Post: #1

బోరున కురుస్తున్న వానలో

కత్తులతో నా పొట్టలో కోస్తున్న కోతలో

నీ జన్మకై నేను పడుతున్న ఈ ఆరాటంలో,

నిన్ను బతికించుకుందామనుకున్న ఆశనే కదా..!!

నా ఒంట్లో పేగులను చీలుస్తూ

పుట్టించిన ఆ భగవంతుడిని తిడుతూ

గుండెలవిసేలా ఉన్న నా అరుపులు

ప్రాణాలను కదిలిస్తున్న నొప్పులు

ఇవన్ని ఎందుకోసమని నేనెప్పుడు

అనుకోలేదు కన్నా !!

 

నీ క్షేమం కోసమని

నా శరీరాన్ని సూదులతో గుచ్చి,

డాక్టర్లు నా పొట్టను కోసి

నా రక్తం కారేలా చీలుస్తూ,

నిన్ను ఈ ప్రపంచంలోనికి తెచ్చిన క్షణాన

నా మదిలో కలిగిన ఆనందానికి(??)

నా చావును అడ్దు పెట్టాను, కాని నాన్న,

చిన్నపాటి జొరానికి సైతం

తట్టుకోలేని స్థితిలో

నిస్సహాయంగా ఉన్నాను ఇపుడు.

మాటలు తడబడుతూ

అసహ్యంగా ఉన్న నా మొహంలోని

మడతలను చూస్తూ నీ కల్లల్లో

కనబడుతున్న ఏవగింపును (?) చూడడానికి

ఆ దేవుడు నాకు కళ్ళుంచినందుకు నిందిస్తున్నాను.

ఆకలిగా ఉంది నాన్న, అడగడానికి నోరు సహకరించడం లేదు కన్నా

కోంచెం అన్నం పెట్టరా సోశొచ్చి కళ్ళు తిరుగుతున్నాయి.

నీ కోడుకు తిన్నపడు కింద పడే మెతుకులైనా పెట్టరా మా బాబు కదూ.

ఎందుకు కన్నా నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నావు

నా ఒంటిపైనా నీ మలముత్రాలు పడ్డపుడూ నేను అసహ్యించుకోలేదు

నీకు అనారోగ్యమైనపుడు నా పైన వాంతులు చేసుకున్నా అసహ్యించుకోలేదు

అమ్మతనాన్ని నమ్ముకున్నాను కన్నా!

ఇంకా కొద్దిరోజులే కదా నేను ఉండేది

కాస్త అన్నం పెట్టు  నాన్న.

 

( ఇంతకు మించి నేను రాయలేక పోతున్నాను అమ్మ మనసును వివరించడానికి నాకు ఉన్న అనుభవం సరిపోదు - క్షమించగలరు)

 

 

 


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
మిత్రమా...!!
మీరు వ్రాసిన ఈ కవిత చదివిన తరువాత
చెమ్మగిల్లని కళ్ళు ఉండవంటే అతిశయోక్తి గాదు.
అమ్మదనం కమ్మదనం కాకుండా పోదు.

మనసు తడి...కనులు తడి....
వెతలు తడి....మాటలు తడబడి....!!

ఈ సందర్భంలో ‘‘ అమృతం తాగిన వాళ్ళు... దేవతలు దేవుళ్ళు....!!
అది కన్న బిడ్లలకు పంచేవాళ్ళు....అమ్మానాన్నలు...
మన అమ్మా నాన్నలు....’’ !!

మీకు మా హృదయపూర్వక అభినందనలు.
మంచి ఆర్థ్రమైన కవిత్వంతో మాకు మాటలు రాకుండా చేసినందుకు...!!
గో ఎ హెడ్.
Quote this message in a replyReply

Post: #3

అమ్మ గురించి చెప్పడానికి బ్రహ్మ కైనా సాధ్యం కాదంటారు. కానీ మీరు చాలా బాగా చెప్పారు.

చెమ్మ గిల్లిన నయనాలతో అభినందనలు.


‘‘ అమృతం తాగిన వాళ్ళు... దేవతలు దేవుళ్ళు....!!
అది కన్న బిడ్లలకు పంచేవాళ్ళు....అమ్మానాన్నలు...


ఈ పాట "బుద్దిమంతుడు" చిత్రం లోనిది అని అనుకుంటున్నా... ఎవరికైనా వీలైతే ఆడియో, వీడియో లను అందించగలరు.


ముందస్తు ధన్యవాదములు


Quote this message in a replyReply

Post: #4
మేడమ్ జీ...!!

ఆ పాట ‘‘ప్రతిభావంతుడు ’’ సినిమాలోనిది. తారాగణం హీరో మాత్రమే తెలుసు : సూపర్ స్టార్ కృష్ణ. పాడినది జేసుదాసు గారు.
Quote this message in a replyReply

Post: #5

సహృదయంతో స్పందించిన సుమణి వెంకట్ మరియు జాహ్నవి గార్లకు ముందుగా ధన్యవాదాలు.

అమ్మను మనసులో అడాప్ట్ చేసుకుని ఒక్కసారి మనిషి పుట్టే సమయంలో నేను ఉంటే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో చేసిన చిన్న ప్రయత్నమే ఇది.. కాని అది ఎంతటి నరకమో, ఎంతటి బాధనో, పురిటి నొప్పులను ఆనందంగా ఎలా అమ్మ భరిస్తుందో అలోచనల్లో అయినా బయమేసింది నాకు , అక్షరాల్లో చూద్దామని రాసాను కాని నా వల్ల కాలేదు పూర్తిగా . కాని మంచి స్పందనతో మీరు వెలిబుచ్చిన రాతలు నా కలానికి ఉన్న దాహం కొద్దిగా తీరిందేమో అనిపిస్తోంది నాకు.

మరొక్క సారి ధన్యవాదాలు..

మీ.....


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)