Post: #1

గరుడాసనము


గరుడాసనముః


నిటారుగా నిలబడి కుడి తొడను ఎడమ తొడమీదికి ఎక్కించి, పాదమును ఎడమ పిక్కకు చుట్టి, బొటన వ్రేలును ఎడమ పాదము మీదికి త్రిప్పి, ఎడమ చేతిని కుడి చేతికి చుట్టి అరిచేతులు రెండునూ కలిపి నమస్కారము చేయవలెను. ఇట్లే కాలు చేయు మార్పు చేయవలెను.

ఫలితములుః


1. బుడ్డలను తగ్గించును. (అండవాతము) (హెర్నియా).

2. కాలి కండరములను నరములను బలిష్టముగా చేయును.

దీనికి ఫణీంద్రాసనము అని కూడా పేరు కలదు. పామువలే కాళ్ళు, చేతులు మెలిత్రిప్పబడుట వల్ల దీనికి ఫణీంద్రాసనము అని పేరు వచ్చింది.

పామును ఎత్తుకునిపోవు గరుడుని వలే ఉండును. కనుక దీనికి గరుడాసనము అనిపేరు వచ్చింది.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచండి.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)