Post: #1

మిత్రులారా...!!

ఒక అనుభూతి మీ అందరితో పంచుకోవాలని....

అనుమతిస్తారనీ...

ది. 03.01.2010 రోజు నాకు వ్యక్తిగతంగా మరచిపోలేని రోజు.

కారణం ఒక మంచి వ్యక్తిని కలుసుకోగలిగాను.

అది ఎంతో కష్టమ్మీద.

ఉదయం నుంచి ఆఫీసులో ఎడతెరిపి లేని పనులు చక్కబెట్టుకొని.....

సాయంత్రం కాగానే విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రాంగణంలో వాలిపోయాను.

అక్కడ.....విశేషాలు చిత్తగించండి.

శ్రీయుతులు చిలకపాటి శివరాం ప్రసాద్ గారు, శ్రీ శ్రీనివాస్ కర, మచిలీపట్నం గారు

శ్రీయుతులు ప్రసాద్ గారు నన్ను సాదరంగా ఆహ్వానించి తమ మనిషిని చేసుకొన్నారు.

ఆయన ఎంతో నిగర్విగా, సంస్కారయుతంగా, నిరాడంబరంగానే అద్భుతంగా కనిపించారు.

ఆయన మాట తీరుకు, ప్రవర్తనకు చేతులెత్తి మొక్కాలని పించేలా అనిపించింది.

పరిచయాలు తదనంతరం....e-తెలుగు కార్యక్రమ సభ్యులను, ఇతరులను పరిచయం చేశారు.

తరువాత వేదిక వద్దకు సాదరంగా తోడ్కొని వెళ్ళి అక్కడ ఆశీనులైన తరువాత....

e-తెలుగు కార్యక్రమం ప్రారంభమయిన తరువాత ....

వచ్చిన స్పందనలో భాగంగా చాలా మంది బ్లాగును ప్రారంభిస్తామని....తెలుగులో వ్యవహారాలు జరుపుతామనీ

ఉత్సాహంతో తెలియజేయటం జరిగింది.

వివరాలకు ఈ లింక్ చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

కార్యక్రమానంతరం....

చిన్న పాటి సంభాషణతో మాట్లాడుకుంటూ....తిరుగు ప్రయాణం లో...

చాలా మంచి విషయాలను ముచ్చటించుకుంటూ....

చాలా సేపు నేను అలా...అలా....(మాటలకందని భావం కదలాడుతోంది మిత్రులారా...!!)

క్లుప్తంగా ఆయనతో సంభాషించడం....!!  చాలా ఆహ్లాడకరంగా ఉంటుంది.  మన అనే ఫీలింగ్ వ్యక్తమౌతుంది.

ఆయనలో ఫ్రాంక్ నెస్ నచ్చింది.  తనకు సాంకేతిక సహాయం చేసినవారిని ఎలా గుర్తుంచుకున్నారో....

ప్రత్యేకించి గోపాల్ వీరనాల గారిని ఎన్ని సార్లు తలచుకున్నారో...(నిజంగా ఎంత వినయం...ఎదిగినా కూడానూ...)

యువకులైన మేమంతా చేస్తున్న కృషిని అభినందిస్తూ.....ఆయన తన ఆశీస్సులను అందజేశారు.

నిజానికి ఆయనే నవ యువకులు.  (అతి శయోక్తి గాదు మిత్రులారా....!! మనతో పోటీ పడే ఆయనే నిజమైన నవ యువకులు)

నేనెల్లప్పుడూ ఒక మాట అంటూంటాను....కొంత మంది యువకులు...ముందు తరం దూతలు...జీవన, నవ జీవన బృందావన నిర్ణేతలు

మొత్తానికి ఒక ఆహ్లాద భరితమైన వాతావరణంలో కలుసుకున్నాను.

నేను ఉదయం నుంచి పడిన కష్టాలను మరిచిపోయి...హాయిగా ఎనర్జిటిక్ గా తయారయి...ఇంటికి బయలు దేరటం జరిగింది.

* * * * *  మొత్తానికి నేను చెప్పదలచుకున్నదేమంటే....(నా అనుభవంలో) నేర్చుకోవాలంటే...ఈ ప్రపంచంలో చాలా ఉన్నది.  అయితే మనం అందిపుచ్చుకోవటమే మిగిలింది.  ప్రపంచాన్ని జయించాలంటే....నాలుక మీద స్వాధీనం ఉండాలి.  మనసు పై నియంత్రణ ఉండాలి.  మన ప్రవర్తన హూందాగా ఉండాలి.  నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. నేర్చుకోవాలి....తెలియజెప్పాలి.  నిరంతరం సాగే ఈ ప్రక్రియలో...జీవితం కరిగిపోయే మంచు...ఉన్నంతలో...తెలిసినంతో నలుగురికీ మంచిని, విజ్ఞానాన్ని పంచు...!!  * * * * *

శ్రీయుతులు ప్రసాద్ గారు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని సభా ముఖంగా (సారీ ఫోరం ముఖంగా) కోరుకుంటున్నాను. తప్పులుంటే మన్నించండి.

Quote this message in a replyReply

Post: #2

 మీరెక్కడ??? నా ఊహ కరెక్ట్ అయితే ఎడమనుంచి మొదట మీరు.అవునా??????

