Post: #1

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

* హరిహరాత్మజం.. విశ్వమోహనం.. !

ayyappa

హిందువులు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే కార్తీకమాసానికి ఓ ప్రత్యేకత ఉంది. అదే హరిహరసుతుడు అయ్యప్ప మాలధారణ. నిష్టతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం (41 రోజులు) పాటు స్వామి దీక్షలో ఉండి శబరిమల యాత్ర చేసి జ్యోతి స్వరూపుడైన అయ్యప్పను దర్శించుకుంటే పాపాలు హరించుకుపోతాయనేది భక్తుల నమ్మకం. కార్తీకమాసం నుంచి పుష్యమాసం వరకు ఎక్కడ చూసినా అయ్యప్పస్వాములు కనిపిస్తారు. పెద్దా, చిన్నా, కులం, మతం, బీద, గొప్ప, నాదీ, నీది అనే భేదభావాలతో నిండిన సమాజానికి అంతా ఒక్కటే అని చాటేవారు సైతం భగవత్‌స్వరూపులే. కర్మ ఫలితాన్ని హరించేది స్వామి సన్నిధానమే అని చెబుతోంది అయ్యప్పదీక్ష. రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో ఇప్పటికే అయ్యప్పదీక్ష మొదలైంది. చాలామంది ఇప్పటికే శమరిమల ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రైళ్లలో, బస్సుల్లో, సొంత వాహనాలతో పాటు విమానాల్లో వెళ్లే వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయ్యప్పదీక్షపై ఈ వారం ‘కవర్‌స్టోరీ’ కధనం మీ కోసం అయ్యప్ప నామస్మరణ వింటే హృదయం పులకరిస్తుంది. స్వామీ శరణం అయ్య ప్పా అంటూ చేసే భజన ఆసాంతం వినాలనిపిస్తుంది. ధన్యోహం ఓ శబ రీశా... నీ దరిచేరితి పందళవాసా అంటూ ఎన్నో గీతాలు ఇప్పటికీ భక్తులను మైమరిపిస్తాయి.

చరిత్ర ఇదీ...

కేరళ రాష్ట్రంలో పంపానదీ తీరాన సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో (సన్ని ధానం) అయ్యప్పస్వామి దేవాలయం కొలువుతీరి ఉంది. నవంబర్‌ 16నుంచి డిసెం బర్‌ 27 వరకు 41రోజులు (మండలం), జనవరి 1నుంచి 20వ తేదీ వరకు మక రజ్యోతి (మకరవిళక్కు) సందర్భంగా తెరచి ఉంచుతారు. ఈ రోజుల్లో కాకుండా ప్రతినెలా సుమారు ఐదురోజులు (మాసపూజ) ఆలయం తెరచి ఉంటుంది. ఏప్రిల్‌ మాసంలో ‘విషు’కుగాను పదిరోజులపాటు ఆలయం తెరుస్తారు. కొట్టాయం రైల్వే స్టేషన్‌నుంచి పంపానదికి సుమారు 122 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇందు కోసం దేవస్థానం బోర్డు నిర్వహణ అధికారులు భక్తుల సౌకర్యార్ధం బస్సులు, వస తి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. సన్నిధానంలో పిలిగ్రిమ్‌ సెంటర్‌, మరా మ్మతు కాంప్లెక్స్‌, మాళిగాపురం బిల్డింగ్‌, డోసర్‌ హౌస్‌, శబరి నివాస్‌, సుబ్రమణ్యం కాటేజీ వంటి వసతులే కాకుండా విశ్వహిందూ పరిషత్‌, అఖిలభారత అయ్యప్ప సేవా సమాజం వంటి సంస్థలు తాగునీరు, స్నాన సౌకర్యాలు, అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

కీలకమైన కరిమలై...

pamba1

ఈ యాత్రలో అత్యంత కీలకమైంది కరిమలై. కరిమలై అంటే ఏనుగు పర్వతం అ ని అర్ధం. దీనిని ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. చెట్లవేర్లు, చిన్న చిన్న గుండ్రటి రాళ్లు, మధ్యలో ప్రవహించే వాగు నీటికి తడిసి దిగుతున్నపుడు జా రిపోతూ స్వాములు ఒకరినొకరు చేతులు పట్టుకుని అనేక కష్టాలకు గురై దిగుతుం టారు. స్వాములు చేసే ఐక్య శరణ ఘోష మనసును రంజింపచేస్తుంది. ఈ కరిమ ల కోటలో ఒక్కొక్క దేవత ఉందని ప్రతీతి. ఆయ దేవతల ప్రీతి కోసం ‘భగవానే.. భగవతియే..’ అన్న నామస్మరణతో పాదయాత్రను సాగిస్తారు.

