు యమ్ యన్ 48 గారు,

శ్రీయుతులు మహేష్ యస్సస్సార్ గారు,

శ్రీయుతులు గోపాల్ వీరనాల గారు,

శ్రీయుతులు రాగి శ్రీను గారు,

ఆడపడుచు జాహ్నవిగారి నుండి,

శ్రీయుతులు చందు గారు,

శ్రీయుతులు శివకుమార్ గారు,

శ్రీయుతులు కుమార్ అరుణ్ గారు,

శ్రీయుతులు కుమార్ వర్మ గారు,

శ్రీయుతులు విమల్ ఆత్రేయ గారు,

శ్రీ కొండేపూడి నిర్మల గారు,

శ్రీయుతులు యం. శ్రీనివాస్ గుప్తా గారు,

శ్రీయుతులు తెలగాం సురేష్ గారు,

శ్రీయుతులు క్రేజీ గారు,

శ్రీయుతులు శ్రీనాధ్ గారు,

శ్రీయుతులు త్రినాథ్ రెడ్డి గారు,

శ్రీయుతులు పియం బ్రహ్మారెడ్డి గారు,

శ్రీయుతులు .....................(పేర్లు ఎన్నన్ని)

అయ్యా...మమ్మల్ని మన్నించాలి.

పేరు పేరునా అందరి నుండి స్పూర్తి చెందటం జరిగింది.

ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని కనుక.

నేను పదిమందికి చెప్పాలంటే....

ముందు నేను తెలుసుకొని ఉండాలి గనుక

మీ అందరి సాహచర్యంలో చాలా చాలా ప్రయోగాలు చేయడం....విజయం సాధించడం జరిగింది.

అందుకు అందరికీ పేరు పేరునా .....కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఏది అజ్ఞానమో తెలుసుకోవడమే విజ్ఞానమంటే.

ఇక ఫైనల్ గా చెప్పొచ్చేమంటే....!!

మరణించిన మా మిత్రులు శ్రీ వొడ్నాల గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ....!!

అందరూ తమకు తోచిన విధిగా యథాశక్తిగా పోస్టు లు చేస్తూ సహకరించగలరు.

ఇది ప్రేమ పూర్వక ఆహ్వానం.

అందరూ కాకపోయినా కొంత మంది శబ్ధం లేకుండా నిశ్శబ్ధం గా పోస్టులు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు.

అలాకాకుండా...

ఈ నూతన సంవత్సరంలో మీదైన శైలిలో మంచి మంచి పోస్టులు చేయగలందుకు సహకరించండి.

ఏం....మీకేం తక్కువ.  మీరు ఎందులో తక్కువ.  (కాదు గదా)

మీకు తెలిసింది చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి పోస్ట్ రూపంలో పోస్ట్ చేయండి.

ఎవరికైనా ఫోరం మేనరిజం తెలియకపోయినా సరే ఇక్కడ ఉండే సదరు నిర్వాహకులు తగిన విధంగా సూచనలివ్వగలరు.

మాకేం తెలియదని ఊరకనే ఉండిపోయి.....సమయాన్ని వృధా చేయకండి.

మంచి మంచి పోస్టింగ్ లతో మీ కంటూ ఒక గుర్తింపు, ఆత్మీయతను పెంచుకోండి.

గుర్తుంచుకోండి.

ఇది మీ ఫోరం.

అందరికీ 2010 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Quote this message in a replyReply

Post: #3

జాహ్నవిగారు,

నేను ఈ ఫోరంలో చేరినప్పటినుంచి అమ్మలా ఆదరించింది.

అమ్మ ప్రేమను ఆత్మీయతను రక్తసంబంధీకులను ఇస్తుంది.

కానీ అమ్మలాంటి ఈ ఫోరం అలాంటి ప్రేమను, అలాంటి ఆత్మీయతతోపాటు ఆత్మసంబంధీకులను అందించింది.

అమ్మ జన్మనిస్తే ఈ ఫోరం అమ్మ పునర్జన్మనిచ్చి ఎందరో ప్రేమపూర్వకమైన సోదర సోదరీమణులను అందించింది.

కనుక అమ్మకు  అమ్మేసాటి.