 మిత్రమా,

మా అందరి తరఫున మరియు ఫోరం తరఫున మీరు వారిని కలవటం నిజంగా అభినంచదగ్గ విషయము.  ముఖ్యంగా పై ఫోటో అందించినందుకు కృతజ్ణతలు.

మీ పనులతో సతమతమవుతూ కూడా మీరు ఇలా మంచి మంచి వ్యక్తులను కలవటము చాలా ఆనందదాయకము.

ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post: #3

సుమణి వెంకట్ గారికి ఆయన నా పై వ్యక్తపరచిన అభిప్రాయానికి ముందుగా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఎవరిపైనైనా మనకు ఒక అభిప్రాయం కలిగిందంటే అది మన భావాలకు, అనుభవాలకు అనుగుణంగా ఉంటే పాజిటివ్ గాను, వ్యతిరేకంగా ఉంటే నెగటివ్ గాను అనిపిస్తుంది. సుమణి వెంకట్ గారు అన్నంతగా గొప్ప నైపుణ్యాలు నాలొ ఏమీ లేవు,

3 సంవత్సరాల క్రితం వరకు  చాలా చాలా సాధారణంగా బ్రతికే వాడిని నేను, నా కుటుంబం, నా ఉద్యోగం,  ఖాళీ సమయాలలో గత 10 సంవత్సరాలనుండి అంతర్జాలం లొ విహరణ, నేను - అంతే. కాని శ్రీ గోపాల్ వీరనాల గారు, శ్రీమతి వలబోజు జ్యోతిగారు, శ్రీ రవిశంకర్ గారు, శ్రీనివాస్ కర గారు, శ్రీ రాఘవులు గారు, శ్రీ బోరెడ్డి మహేష్ రెడ్డి గారు లాంటి వారు మరెందరో  చూపిన బాట, అందించిన సాంకేతిక సహాయం, వారి వ్యవహార శైలి స్ఫూర్తిగా ఈ రోజు నేను నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ఈ ఫోరం ద్వారా నలుగురికి అందించి సంతృప్తిపడుతున్నాను. ఎంత సంపద సంపాదించినా ఈ తృప్తి రాదు. ఇలా తమకు తెలిసిన విజ్ఞానాన్ని అనేక విధాలుగా వివిధ ప్లాట్ ఫారం ల ద్వారా నిస్వార్ధంగా అందిస్తున్న ఎందరో మహానుభావులు - అందరికీ వందనాలు.

ఇక సుమణి వెంకట్ గారి గురించి నా మనసులో మాట నేను తప్పక అందరి ముందు ఉంచాలి. ఆయనలో ఉన్న Simplicity, Frankness, భావ వ్యక్తీకరణ నాకు నచ్చాయి. మనం రోజూ ఆయనను వారి పోస్ట్ ల ద్వారా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆయన చేస్తున్న పోస్ట్ లు, ఆయన సిగ్నేచర్ లో ఇచ్చిన తన బ్లాగ్ ల లొని విజ్ఞాన సర్వస్వం ఆయన లోని నిజాయితీని, ఆయన "Level of Intellectuality" ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. ఆయనలో నిండి ఉన్న ఆ Holism  కు తగిన జీవితాన్ని ఆ భగవంతుడు ఆయనకు అతి త్వరలో కల్పించి, ఆయనకు ఆయన కుటుంబానికి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు తో ఆయురారోగ్య ఐశ్యర్యాలతొ, సుఖ సంతోషాలతో, కీర్తి ప్రతిష్టలతొ, శక్తి సామర్ధ్యాలతో కూడిన మంచి జీవితం లభించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, అలాగే ఈ ఫోరం సభ్యులందరినీ ఆశీర్వదిస్తూ . . . .

చిలకపాటి శివరామ ప్రసాద్

Quote this message in a replyReply

Post: #4

సుమని వెంకట్ గారూ !

మీ టపా చాలా ఆలస్యంగా చూస్తున్నాను. క్షమించండి. ఇ-తెలుగు కార్యక్రమ వివరాలు తెలియజెయ్యడానికి నా బ్లాగు లింకు  ఇచ్చినందుకు కృతజ్నతలు. ప్రసాదు గారి గురించి మీరు వ్రాసినది నిజం. ఆయనతో నాకు పరిచయం ఇటీవలే

జరిగినా మొదటి పరిచయంలోనే ఆయన వ్యక్తిత్వం అర్థమయింది. మీకభ్యంతరం  లేకపోతే మీ వివరాలు తెలియజెయ్యండి.

నా బ్లాగు టపాల మీద నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.

అభినందనలతో

ఎస్.ఆర్.రావు

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #5
వెంకట్ గారు,
ఈ పోస్టు చదువుతుంటే ప్రసాద్ గారిని మేము కలుసుకోలేకపోయినందుకు భాధగాను, మీరు కలుసుకున్నందుకు ఆనందంగాను ఉంది. ప్రత్యక్షంగా మిమ్మల్నందరినీ కలవలేకపోయినా మహిగ్రాఫిక్స్ ద్వారా మీ అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించిన మహేష్ గారికి ఈ సంధర్భంగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను......
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)