Post: #1


హస్త ముద్రలు మెదడును ఉత్తేజపర్చే జ్ఞానముద్ర

rhastamudra1


హస్తముద్రల్లో కీలక పాత్ర పోషించేవి చేతివేళ్లు. బొటనవేలు అగ్నికి, చూపుడు వేలు వాయువు, మధ్యవేలు ఆకాశానికి, ఉంగరపు వేలు పృథ్వికి, చిటికెన వేలు జలానికి గుర్తులని ఇంతకు ముందు చెప్పుకున్నాం. పై వేళ్లలో బొటనవేలు అతిప్రధానమైనది. ఈ వేలు ఇతర వేళ్లను నియంత్రిస్తుంది. అదే విధంగా పంచ భూతాల్లో అగ్ని కీలకమైనది. ఇది మిగిలిన నాలుగు భూతాలను నియంత్రిస్తుంది.

ముద్ర థెరపీ, ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం ఏదైన ఒక వేలి చివరి భాగాన్ని బొటనవేలి చివరి భాగానికి కలిపినట్లయితే, ఆ వేలిలో ఉండే ఎలిమెంట్‌ (భూతం) ప్రభావం పెరుగుతుంది. ఉదాహరణకు చూపుడు వేలి కొనను బొటన వేలి చివరిభాగానికి కలిపినట్లయితే (జ్ఞాన ముద్ర ఏర్పడుతుంది) వాయువు అధికమవుతుంది. అదే విధంగా అదే వేలి కొనను తీసుకువచ్చి బొటన వేలి కింది భాగంతో (ఆధారం లేదా బేస్&zwnjWink కలిపినట్లయితే, శరీరంలో వాయువు తగ్గుతుంది. ముద్ర వేసినప్పుడు ఒక ఎలిమెంట్‌లో మార్పు (పెరగటం లేదా తగ్గడం) వెంటనే కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో సుమారు 45 నిమిషాలు కూడా పడుతుంది. ఉదాహరణకు చెవిలో నెప్పి తీవ్రంగా ఉన్నవారికి శూన్య ముద్ర వేసినట్లయితే, వెంటనే ఉపశమనం కనిపిస్తుంది. అదే విధంగా గుండె జబ్బు వల్ల ఏర్పడిన తీవ్రమైన ఛాతీ నెప్పి నివారణకు అపాన్‌-వాయు ముద్ర సాయపడుతుంది.

ఒక ముద్రను వేసే సమయంలో ఇతర వేళ్ల స్థితి ఎలా ఉన్నా, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు రెండుచేతుతో ముద్రలు వేయడం మంచిది. ముద్రలు ఎప్పుడైనా, ఎక్కడైనా వేయవచ్చు. ఉద యం పేపర్‌ చూస్తున్నప్పుడు, ఆఫీసుకు పోతున్నప్పుడు, సంగీతం వింటూనో వేయవచ్చు. అయితే, ధ్యానంతో పాటు వీటిని వేసినట్లయితే, అద్భుత ఫలితాలను సాధించవచ్చు. శరీరం ఏ స్థితిలో ఉన్నాగానీ ముద్రలను వేయవచ్చు.

mudra


రబ్బ రు బ్యాండ్‌, టేప్‌లను ముద్రలో వేళ్లను కలిపేందుకు వాడవచ్చు. అపాన్‌-వాయు ముద్రలు లాంటివి కొన్ని తప్ప మిగిలిన ముద్రలన్నింటినీ కనీసం ప్రతి రోజు 45 నిమిషాల సేపు వేయాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని మూడు సమ భాగాలుగా విభజించి, ముద్రలను ఉదయం 15 నిమిషాల సేపు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు వేయవచ్చు. మంచి ఫలితాలు రావాలంటే, కనీ సం 15 రోజుల పాటు వేయాల్సి ఉంటుంది. నిజానికి వ్యాధిని నిర్మూలించేవరకు వీటిని అభ్యాసం చేయాల్సి ఉంటుంది.

ఏదైనా ఒక వ్యా దిని వారణకు ముద్ర థెరపీతో పాటు సరైన పోషకాహారం తీసుకుంటే మరిం త ప్రయోజనం ఉంటుం ది. వాత, పిత్త, కఫాలకు సంబం దించి వాటికి అనువైన డైట్‌ను తీసుకోవాల్సి ఉం టుంది. ఒక వైపు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ, మరో వైపు ము ద్ర థెరపీను అనుసరించవచ్చు. ఈ థెరపీని ప్రారంభించినప్పుడు, గతంలో వాడుతున్న మం దులను నిలిపివేూల్సిన అవసరం లేదు.

hastamudra


ముద్రలు పలు రకాలు. వాటిలో ప్రధానమైనవి:

