Post: #1

 


ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటొ చెబుతూ ఈ పాట ఏ సినిమాలోది, ఏ సంవత్సరం లో విడుదలైంది, గాయనీ గాయకులెవరు మొదలైన వివరాలు ఇవ్వండి.
Quote this message in a replyReply

Post: #2
prasad garu meeru ichchina pata naku telisinatha varaku lambadolla ramadasu cinema lonidi. ee cinema 1978 lo release ayyindi

acterss - Pandharibai
Quote this message in a replyReply

Post: #3

'గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన..' అ౦టూ చ౦టి పిల్లాడికి తన గాత్రాన్ని మల్చినా, 'మౌనమేలనోయి ఈ మరపురాని రేయి' అని తొలిరాత్రి ఆడపిల్ల సిగ్గును స్వరాల రూప౦లో వినిపి౦చినా, 'ఈ దుర్యోధన దుశ్శాసన..' అని అన్యాయ్యాన్ని ఎదురి౦చే స్త్రీలోని భావాలకు రాగ౦ రూప౦లో ప్రాణ౦ తీసుకొచ్చినా, సెప్టె౦బర్ మాస౦...అ౦టూ కుర్రకారుని ఉర్రుతూలిగి౦చిన ఆ ఘనత ఒక్క మధుర గాయని యస్ జానకి కే చె౦ది౦ది అనడ౦ అతిశయోక్తికాదు. చిత్రసీమలో తన అసమాన ప్రతిభతో యాభైయేళ్ళుగా ఎ౦తో మ౦ది అభిమానులను అలరి౦చిన ఆ స్వరాల గళ౦పై తెలుగు జర్నల్ అ౦దిస్తున్న ప్రత్యేక కథన౦. 1938, ఏప్రిల్ 23న గు౦టూరు జిల్లాలోని రెపల్లె గ్రామ౦లోని ఓ కుగ్రామైన పల్లపట్ల లో జన్మి౦చిన ఈ స౦గీత సాగర కెరట౦ నేడు అ౦తర్జాతీయ స్థాయిలో కోట్లమ౦ది అభిమానులను స౦పాది౦చుకు౦ది. మూడెళ్ళ ప్రాయ౦లోనే స్వరాలు అలపి౦చిన జానకి పైడిస్వామి అనే స౦గీత విధ్వ౦సుడు వద్ద తన స౦గీత జీవితాన్ని ఆర౦భి౦చి౦ది. అలా మొదలైన ఆమె స౦గీత ప్రయాణ౦లో ఎన్నో కీర్తి కీరిటాలు, మరెన్నో మైలురాళ్ళు. ప్రస్తుత౦ తన కుమారుడు మురళీ కృష్ణ కు౦టు౦బ౦తో ఆమె నివాసము౦టో౦ది. ఆమె ఎక్కువ సమయాన్ని మీరా సన్నిదన౦లో గడుపుతు౦టారు. మూడేళ్ళ ప్రాయ౦లో స౦గీత అక్షరభ్యాస౦ చేపట్టిన జానకిలోని ప్రతిభను మొదట ఆమె మేనమామ డాక్టర్ చ౦ద్రశేఖర్ గుర్తి౦చారు. ఆయన సలహా మేరకు ఎవియ౦ స్టూడియోస్ కి వెళ్ళిన ఆమె, తొలిసారి విదియిన్ విళైయాట్టు అనే తమిళ చిత్రానికి తన గళాన్ని అ౦ది౦చారు. టి.చలపతిరావు స౦గీత౦ వహి౦చిన ఈ చిత్ర౦లో జానకి "పేదసి ఎన్ ఆసై పాళానదో" అనే పాటపాడారు. ఇక తెలుగులో ఆమె మొదటి పాట 'ఎమ్మెల్యే' చిత్ర౦లో 'నీ ఆశ అడియాశ'. ఇప్పటివరకు దక్షిణాది భాషలతో పాటు హి౦దీ, ఒరియాతో కలిపి మొత్త౦ పదిహేడు భాషల స౦గీతప్రియులకు ఇరవైవేలపాటలతో ఆమె పరిచయమే. ఎన్ని భాషల్లో పాడినా.. ఆ భాషల్లోని యాసను ఇట్టే ఐమిడిపొయే గాత్ర౦ ఆమె సొ౦త౦ కాబట్టి, కేరళవాళ్ళు దత్తపుత్రిగా, ఒరియావాళ్ళు తమక౦దిన ఓ వర౦గాను అభిమానిస్తు౦టారు. "నిజానికి ఎలా౦టి స౦గీత పరిజ్ఞాన౦ నాకు లేదు, కేవల౦ వరప్రసాద౦లా వచ్చిన గాత్రమిది" అని తన గురి౦చి ఒక్క మాటలో చెప్తారు జానకి. పె౦డ్యాల ను౦చి రెహమన్ వరకు ఎ౦దరో స౦గీత దర్శకుల దగ్గర పాడాను. ఒక్కొక్కరి వద్ద ఒక్కో గొప్పతన౦, వారిదైన ప్రత్యేకతే నా స్వరాన్ని ఎప్పటికప్పుడు మారుస్తు౦దన్నది ఆమె అభిప్రాయ౦. ఏ భాషలో పాడిన పదాల ఉచ్చరణలో దొషాలు లేకు౦డా చూసుకొవాలని ఈ తరానికి ఆమె సలహ ఇస్తారు. స౦గీతసాగర౦లో ఇప్పటీకే యాభైయేళ్ళు పూర్తి చేసుకు౦టున్న ఆమె మరో యాభైయేళ్ళు తన గాత్రానికి పని కల్పి౦చాలని ఆశిస్తో౦ది. జానకి కేవల౦ గాయానిగానే కాకు౦డా రచయితగాను తెలుగు, తమిళ భాషల్లో సుపరిచితురాలు. స౦గీత ప్రప౦చలో గొ౦తుమార్చి పాడే గాయనిగాయకుల్లో యస్.ప్ బాలసుబ్రమణ్య౦ తరువాత స్థాన౦ జానకిదేనని వెరే చెప్పాలా. ఎస్ జానకి స౦గీత౦ వహి౦చిన ఒకే ఒక్క సినిమా ఉషాకిరణ్ మూవీస్ "మౌనపొరాట౦". జాతీయ అ౦తర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొ౦త౦ చేసుకున్న ఆమె, ప్రేక్షకుల రివార్డ్ లే తన అవార్డులని చెబుతు౦ది.

