Post: #1

జ్ఞాన ప్రదాయిని.. బాసర వాసిని

saraswathi

‘‘సరస్వతీ నమస్తుబ్యం.. వందే..’’ గోదావరి నదీతీరాన బాసర కొలువున ఉన్న జ్ఞానసరస్వతీ దేవి కోట్లాది చిన్నారులకు చదువులు ప్రసాదించి అశేష భక్త జనానికి మనశ్శాంతిని ప్రసాదిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో కొలువుదీరిన చదువుల తల్లి సరస్వతీ దేవి ఆలయం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిరోజు వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం, తమ చిన్నారులను అక్షరాభ్యాసం చేయించుకోవడం కోసం బాసరకు వస్తుండటంతో బాసర సరస్వతీ దేవి ఆలయం భక్తజన సందడితో కిటకిటలాడుతోంది.

దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ ఆలయం అయి న దేవాలయమైన జ్ఞాన సరస్వతి ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శక్తిమూర్తులు సరస్వతీ, లక్ష్మీ, పార్వతీలు ఒకేచోట కొలువైన క్షేత్రం బాస ర కావడం మరింత విశేషం. అమ్మవారికి ప్రతిరోజు ఉద యం 4 గంటల నుంచి 6 గంటల వరకు అర్చకులచేత అభిషేకాన్ని నిర్వహించిన అనంతరం హారతి ఇచ్చిన తరు వాత సందర్శకులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7-30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్షరాభ్యాసం, కుంకుమపూజ, వాహనపూజ, ఓడిబియ్యం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.గంట విరామం తరు వాత గుడి మళ్లీ తెరుచుకొని దైనందిన కార్యక్రమాలు కొన సాగిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తజనం అమ్మవారిని దర్శించుకొని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకొని మనశ్శాంతిని పొందుతారు.

ఆలయ చరిత్ర...
గోదావరి ప్రవహిస్తున్న ఈపుణ్యభూమి వ్యాసమహర్షి పాద స్పర్శతో పుణీతమైంది. వ్యాసమహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడాని కి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు పురాణాలు చెబు తున్నాయి. బ్రహ్మా ండ పురాణాన్ని రచి స్తున్నప్పుడు ప్రకృ తి ఖండంలోని శక్తి ని వర్ణించాల్సిన అవసరం ఏర్ప డిం ది. శక్తిని వర్ణించాలంటే మరింత తప శ్శక్తితోపాటు ఎలాం టి అంతరాయం లేని మహిమగల ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరి గి బాసర చేరుకున్నాడు. నాందేడ్‌ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదావరి నాభిస్థానం అంటారు. బ్రహ్మేశ్వరం లోకే శ్వరం మండలం కనకాపూర్‌ సమీపంలో ఉంది.

ఇది అప్ప టికే పుణ్యస్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడా నికి ఆగాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయ నకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయ మైంది. దీంతో ఆ రూపం ఎవరిదా? అని దివ్యదృష్టితో చూడగా జ్ఞానసరస్వతి అమ్మ వారు కనిపించగా పూర్తి రూపం కనిపించకపోవడానికి కారణం అడిగారు. కొన్ని పాపకార్యాల వల్ల తన పూర్తి రూ పాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు ఆ రుషితో చెప్పింది. ప్రతిరోజు ధ్యానం చేసి గోదావరిలో పిడికెడు ఇసుకను నిచ్చన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుక తో తన పూర్తి రూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతీగా అందరికి దర్శనమిస్తానని పేర్కొంది.

saraswathi1

వ్యాసుడు గోదావరి తీరానికి కొంతదూరంలో ఉన్న కుమారచర పర్వతంలోని ఒక గుహలోకి తపస్సు ప్రారంభించాడు. అమ్మవారు చెప్పినట్టు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించా రు. ఇలా కొన్ని ఏళ్లు గడిచిన అనంతరం అమ్మవారు రూపం పూర్తి కావడం, ఆమె జ్ఞాన సరస్వతిగా ఆవిర్భవిం చిందని పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతి దేవి ఆయనకు జ్ఞానభీజాన్ని ఉపదేశించింది. జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందు తోంది. భారతదేశంలో కన్యాకుమారిలో, కాశ్మీర్‌లలో సరస్వతీ దేవాలయాలు ఉన్నప్పటికీ చదువుల తల్లి జ్ఞానస రస్వతీ బాసరలోనిది మాత్రమేనని, దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. అయితే ఒక సరస్వతీ దేవినే ప్రతిష్టిం చడం సబబు కాదని, ఈమెకు తోడుగా మరో మహాకాళీ, మహాలక్ష్మీలను ప్రతిష్టించాడు.