పరశురామ క్షేత్రం...

SabarimalaTemple

శబరిమలలో శ్రీ ధర్మశాస్త్ర ఆలయాన్ని, పదునెట్టాంబడిని పరశురాముడు మొదట నిర్మించి స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు, శ్రీ ధర్మశాస్తగ్రా స్వామివారు చాలా కాలం పూజలు అందుకున్నట్లు ప్రచారంలో ఉంది. తరువాత కొన్ని వందల సంవ త్సరాలు గడిచాక ఉదయ న్‌, ముండన్‌ అనే దొంగ ల నాయకులు శబరిమలై ప్రధాన పూజారిని, కొంద రు భక్తులను నిర్దాక్షిణ్యం గా దేవాలయ సమీపంలో చంపి దోచుకుపోయిన ట్లు చెబుతారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలపాటు శబరిగిరి నాధునికి పూజా పునస్కారాలు లేక దేవాలయం మరుగునపడి పాడుబడింది. మళ్లీ పందళరాజు కాలంలో శ్రీ ధర్మశాస్త పంబాతీరా, మణికంఠునిగా అవతరించి తరువాత అయ్య ప్పగా పిలవబడి పందళరాజు వద్ద పన్నెండు సంవత్సరాలు ముద్దుబిడ్డగా పెరిగి మహషి సంహానంతరం అవతారం చాలించి మళ్లీ శబరిమల కొండపై అయ్యప్పగా వెలిశాడని, అప్పుడే పందళరాజు కాలంలో దేవాలయ పునరుద్ధరణ జరిగిందని చె బుతారు. అప్పటినుంచి అయ్యప్పస్వామిని కలియుగదైవంగా నమ్మి 41రోజుల కఠోర ధీక్షతో భక్తులు అయ్యప్పను పూజిస్తున్నారని ప్రతీతి. అన్ని దేవాయలాల్లో ముఖమండపం ఉంటుంది కానీ స్వామి వారి దేవాలయానికి ముఖ మండపం లేదు.

పదునెట్టాంబడి...

pamba1

శబరిమలై సన్నిధానంలో ఉండే పవిత్రమైన 18మెట్లనే పదునెట్టాంబడి అని వ్యవ హరిస్తారు. ఈ మెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనలో ఉన్న ఐదు జ్ఞానేంద్రి యాలు, మనస్సు, బుద్ధి అనే 17 విషయాలచేత మానవునికి స్థూల, సూక్ష్మ శరీరా లు ఏర్పడతాయి. 18వ సోనానంకారణ శరీరమై ఉంది. ఇవీన్న ఒకే మాయస్వరూ పమై ఉన్నందున పరస్పరం ముడిపడి ఉన్నాయి. అయ్యప్పదేవాలయానికి అమర్చి న 18 మెట్లు ఒకే రాతిలో ఉండడంలోని అంతరార్ధం ఇదే. 41 రోజులు దీక్షచేసి ఇరుముడి కట్టుకుని వచ్చిన వారికే వీటిపై నుంచి ఎక్కి స్వామి వారిని దర్శించుకునే అర్హత ఉంది. లేని పక్షంలో పక్కమెట్లగుండా ఎక్కి స్వామి వారిని చూడా ల్సిందే. శబరిమలలో 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించడానికే ఈ దీక్షా వ్రతం. శ్రీ మణికంఠ స్వామి అవతారం చాలించే ముందు శబరిమల ఎక్కడానికి అష్టాదశ దేవతలు మెట్లువలె అడ్డంగా పడుకుని ఉంటే వారిని దాటుకుంటూ స్వామివారు కొండ ఎక్కి అక్కడ పట్టుబంధాసనములో కూర్చుని చిన్ముద్ర, అభయ హస్తములతో వారికి దర్శనమి చ్చి జ్యోతిరూపంలో అంతరార్ధమైనట్లు చెబుతారు. తరువాత ఈ 18మెట్లను పర శురాముడు నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది.

తిరువాభరణం...