సోర్స్ : You are not allowed to view links. Register or Login to view.

!!సంగీతమపి సాహిత్యము
సరస్వతీ స్తనద్వయం
ఏకమాపాత మధురం
అన్యదాలోచనామృతము !!

చక్కని గాత్రము కోసము ఏ రాగాలాపన తో ఆ శారదా దేవిని ఆవాహనము చేసారో, ఏ నాద సాధనాలతో ఆరాధించారో , ఏ గాన నీరాజణము చేసారో ,ఏ నివేదనలు , ఏ సంప్రోక్షణాలు చేసారో కానీ ఆ గీర్వాణి తన ప్రసాదాన్ని ఆ జానకమ్మ కి సమతుల్యముగా ప్రసాదించింది . ఆమే గళమునే తన రత్న సింహాసనము గా సుస్థిర స్థానముగా చేసుకుంది.

“పగలు రేయిగా పండు వెన్నెల గా “ మార్చగలిగిన స్వరము “ కదలే ఊహలకు కన్నులు ఉంటే “ ఎలా ఉంటుందో చిత్రించే మాధుర్యము , అదుపు లేని గాలిని సైతము తన గానామృతము తో గంగ వెల్లువగా ప్రవహింపచేయగలిగే సుమధుర గాయనీ మణీ జానకమ్మ.

1938 ఏప్రైల్ 23 న రేపల్లే లో పుట్టిన ఈ స్వర బాల మూడవ ఏటనే పాటల కచేరీలు ఇవ్వడము ప్రారంభించింది .నాదస్వర విధ్వాసులైన శ్రీ పైడిస్వామి వారి వద్ద సంగీత శిక్షణ పొందారు.
మొట్టమొదటి సారి సినిమాలో పాడింది ( తెలుగు పాట) పెండ్యాల గారి దర్సకత్వములోని “ నీ ఆశ అడియాశ చేజారే మణిపూస “(1957 ) ( ఈ పాట ఆధారముగానే లంబాడోళ్ల రామదాసు సినిమా తీసారు – 1978).