మహిమాన్విత రూపిణి...
పుత్రసంతానం కోసం దశ రథుడు ఇక్కడ పూజలు చేశా డు. ఎనిమిది మంది దేవతలు కోనేరులోని వివిధ ప్రాంతా ల్లో స్నానాలు చేయడంతో దీనికి అష్టతీర్థసరోవరమని పేరు వచ్చింది. ఒకసారి దుర్వాస మహముని సరస్వతీ దేవి ఇచ్చి న పుష్పమూలికను ధరించి స్వర్గలోకానికి వెళ్లి దాన్ని ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని నేలపై పడవేయడం తో దుర్వాసుడు కోపంతో ఇంద్రున్ని రాజ్యభ్రష్టునిగా చేసి కుష్టువ్యాధిగ్రస్తుడు కావాలని శపిస్తాడు.

temple

ఇంద్రుడు బృహ స్పతి మాట ప్రకారం కోనేరులోని తూర్పు భాగంలో స్నా నం చేసి శాపవిమోచనం పొందాడు. దీని కారణంగా ఆ స్థానానికి ఇంద్రతీర్థమని పేరువచ్చింది. ఇద్రుపుడ పూజలు చేసిన స్థలం సరస్వతీ దేవి మందిరానికి పూర్వభాగంలో ఒక మైలు దూరంలో గోదావరి నదీతీరమున ఉంది. దీనిని ప్రస్తుతం కుక్కుటేశ్వరం అని పిలుస్తారు. సూర్యుడు ఆకలి ని తట్టుకోలేక మంత్రోచ్ఛారణకు ముందుగానే భుజించ డంతో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధంతో సూర్యుడు కాంతి హీనుడ య్యాడు. కోనేరుకు ఆగ్నేయ భాగం లో స్నానం చేయ డంతో పూర్వ వైభవం వచ్చింది. సూర్యుడు పూజలు చేసిన చోట సరస్వతీ దేవికి ఆగ్నేయ దిశ గా అరమైలు దూరంలో గోదావరి నదీతీరాన ఉంది. ప్రస్తు తం దీనిని సూర్వేశ్వరమని పిలుస్తారు.

ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న వేదవ్యాసుడు తపస్సు చేసిన ప్రాంతాన్ని ఇప్పు డు వ్యాసతీర్థం అంటున్నారు. ఇక్కడ వ్యాసమందిరం కూ డా ఉంది. వాల్మీకి మహార్షి కోనేరు నైరుతి దిశలో స్నానం చేసి శ్రీమద్రామాయణం రాశాడు. అందుకే పూజలు చేసిన స్థలం బాసర బస్టాండు సమీపంలో రోడ్డుకు కుడివైపున శ్రీవెంకటేశ్వర మందిరంగా వెలుగొందుతోంది. వినాయ కుడు అగ్రపూజ అర్హత పొందేందుకు కోనేరు వాయువ్య దశలో స్నానం చేశాడు. గణేషుని మందిరం బాసర గ్రా మం నుంచి సరస్వతీ మందిరానికి వెళ్లే మార్గంలో ఉంది.

park

దశరథుడు ఉత్త ర తీరంలో స్నానం చేయడంతో దీనిని పుత్రతీర్థం అంటున్నారు. కుమారస్వామి పూజలు చేసిన స్నా నం కుమారతీర్థం, ఈశాన్య దిశలో ఈశ్వరుడు స్నానం చేసి దేవిని ధ్యానించిన ప్రాంతాన్ని శివతీర్థం అని పిలు స్తారు. సరస్వతీ మందిరానికి ఉత్తారన ఒక మైలు దూరం లో పాపహరేశ్వరాలయమని పిలుస్తారు. కోనేరులోని మధ్యభాగంలో ఉన్న దానిని సరస్వతీ తీర్థం అని పిలు స్తారు. దీనికి ఎనిమిది దిక్కుల ఎనిమిది పుణ్య తీర్థాలు ఉన్నాయి.


Post: #2

అద్భుతం సుమణి వెంకట్ గారు,

ఇంత ముఖ్యమైన విశయాన్ని మన ఫోరం సభ్యులకు వివరంగా అందించినందుకు ధన్యవాధాలు..

ఇలాంటి విశయాలను వివరంగా అందించడంలో మీకు మీరే సాటి సుమా...

ఇలాగే మంచి మంచి విశయాలను మాకు నిత్యం అందించాలని కోరుకుంటూ....

మీ.....


REL
You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)