తిరువాభరణములు అయ్యప్పస్వామివారు అవతారంలో స్వయంగా అలంకరిం చుకున్న ఆభరణాలని అంటారు. అందుకే ఆ ఆభరణాలకు అంత ప్రాధాన్యత ఉం ది. ఈ ఆభరణాలు పందళరాజు వద్ద భద్రపరిచారు. ప్రతి సంవత్సరం ఈ ఆభరణా లు మూడు చెక్కపెట్టలతో పందళం నుంచి శబరిమలకు మోసుకుని తీసుకువస్తా రు. పందళంలో వంశపారంపర్యంగా తిరువాభరణములు మోయడానికి ఓ కు టుంబం ఉంది. గరుడ పక్షులు వచ్చి తిరువాభరణములపై ప్రదక్షిణం చేసిన తరు వాత శబరిమలకు బయలుదేరుతాయి. ఆరెండు గరుడ పక్షులు తిరువాభరణము లతో పాటు శరంగుత్తి వరకు వచ్చి శబరిమలపై మూడు ప్రదక్షిణాలు చేసి తిరిగి వెళతాయి. తిరువాభరణాలను శబరిగిరినాధునికి జనవరి 14నుంచి 20వ తేదీ వరకు అలంకరిస్తారు. జనవరి 20వ తేదీ దేవాలయంలో భక్తులు అంతా వెళ్లిపో యాక తిరువాభరణాలు స్వామివారి నుంచి తొలగించి మేల్‌శాంతి స్వామివారి వి గ్రహం చేతిలో విల్లు, బాణాలు అమర్చి నీలిరంగు వెల్‌వెట్‌ బట్ట తలకు చుట్టి పూజారి గుడికి తాళం వేస్తారు.

మకరజ్యోతి...

అయ్యప్పస్వామి అవతారం చాలించి శబరిమలకు తపస్సు కు వెళ్లేముందు పందళరాజు విలపిస్తూ ఉంటే ‘నాగురించి తపనతో ఎవరైతే కనీసంత మండలకాలం నియమాలు తప్పకుండా దీక్షచేసి భక్తితో శబరిగిరికి నన్ను దర్శించడానికి వస్తారో వారందరికీ జ్యోతి రూపంలో మకర సంక్రాతినాడు దర్శనమిస్తా’నని అయ్యప్పస్వామి వాగ్థానం చేసిట్లు పురాణా ల్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటికీ శ్రద్ధాభక్తులతో నియమా లు పాటించి దీక్ష చేసిన వారందరికీ శబరిమలైలో జ్యోతి దర్శనం కావడం విశేషం.

ఎరిమేలి నుంచి సన్నిధానం వరకు...

శబరిమలై వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. ఎరిమే లి నుంచి సన్నిధానం వరకు సుమారు 70కిలోమీటర్లు, వం డి పెరియార్‌ నుంచి సన్నిధానం వరకు 20 కిలోమీటర్లు, పంపానది నుంచి సన్నిధానం వరకు ఏడు కిలోమీటర్లు వెళి తే శబరిమలై చేరుకోవచ్చు. ఎరిమేలి నుంచి శబరిమల చేరే మార్గమధ్యంలో కొట్టాయం రైల్వేస్టేషన్‌ నుంచి ఎరిమేలి సుమారు 52 కిలోమీటర్లు ఉంటుంది. ఎరిమేలి అన్నపదం ‘ఎరుమకొల్లి’ అనే పదం నుంచి వచ్చింది. ఎరుమకొల్లి అం టే దున్నపోతును చంపిన స్థలం అని అర్థం. మృత్యువుకు అధిపతి అయిన యమ దర్మరాజు వాహనం దున్నపోతు. మృత్యువు అంటే ‘అజ్ఞానరూపం’, దున్నపోతును వధించుట అంటే తమోగుణాన్ని అంతమొందించడం అని అర్థం.

దీక్షబూని ఆద్యా త్మిక మార్గంలో నడుచుకున్న అయ్యప్ప భక్తులు ఎరిమేలి వద్ద తమ తపస్సును అం తం చేసుకున్నారని భావం. ముస్లిం యోధాగ్రేసరుడైన రాజు ‘వావర్‌’ అయ్యప్పకు ప్రధాన అనుచరుడుగా ఉండి పందళ రాజ్యాన్ని కాపాడుతూ ఉండేవాడు. అక్కడ వావరు స్వామి మసీదు ఉంది. శబరిగిరి చేరు భక్తులు మొట్టమొదటిసారిగా ఇక్కడ మకాం చేసి తమ యాత్రను కొనసాగిస్తారు. అయ్యప్ప విల్లంబులు ధరించి వేటకా డులా నిల్చిన విగ్రహం ఉన్న దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని ‘ఎరిమేలి ధర్మ శాస్త’ దేవాలయం అంటారు. అడవి మార్గానపోయే భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి యాత్ర సాగిస్తారు. అక్కడి నుంచి స్వాముల పెద్దపాదం యాత్ర ప్రారంభమ వుతుంది.