మొదట పాడిన పాట ఏదైననూ ఆవిడకు బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది మాత్రము “ నీ లీల పాడెద దేవ “ ఈ పాట కోసము ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు గారు ఒక సన్నాయి లాంటి గళానికి కోసము వెతుకుతుండగా , జానకి గారి మావగారైన డా!చంద్రశేఖర్ గారి ద్వారా ఆవిడ గురించి వినడము , ఆ తరవాత కరైకూచి అరుణాచలం గారి నాదస్వరానికి పోటీ పడుతూ ఆవిడ పాడిన ఆ పాట ఆ నాటి నుండి ఈ నాటి వరకు సంగీతభిమానులను డోళలాడిస్తూనే ఉంది . అటు వంటి పాట ఇంతవరకు ఎవరూ పాడలేదు…….పాడలేరు.

ఆ పాట విని సి.నారాయణ రెడ్డి గారు “ అమ్మాయి నీ గొంతు సన్నాయి “ అని అభివర్ణించారు ట. ఈ పాట పాటలప్రపంచములో ఒక సుస్థిరస్థాన్నాన్ని ఏరపరచుకొని అభేరీ రాగానికే ‘ ఆభరణం ‘ అయ్యింది.

1970 – 80 ప్రాంతములో సినీ గీతాభిమానులు , సంగీత దర్శకులు పాటలలో కొత్త దన్నాన్ని ఆస్వాధించనారంభించారు . ఎక్కువ గా గాత్రము తో ,వాయిధ్యాలతో ప్రయోగాలు చేసి జనాలను మెప్పించడానికి కొత్తదన్నాని సృష్టించడనికి ఇష్టపడె వారు సంగీత దర్శకులు. ,ఆ సమయములో వచ్చినె పాటలు చాలా మటుకు జానకమ్మ గాత్రానికి సరిపోయేవి కావడం , ఎటువంటి ప్రయోగాలకైనా ఆవిడ గళము సరిపోవడముతో ఎక్కువ పాటలు ఆవిడనే వరించాయి.

ఆవిడ తెలుగు , తమిళ్ ,కన్నడా, మళయాళం , హింది , సింహలి ,జపనీస్ లో పదిహేను వేలకు పైగా పాటలు పాడారు. ఒకప్పుడు ఉత్తి శృంగార గీతాలకే పరిమితం అనుకునే ఆవిడ గాత్రము అన్నీ రకాల రసాలు పలికించగలదని నిరూపించుకున్నారు.

“వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెపుతాను “ , పత్ని ఎ గృహలక్ష్మి ఈ లే….“ అంటూ హాస్య గీతాలు. ఎన్నో పాడారు.

“ఎందుకో చేరువై దూరమౌతావు ( నీలి మేఘాలలో)….. ” ,
“నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు (కళ్ళలో ఉన్నదేదో కన్నుల కే తెలుసు )” …,

“పువ్వు రాలిన వేళ కళ్యాణము అందాక ఆరాటం ( మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం ) ” ఈ పాట కి ముందు ఆలాపన చెప్పనలవి కానిది. ,

“నాకు లేదు మమకారం మనసుపైన అధికారం …ఆశలు బాసిన వేసవిలో (వెన్నెల్లో గోదారి అందం )….

“మము గన్న మా యమ్మ అలివెలు మంగా (నడి రేయి ఏ జాములో ) …అంటూ అద్రతగా అనగలగడం … ..

మచ్చుక్కి ఇటువంటి పాటలు చాలవా గుండే భారమెక్కడానికి?

“అర్జున ఫల్గున పార్ధ కిరీటి బిరుగొన్న విజయ “( నరవరా ఓ కురువరా ) అనే మాటా ఒకే ఫేస్ లో పాడటం…. ,

వల్లభా ప్రియ వల్లభ లో “బుగ్గలకావిరి తగిలేలా సిగ్గులు ..విరిసేనా ” అంటూ అలలా పైకెగిరే స్థాయి…,

నను నీవు నిను నేను తనివితీరగ తలచుకొని (“కుశలమా ఎచనుంటివో ప్రియతమా ),

విహార వీణలు విందులు కాగా ..తనువు మనసు ఊలీ సోలి….అన్న తీరు (వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా ) , ( డా!! బాల మురళీ కృష్ణ తో హాయి గా సాగిన యుగల గీతము….)