అమ్మా అని నోరు తెరచి అడగటమే ఆలస్యము ఏమి అవసరము వచ్చిందో బిడ్డకు అని అడిగినవారికి అడిగిన వారికి అడిగినవన్నీ ఇచ్చింది, ఇస్తోంది, ఇస్తూనే వుంటుంది.

ఆత్మబంధువు వోడ్నాల గారి మరణం బాధించినప్పటికి జాతస్య హి ధృవో మృత్యుః అన్న గీతాచార్యుడు శ్రీకృష్ణభగవానులు అన్నట్లుగా అది కాలక్రమములో ఒక ప్రక్రియ అని బాధను దిగమింగుకోవల్సివచ్చింది.

ఇక నాకు నేను మన సు మణీయుడు అన్నట్లు నిశ్శబ్దంగా చదువుకుంటూ వెళ్తుండేవాడిని అన్ని పోస్టులను....

కానీ నాకు తెలిసిన విషయాలను అది ఏదైనా కావచ్చు మీ అందరితో పంచుకుంటే నాతప్పులేంటో తెలుసుకుని న్నన్ను నేను సరిదిద్దుకోవచ్చు అని నా ప్రయత్నము శ్రీ మహిగ్రాఫిక్స్ వారి డివోషనల్ థ్రెడ్ తో మొదలు పెట్టటము జరిగింది.

ఇలా నా ప్రస్థానము ప్రస్తుతము వరకు నా తల్లి తండ్రుల మరియు నా షిర్డిసాయినాధుని దయతో నడుస్తూ ఉంది.

ఇక నేను కొన్న వస్తువుల విష్యానికి వస్తే....

నాకు కొంచెము ఎలక్ట్రానిక్ వస్తువుల పిచ్చి ఎక్కువే, అందుకే నేను కొన్నవస్తువుల విషయము పెద్దలిస్టు ఇక్కడ పెట్టలేదు.

నాకు నచ్చిన ఫోరం, ఇదే నేను ఇక్కడే నా ఖాళీ సమయమంతా మీ అందరితో గడిపేస్తుంటాను.

ఈ సంవత్సరములో నేర్చుకున్న పాఠాల ఆధారంగా రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరాన్ని హాయిగా సుఖసంతోషాలతో మీరు, మేము, మనమందరము గడిపేయాలని నా గురుదేవుడైనా నా షిర్డిసాయినాధుని ప్రార్ధిస్తూ....

నూతన సంవత్సర శుభాకాంక్షలతో....

మీ...

చంద్రమౌళి పసుమర్తి

 

Quote this message in a replyReply

Post: #4
జాహ్నవిగారు,

ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ ఫోరం నాకు మంచి స్నేహితుడు
మంచి స్నేహితుని దగ్గర ఆప్యాయతకు, అభిమానానికి కొదవ ఉండదు
నేర్చుకోవడం అంటారా అది స్నేహంతోనే అబ్బుతుంది

స్నేహితులందరికీ 2010 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఇట్లు
Quote this message in a replyReply

Post: #5

Hi Friends ,

A Very Good Morning To U.

I Wish U A Happy N Prosperous New Year To All of U.


ఐతే ఈ సంవత్సరంలో నాకు బాగా  నచ్చిన


వెబ్ సైట్ లేక వెబ్ సైట్స్ :  ఈ లింక్  ని చూడగలరు  ( ఈ వెబ్ సైట్స్ ని నేను ఈ ఫోరం నుండి , మరియు మరికొన్ని చోట్ల నుండి గ్రహించాను)

సాప్ట్ వేర్ లేక సాఫ్ట్ వేర్స్ : You are not allowed to view links. Register or Login to view. Partition SW

ఆవిష్కరణ : నేను కొత్త వాటిని ప్రయత్నంచలేదు.

మీరు కొత్తగా నేర్చుకున్న విషయం : అపకారికి ఉపకారం గురించి విన్నాను. గడిచిన సంవత్సరం లో స్వీయానుభవం.

మీకు నచ్చిన పుస్తకం : ఇడ్లీ , వడ , ఆకాశం

మీరు ఈ సంవత్సరంలో కొన్న ఎలక్ట్రానిక్ పరికరం/పరికరాలు : ఏమీ కొనలేదు.

ఆ పరికరం/ పరికరాల వలన తెలుసుకున్న విషయాలు : --


Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)