పేటకళము...

శాస్తా ఆలయం నుంచి సుమారు అరమైలు దక్షిణ తూర్పున ఎరుమేలి పేటకళము ఉంది. హిందూ, ముస్లింలు కలిసి సోదరభావంతో మెలగడాన్ని ఇక్కడ చూడవచ్చు. శబరిగిరి యాత్రకు ఇక్కడనుంచి చాలామంది ముస్లిం సోదరులు కూడా ఇరుముడి తీసుకుని సన్నిధానం చేరడం విశేషం. ఎరుమేలిలో ‘పేట’ ఆడుల శబరియాత్రలో ఒక ముఖ్యాంశం. కన్నెస్వాములు అడవి మనిషిలా వేషం ధరించి, రంగులు పూసుకుని, ఆకులు, కొమ్మలు చుట్టుకుని చేతిలో ‘శరం’ (బాణంపుల్ల)తో, మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో ‘స్వామి చిందగతోం..అయ్యప్ప చిందగతోం..’ అనే చిందులతో నాట్యం చేస్తూ ఎంతో ఉత్సాహంగా వావారు స్వామి ఆలయం, ధర్మశాస్త ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ప్రదక్షిణం తరువాత ఆలయానికి వెనక ఉన్న స్నానఘట్టాల్లో స్నానం చేస్తారు.

పేరూర్‌తొడు...

ఎరిమేలినుంచి బయలుదేరిన రెండు మైళ్ల దూరంలో వచ్చే ప్రదేశం. ఎరిమేలి గ్రామానికి అడవికి మధ్యన కాలువ వస్తుంది. ఈ కాలువ దాటితే కోట్టైపడి అనే ప్రదేశం వస్తుంది. ఎరుమేలి, పెరునాట్టు, వండి పెరియార్‌అనే మూడు శాస్తా ఆల యాలకు మధ్య ఉండే వనాన్ని అయ్యప్పస్వామి నందనవనం అంటారు.

శబరిగిరి శబరిపీఠం...

గిరిజనస్ర్తీ అయిన శబరి మాతంగ మహాముని యొక్క శిష్యురాలు. శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ లక్ష్మణుడితో కలిసి శబరి ఆశ్రమానికి వచ్చి ఆమె ఆతిధ్యాన్ని స్వీకరిస్తాడు. ఇక్కడ ఒక విద్యాపీఠం ఉన్నట్లుగా పందళ రాజవంశీయులు వివాహా దికార్యక్రమాలకు, విద్యను అభ్యసించేందుకు ఇక్కడకు వచ్చి ఉండేవారని చారిత్రక పరిశోధకులు అంటారు.

శరంగుత్తియాల్‌...

శబరిపీఠం నుంచి సన్నిధానం వరకు రెండు మార్గాలున్నాయి. ఇవి రెండుగా విభ జించే స్థలం చేరిన తరువాత ఎదురయ్యే భక్తులను శరం గుత్తియాల్‌ ఎక్కడున్నదీ తెలుసుకుని భక్తులు (కన్నెస్వాములు) తమ వద్ద ఉన్న శరములను గుచ్చాలి. శరం కుత్తి ఆల్‌ అంటే శరీరం విడిచిన చెట్టు అని భావం. ఇక్కడ అశ్వత్ధ వృక్షముంది (రావిచెట్టు) దానివద్ద భక్తులు ఎరిమేలి నుంచి తెచ్చిన బాణాన్ని విడిచిపెడతారు. అశ్వత్ధమంటే స్థిరత్వంలేని సంసారం అని అర్థం.

గణపతి హోమగుండం...

నెయ్యి టెంకాయలను పగులగొట్టిన కొబ్బరి చిప్పలను ఈ హోమగుండంలో వేసి నమస్కరిస్తారు. మండలం రోజులు ఈ హోమగుండం కేవలం కొబ్బరి చిప్పలతో వెలుగొందుతూ ఉంటుంది. ఇటువంటి హోమగుండం వేరే ఏ ఆలయం లోనూ లేదని చెప్పవచ్చు.