“ఒకసారి కలలోకి రావయ్యా…”అంటూ వేడుకుంటోనట్లు పలికిన తీరు ,

తల్లి మల్లి తరుణైయిమంది …గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది (గాలికదుపులేదు )అంటూ గాలిలా అన్ని వైపులకూ సాగేపోతునట్లు ,

సన్నజాజీ పడకా…మాటవినకుందే ఎందుకే…..అంటూ సాగతీయడం

మదిలోని వాడు గదిలోకి వస్తే ….(మావయ్య వాస్తాడంట ) తుళ్ళుతూ సాగే పాట..

” ఓ వనె కాడ నిన్ను చూడ “(శ్రీ కృష్ణ పాడవీయం )( ఈ పాటలో ఒక్కొక్క చరణం ఒక్కొక్క బణిలో ఉంటుంది ) అంత వైవిధ్యమైన పాటలు పాడటము లో ఆమేకు ఆమే సాటి……. .

ఊలుకు పలుకు లేకుండా మనిషి ఏ మాత్రము కదలకుండా పాటకు ఏ భావము ఎంత వరకు కావాలో అందించగల నేర్పరి . మాటలతోటే కాకుండా నవ్వు ల తో కూడా ఎన్నెన్నో భావాలు ప్రకటించగల రాగమంజరి .

పాటలలోనే కాదు చిన్న నవ్వులో ఎన్నేన్నో భావాలు తెలపగల జాణతనం కలదు ఆ గళానికి.

“నవ్వు తో ముసి నవ్వు తో ” అన్నప్పుడు విసిరిన ఆ ‘ముసీ నవ్వు , వింతగా కవ్వింత గా అంటూ గిలిగింతలు పెట్టించేది గా …

“పక్కన నువ్వుంటే ప్రతి రాత్రి పున్నమిరా ” అంటూ సిగ్గు పడె నవ్వు వెన్నెల గొప్పించిన రేయి లా ….

“సిరి మల్లే పువ్వల్లే నవ్వు ” లోని నవ్వు సెలయేటి తరగలలాగా కదిలేది గా…

“ నవ్వింది మల్లె చెండు “ లోని నవ్వు పరవళ్ళు తొక్కుతున్న గోదారిలా ..

“రాగమో అనురాగమో “ లోని నవ్వు ఎగిరే కెరటం కొండను ఢీ కొట్టుకునట్లు గా..

“శివ శివ అనలేలరా “ లోని నవ్వు కోరెకలను నిద్రలేపేదిగా …

“ పరువమా చిలిపి పరుగు తీయకు “ లో నవ్వు తొలకరి ఝల్లులాగా…

“ఈ పగలు రేయి గా పండు వెన్నెల గా “ లోని నవ్వు చలి లో విరిసిన అరవిందము గా ..

“పంత చేల్లో పాలకంకి నవ్వింది “ లో నవ్వు కోనసీమ లోని పచ్చని చేలు లా..

“పూవులు పూయును పదివేలు “ లో నవ్వు కుప్పించిన జాణతనములా ….

“సిగ్గు పూబంతి “ లో నవ్వు సాగరము లో కలిసే కన్నే గోదారిలా గంభీరము గా ఉంటుంది.

ఆవిడ పాడిన ఎన్నో యుగల గీతాలు ప్రజాధరణ పొందాయి.ఆనాటి నుండి ఈ నాటి వరకు యువతరాని వేద మంత్రమయ్యాయి .

“ఊపిరి తగిలిన వేళ ….”అంటూ వెచ్చగా పలికిన తీరు (“వీణ వేణు వైన )..
అబ్బో నేరేడు పళ్లు లో “అబ్బో ” అన్న తీరు ,
వెచ్చ వెచ్చని నీ ఒడిలో ..లో “ నాకు నువ్వు నీకు నేనూ రోజు రోజు…” అన్న తీరు రేపంటి రూపం కంటి లో “ నేనోడి నీవే గెలిచి “ స్పురిస్తుంది .

