Post: #1

 ప్రత్యక్ష ప్రసారాల్లో ఆ ఆలస్యమెందుకు ?

ప్రశ్న : టీవీ ఛానెళ్ళలో లైవ్ టెలికాస్ట్ సందర్భంలో న్యూస్ రీడర్, వేరే చోట ఉన్న రిపోర్టర్ తో మాట్లడేటప్పుడు కొంత ఆలస్యంగా మాటలు వింటున్నట్లు అనిపిస్తుంది.  ఎందుకలా ఆలస్యంగా వినిపిస్తాయి ?

జవాబు : మనం ఫోన్లో ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంత ఆలస్యంగా వినడాన్ని గమనించే ఉంటారు.  కారణం ఏమిటంటే, ఫోన్లలో మాటలు విద్యుత్ తరంగాలుగా మారి, ఆ పై రేడియో తరంగాల రూపంలో వెళ్లేందుకు ఆ పాటి సమయం తప్పదు.  కానీ టీవీలో ప్రత్యక్ష ప్రసారాల సమయంలో మాటల ఆలస్యానికి కారణం అది కాదు.

ఇక్కడ కావాలనే షుమారు 7 సెకన్లు ఆలస్యంగా ప్రసారం చేస్తారు.  ఎందుకంటే ఒక్కోసారి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనే వ్యక్తుల మాటల్లో వాదోపవాదాలు, అనాలోచిత వ్యాఖ్యానాలు ఉండే అవకాశం ఉంది.  లేదా అనుకోకుండా తుమ్మో, దగ్గో కూడా రావచ్చు.  అవి అలాగే ప్రసారమైతే బాగుండదు కాబట్టి, ఎక్కడో ఉండే రిపోర్టర్ లేదా వ్యక్తి మాటల్ని ప్రసారం కాక ముందే వింటారు.  ఇబ్బందేమీ లేకపోతే వాటిని యధాతథంగా ప్రసారం చేస్తారు.  పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని తొలగించడానికి వీలుగా సాంకేతికంగా టీవీ స్టేషన్లో ఏర్పాటు చేసుకున్న ఏర్పాటన్న మాట ఇది.  ఇలా తీసుకునే కాల వ్యవధిని సప్త క్షణ నిరీక్షణ ( 7 Second delay) లేదా అనుచిత ప్రసార విరామం (Profamity delay) అంటారు.


సోర్స్ : ఈనాడు సౌజన్యంతో.....!!

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)