జ్ఞాన ముద్ర, వాయు ముద్ర, ఆకాశ ముద్ర, శూన్య ముద్ర, పృథ్వి ముద్ర, సూర్య ముద్ర, వరుణ ముద్ర, సమాన్‌ ముద్ర, సురభి ముద్ర, అపాన్‌ ముద్ర, అపాన్‌-వాయు ముద్ర, లింగ ముద్ర, శంఖ ముద్ర, ఆస్త్మా ముద్ర, మాతంగి ముద్ర, ఉత్తర బోధి ముద్ర, పుషాన్‌ ముద్ర, హృదయ ముద్ర తదితర హస్త ముద్రలు ప్రధానమైనవి. చేతులతో కాకుండా, శరీరంలోని ఇతర అవయవాలతో కూడా ముద్రలను వేయవచ్చు. వీటిల్లో ప్రధానమైనవి శాంభవి ముద్ర, ఖేచరి ముద్ర, షణ్ముకముద్ర, వజ్రోలి ముద్ర, సహజోలి ముద్ర, యోగముద్రలు ప్రధానమైనవి. ఇప్పుడు వీటిల్లో అతిప్రధాన ముద్రల్లో జ్ఞాన ముద్ర గురించి తెలుసుకుందాం.

జ్ఞాన ముద్ర :
జ్ఞాన ముద్ర వలన శరీరంలో వాయు శక్తి పెరుగుతుంది. ఈ ముద్రలో బొటన వేలు, చూపుడు వేళ్ల చివరి భాగాలను కలిపి ఉంచాలి.

ఫలితాలు:
ఈ ముద్ర వలన శరీరంలో వాయు శక్తి పెరుగుతుంది. మెదడుకు వాయువు అనంతమైన శక్తిని ఇస్తుంది. ఆలోచనలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. జ్ఞానోదయం దిశగా మనస్సు, శరీరాన్ని తీసుకుని పోతుంది. మెదడుతో పాటు నాడీ వ్యవస్థ ఉత్తేజిత మవుతుంది. నాడుల గుండా విద్యుత్‌ తరంగాల చలనాలకు దోహదపడుతుంది. గొంతు కండరాలు బలపడతాయి. గుండెకు తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలవుతుంది. జలుబును కలిగించే మ్యూకస్‌ పొరలు పొడిగా తయారవుతాయి. వాతం లోప నివారణకు ఈ ముద్ర వేయాల్సి ఉంటుంది.

జ్ఞాన ముద్ర వల్ల పలు లాభాలు ఉన్నాయి. బద్దంగా ఉండేవారు, ఎటువంటి ఉత్సాహం, సృజనాత్మకత లేనివారు, నిర్లక్ష్యంగా ఉండేవారు, జ్ఞాపక శక్తి తగ్గినవారు, మెదడు సరిగా వృద్ధి చెందనివారు ఈ ముద్రను అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన పలు రుగ్మతలు తగ్గుతాయి. కంటి చూపుకు ప్రధానమైన రెటీనా ఉత్తేజితమవుతుంది. హార్మోన్‌లకు సంబంధించి రుగ్మతలు, హైపోథైరాయిడిజమ్‌, హైపోపారాథైరాయిడిజమ్‌, డయాబిటీస్‌ తదితర వాటిని నియంత్రించవచ్చు. కండరాల రుగ్మతలు కూడా తగ్గుతాయి. కీళ్ల జాయింట్లకు మంచి శక్తి లభిస్తుంది.

జ్ఞానముద్రలో పలు రకాలు:
వైరాగ్య ముద్ర, పూర్ణముద్ర, అభయ ముద్ర, ధ్యాన ముద్రలు
ఈ ముద్రలను పద్మాసనం వేసి చేయాల్సి ఉంటుంది. చేతులను మొకాళ్లపై ఉంచి వేసిన జ్ఞాన ముద్రను వైరాగ్య ముద్ర అంటారు. దీని వల్ల భౌతిక వస్తువుల పట్ల వ్యామోహం తగ్గుతుంది. ఎడమ చేతిని ఎడమ మొకాలుపై ఉంచి కుడి చేతిని ఛాతి వరకు పైకిలేపి చేసిన జ్ఞాన ముద్ర పూర్ణ ముద్ర అవుతుంది. దీని వలన సంపూర్ణ జ్ఞాన సిద్ధి లభిస్తుంది. రెండు చేతులను భుజాల వరకు తీసుకువచ్చి వేసిన జ్ఞాన ముద్రను అభయ ముద్ర అని అంటారు. ఎడమ చేతిలో కుడిచేయి ఉంచి వేసిన జ్ఞాన ముద్రను ధ్యాన ముద్ర అంటారు. దీని వల్ల ధ్యానంలో మంచి ప్రగతి సాధించవచ్చు.

సోర్స్ :  మిత్రుడు పంపిన అటాచ్ మెంట్ (ఓ దినపత్రికలోని సమాచారమిది) .  ధన్యవాదాలు మిత్రులారా...!!


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)