Post: #1

హనుమానాసనము


హనుమానాసనముః


భక్తిని ప్రదర్శించు భంగిమలో ఉన్నది గాన, పరమభక్తుడైన హనుమంతుని పేరుతో హనుమానాసనమనిరి. ఇందు వివిధ భంగిమలు గలవు.

చేయు విధానముః


భూమాసనమునకు కాళ్ళు ప్రక్కలకు చాచినట్లుగాకుండా కాళ్ళు వెనుక ముందులకు దండములవలే సమముగా నేలకు ఆనించి కూర్చొనవలెను. వెన్నుపాము 900 స్థితిలో నిలువుగా నిలబెట్టి రెండు చేతులను హృదయానికి హత్తించి నమస్కరించవలెను. కళ్ళు మూసుకుని దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ధ్యానించవలెను.

శరీరము, కాళ్ళు అంతగా సాగనివారు, ముందుకాలు పాదము నేలకు ఆనించి వెనుక కాలు వెనుకకు సాఫీగా చాచి నడుమును నిగిడించి, రెండు చేతులను హృదయానికి జోడించి నమస్కరించుటను కూడా హనుమానాసనము అంటారు.

ఫలితములుః


నాడీమండలము శుద్ధి జరిగి అంగప్రత్యంగములకు అన్ని ప్రవాహములు నిరాటంకముగా జరుగును గాన దేహశుద్ధి మరియు మనశ్శుద్ధి కలుగును.

మీ అమూల్యమైన సలహాలను సందేహములను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)