Post: #1

హలాసనము


హలాసనముః


హలము అంటే నాగలి. ఈ ఆసనములో శరీరం నాగలి ఆకారాన్ని పోలి వుంటుంది. అందుచేత హలాసనము అంటారు.

చేయు విధానముః


1. ముందుగా సర్వాంగాసనము వెయ్యాలి. సర్వాంగాసనములో పైనున్న కాళ్ళను మెల్లగా దించుతూ మోకాళ్ళు వంచి రెండు మోకాళ్ళు ముఖానికి ఇరువైపులా వచ్చేటట్లు జరుపుకుంటూ పాదాలను తలవెనుక నేలను ఆనిస్తారు.

2. తరువాత నడుముకు పట్టి పెట్టుకున్న చేతులను తీసి నేలకు ఆనేటట్లు చాపుతారు. తరువాత రెండు మోకాళ్ళను మెల్ల మెల్లగా లైను చేస్తూ పాదాలను దూరంగా జరుపుతూ చివరకు పాదం దగ్గర నుండి పిర్రల వరకు ఏక లైనుగా కాళ్ళు ఉండేటట్లు జరుపుకుంటారు.

ఈ స్థితిలో ఉండగల్గినంతసేపు ఉండి తర్వాత మెల్లగా కాళ్ళను మడుస్తూ, ఛాతీని దింపుతూ మామూలు స్థితిలోనికి వచ్చి వెల్లికిలా పడుకోవాలి.

ఫలితాలుః


1. థైరాయిడ్ గ్రంథి చురుగ్గా పనిచేస్తుంది.

2. పిట్యుటరీ గ్రంథి, ఎండోక్రైన్ గ్రంథులు అన్నీ బాగా పనిచేస్తాయి.

3. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

4. మెడ బలంగా తయారవుతుంది.

***నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనము వేయరాదు.***


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)