మాళిగై పురుత్తమ మంజమాత...

సన్నిధానానికి పడమటి వైపు ఉన్న అమ్మవారి దేవాల యం మాళిగై పురుత్తమ మంజమాత, శాపవిముక్తి పొందిన మహిషి దివ్యసుందరిగా, అమ్మవారిగా పూజలందుకుంటుంది. ఇరుముడిలో తీసుకు పోయిన రవిక బట్టలు, పసుపు, కుంకుమ లతో అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ దగ్గరలోనే ‘మలైనడై’ భగవతి దేవాల యం కూడా ఉంది.

పంపానది-పంపా గణపతి...

దక్షిణ భారత గంగానదిగా పేరు పొందింది. ఇక్కడే పందళ రా జుకు మణికంఠుడు దొరి కింది. పాదయాత్రలో అల సిపోయిన భక్తులు ఈ పవిత్రనదిలో స్నానం చేసి ఈ నదీతీరంలో వంట చేసుకుని ఇరుముడిని అయ్య ప్పగా భావించి పూజలు చేస్తారు. తరువాత పంపాగణపతిని భక్తులు దర్శించి కొబ్బరికాయలు కొట్టి సన్నిధానంవైపు ప్రయా ణం సాగిస్తారు. కన్నెస్వాములు 108 పొయ్యిల నుంచి బూ డిద సేకరించి వస్తక్రాయం బట్టి గురుస్వామికిస్తారు. గురు స్వామి ఈ బూడిదను అయ్యప్పను అభిషేకించిన భస్మాన్ని కలిపి సన్నిధానంలో శిష్యులకు ప్రసాదంగా ఇస్తారు. అనేక పుల్లలు, వేర్లతో కాలిన ఈ భస్మ సర్వరోగ నివారి ణిగా ఉపయోగిస్తారు. ఈ పంపానదిలో సాయం సంధ్యా సమయంలో వెదురుతో చేసిన ‘తేరు’ను పా లతో అలంకరించి నదిలో వదులుతారు. ఈ దృశ్యం లక్షలాదిమంది భక్తులకు ఆనందాన్ని కలుగచేసి ‘పంబా విళక్కే శరణం అయ్యప్ప’ అని శరణుఘోష చేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 14న మకరసంక్రాతి నాడు ‘కాంతి మలై’ నుండి జ్యోతి దర్శనం కలుగుతుంది.

స్వాములు... నలుపు, నీలం, కాషాయం వస్త్రాలను ధరించవచ్చు. ఈ వస్త్రాలు అయ్యప్ప దీక్షలో సీనియారిటీకి గుర్తింపుగా ఉండే సంకేతాలు. సంవత్సరం వారీగా దీక్షమాల ధరించిన స్వాములను ఇలా పిలుస్తారు.

1వ సంవత్సరం - కన్నెస్వామి
2వ సంవత్సరం - కత్తిస్వామి
3వ సంవత్సరం - గంటస్వామి
4వ సంవత్సరం - గదస్వామి
5వ సంవత్సరం-గురుస్వామి
6వసంవత్సరం-జ్యోతిస్వామి
7వసంవత్సరం-సూర్యస్వామి
8వ సంవత్సరం-చంద్రస్వామి
9వ సంవత్సరం -త్రిశూలస్వామి
10వ సంవత్సరం-శంఖుచక్రస్వామి
11వ సంవత్సరం - శంఖుచక్రస్వామి
12వ సంవత్సరం - నాగాభరణ స్వామి
13వ సంవత్సరం - శ్రీహరిస్వామి
14వ సంవత్సరం - పద్మస్వామి
15వ సంవత్సరం - శ్రీ స్వామి
16వ సంవత్సరం - శబరిగిరి స్వామి
17వ సంవత్సరం - ఓంకార స్వామి
18వ సంవత్సరం - నారికేళస్వామి

పద్దెనిమిదవ సంవత్సరం కొబ్బరిచెట్టును శబరిమలకు తీసుకువెళ్ళడం ఆనవాయితీ

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

* ఈ కథనం ఓ దినపత్రిక నుండి సేకరించబడినది .
ఆసక్తి ఉన్న మిత్రులు మరికొన్ని వివరాలని You are not allowed to view links. Register or Login to view.లో చూడవచ్చును .

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)