Post: #1

హంసాసనము


హంసాసనముః


తలను నేలకు ఆనించి కాళ్ళను హంస తోకవలే పైకి లేపుట వలన హంసాసనమనిరి.

చేయు విధానముః


మెత్తని పక్కపై గొంతుగ కూర్చుని, మయూరాసనమునకు వలే రెండు అరచేతులు, వేళ్ళు వెడల్పు చేసి నేలకు ఆనించి రెండు మోచేతులను కలిపి నాభికి చేర్చి గాలిని బాగుగా పీల్చుకొని పొట్ట కండరములను బిగించి తలను ముందుకు వంచి రెండు కాళ్ళను నెమ్మదిగా వెనుకకు చాచవలెను. ఇప్పుడు ముఖమును నేలకు బలంగా ఆనించి రెండు కాళ్ళ కండరములను బిగించి కాళ్ళు రెండు పైకి ఎత్తి కొంచెము హంసతోక వలే వెడల్పు చేయవలెను. ఇప్పుడు నాడులను, కండరములను బాగుగా బిగించి వెన్నుపామును వెనుకకు వంచి శ్వాసలు బంధించి ఉండగల్గినంతసేపు నిలిపి నెమ్మదిగా దించి వేయవలెను. ఇది సాధకులు మయూరాసనమునకు ముందుగా అలవాటు చేసికొనినచో మయూరాసనము సులభసాధ్యము అగును.

ఫలితములుః


త్రిదోషములను హరించును. నాభి స్థానమును పీడించుటవలన మలశుద్ధి జరుగును. వాయువును కుంభించుటవలన శ్వాస మండలము, రక్త ప్రసరణ మండలము, వెన్నుపాము బిగించుటవలన నాడీ మండలము బాగుగా బలపడును.

***ముఖ్య గమనికః స్త్రీలు ఈ ఆసనము వేయరాదు. గర్భసంచి జారిపోయే ప్రమాదము ఉంది.***


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)