శ్రీవారికి ప్రేమ లేఖ లో “ తొలిసారి మిమల్ని …లో ఎన్నో కలలు కన్న “కన్నె బంగారు “ ఆ మాట వింటే చాలు దేవులపల్లి వారి “ జాబిలి కూన “ గుర్తు రాక మానదు.

టిక్ టిక్ టిక్ గడియారం లో గోముగా పలికిన తీరు , ..
“ఎర్రాన్ని కుర్ర దాన్ని గోపాలా ” , “వద్దంటే వినడే పోకిరి ” , “ఆడదాని ఓరచూపుకే జగాన ఓడిపోని ధీరుడెవ్వడు “,

“సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట “( మౌనమేలనోయి ఈ మరపురాని రేయి)

“పట్టి తెచ్చనులే పండు వెన్నెలను నేనే “..అంటూ వెన్నెలలలు కురిపించే పాటలు… ఇలా ఎన్నో రకాల పాటలలో సరిలేరు ఆమెకెవ్వరూ…

ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడరు.

ఆవిడ పాటలలోనే కాదు మంచి మిమిక్రి ఆర్టిస్ట్ కూడా. గోవ్వుల్లు తెల్లనా గోపయ్య నల్లనా ( సప్తపది ) ,అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింకా (శ్రీవారి శొభనం ), చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య ( స్వాతి ముత్యం ) , పంటచేల్లో పాలకంకి నవ్వింది ( పదహారేళ్ల వయ్య్సూ ) ,గున్నమామిడి కొమ్మ మీద (బాలమిత్రుల కథ ) లో ఐదేళ్ల చిన్న పాపలాగా, అరవై ఏళ్ల ముసలామే లాగా పాడారు.

ఆవిడ పాటలు పాడడం లోనే కాదు పాటలకు సంగీతన్ని కూడా అందించగల విదుషీమణి. మౌనపోరాటం సినిమా ద్వారా ఆవిడ సినీ సంగీత దర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు.అటువంటి గాయనీ మణి, సంగీత దర్సకురాలు నాభూతో న భవిష్యతి !

చాలా కొద్దిమందికే తెలిసిన మరో విద్య కూడా కలదు ఆవిడలో …అవిడ మంచి చిత్రకారిణి కూడా.

ఆ తల్లి గురించి ఎంత చెప్పిన తక్కువే కానీ కొండత దేవుడి కి కొండత పత్రిని సమర్పించలేము కదా?

ఓక జాలరి సముద్రములోకి వెళ్లి తన అదృష్టము కొద్ది ఆణిముత్యాలు , రత్నాలు, వజ్రాలు తీసుకొని వస్తాడు ….ఎస్.జానకి అనే సంగీత సాగరములో నాకు దొరికినవి మాత్రము ఈ కొన్ని ఆణిముత్యలే మరి….

సోర్స్ : You are not allowed to view links. Register or Login to view.

అసలు కథ ఇదీ....!!

ఎంతో ప్రభావాత్మకమైన విషయాన్ని చక్కగా ప్రశ్నించిన రూపంలో తెలియజేసిన శ్రీయుతులు మాన్యులు చిలకపాటి శివరామ ప్రసాదు గార్కి మరియు గౌరవ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ఎంతో అద్భుతమైన ఈ ప్రపంచంలో అనుభవించని ఆస్తి చాలా ఉంది. 

నిరంతరం అందరికీ జ్ఞానామృతాన్ని పంచుతున్న పెద్దలందరికీ పేరుపేరునా నమస్కారాలు.

Quote this message in a replyReply

Post: #4

సుమణి వెంకట్ గారు

ప్రత్యేకత ఏమటనే ప్రశ్నకు సరైన జవాబివ్యటమే కాకుండా మధుర గాయకురాలు జానకి గారి గురించి సమగ్ర సమాచారం తొ చాటిచెప్పినందుకు ధన్యవాదములు.

రియల్లీ హాట్సాఫ్ సర్

Quote this message in a replyReply

Post: #5

వెంకట్ గారు,

Great Analysation.

హాట్సాప్

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)