Post: #1

గోముఖాసనము


గోముఖాసనముః


ఈ ఆసనములో మోకాళ్ళు రెండు ఒక దానిపై ఒకటి దగ్గర చేర్చి ఉండటం వలన ఆవు ముఖాకారాన్ని పోలి ఉండును. అందుచేత ఈ ఆసనానికి గోముఖాసనమే పేరు వచ్చింది.

చేయు విధానముః


కుడి ప్రక్కకుః-

1. రెండు కాళ్ళను తిన్నగా చాపి కూర్చొని ముందు కుడికాలిని బాగా దగ్గరగా మడిచి, కుడి పాదాన్ని ఎడమ పిర్ర ప్రక్క భాగానికి చేర్చి ఉంచాలి. తరువాత ఎడమ కాలిని మడిచి, రెండు చేతులతో పాదాన్ని పట్టుకుని కుడికాలి తొడమీదుగా లాగుతూ కుడి పిర్ర ప్రక్క భాగానికి చేరుస్తారు. రెండు మోకాళ్ళు బాగా దగ్గరగా కలిసేటట్లు కాళ్ళను లాగుకోవాలి.

2. కుడిచేతిని వీపు తోముకోవటానికి పెట్టినట్లు వీపు వెనుక భాగానికి చేర్చి ఎంత పైకి నెట్టగలిగితే అంత పైకి నెట్టి ఉంచాలి. తరువాత ఎడమ చెయ్యి ఆకాశాన్ని చూసేటట్లు చెవి ప్రక్కనే పెట్టి తిన్నగా పైకి లేపాలి. ఇప్పుడు ఎడమచేతిని మోచేతి వరకు వెనక్కు వంచి వీపు భాగానికి చేరుస్తారు. ఇపుడు రెండు చేతి వ్రేళ్ళూ కలిపి పట్టుకోగలగాలి. అలా పట్టుకుని కళ్ళు మూసుకోవాలి. ఎడమ మోచేయి ఆకాశాన్ని చూసే విధముగా లైనుగా ఉంచాలి. మెడను నిటారుగా, నడుమును నిటారుగా జరుపుకోవాలి.

***ముందుగా పైచేయిని మెల్లగా దించి, తర్వాత క్రింద పెట్టిన చేయిని జాగ్రత్తగా మెల్లగా తీయాలి. తరువాత ఎడమకాలిని ముందుకు చాపి కుడి కాలును మెల్లగా తీసి రెండు కాళ్ళను చాపుకోవాలి.***


వేరే పద్ధతిః


తొడలు బాగా లావుగా ఉన్నవారికి ప్రక్కలు బాగా లావుగా వున్నవారు వజ్రాసనములో కూర్చొని చేయాలి.

ఫలితములుః


1. జబ్బలు, భుజాలు లావు వున్నవారికి, ఆ భాగాలలో కొవ్వు కరిగి భుజాలు అందంగా తయారవుతాయి.

2. భుజాల నొప్పులు తగ్గుతాయి.

3. నరాల నొప్పులు, చేతి తిమ్మిర్లు తగ్గుతాయి.

4. కీళ్ళవాతం, కీళ్ళు పట్టివేయడం, కీళ్ళు అరగడం వంటి ఇబ్బందులు భవిష్యత్తులో రావు.

5. ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు, ఆలయాలకు వెళ్ళినా అక్కడ గంటసేపు కదలకుండా, గోముఖాసనస్థితిలో కూర్చుని మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.

గమనికః- ఏకాలు క్రింద వుంటే ఆచేయి క్రింద, ఏచేయి పైన వుంటే, ఆకాలు పైన అనే మొండి గుర్తుపెట్టుకుని ఈ ఆసనము వేయాలి.


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)